ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా నడి రోడ్డు మీదనే పడుకున్నారు. చలి వణికిస్తున్నా లెక్కచేయకుండా మంత్రులు, మద్దతుదారులతో కలిసి రైల్ భవన్ ఎదుటే రాత్రంతా గడిపారు. డ్రగ్స్, వ్యభిచార రాకెట్పై దాడి చేయడానికి నిరాకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలన్న డిమాండ్తో ఆయన మళ్లీ ఉద్యమబాటలోకి వెళ్లిన విషయం తెలిసిందే.