అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేసిందని ముగ్గురు సభ్యులతో కూడిన షుంగ్లు కమిటీ కడిగి పారేసింది. ఈ కమిటీని పాత లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించారు. పార్టీ కార్యాలయం కోసం ఆప్‌కు భూమి కేటాయింపు, మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్నెతను ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మిషన్ డైరెక్టర్‌గా నియమించడం, పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను సలహాదారులుగా వేసుకోవడం లాంటి నిర్ణయాలను తూర్పారబట్టింది. భారత రాజ్యాంగంలోని 239ఎఎ (3)ఎ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీకి బదిలీ అయిన అన్ని విషయాల్లోనూ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఏమాత్రం సంప్రదించాల్సిన అవసరం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలిన అధికారులకు సూచిస్తూ కేజ్రీవాల్ స్వయంగా 2015 ఏప్రిల్ నెలలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా కమిటీ తప్పుబట్టింది.