shunglu committee
-
ఢిల్లీ సీఎంకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలకు ముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో ఆప్ కార్యాలయాన్ని సాధ్యమైనంత త్వరగా ఖాళీచేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్ సీఎం కేజ్రీవాల్ కు ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ను సంప్రదించకుండా పార్టీ కోసం భూమి కేటాయించుకోవడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే గతంలో ఎల్జీగా చేసిన నజీబ్ జంగ్ ఆప్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ముగ్గురు సభ్యులతో కూడిన వీకే షుంగ్లూ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ ఇద్దరు కలిసి పనిచేయాల్సి ఉంటుందని, కానీ ఆప్ ప్రభుత్వం సొంత నిర్ణయాలపై కమిటీని నియమించారు. ఆ కమిటీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం కార్యాలయ భవన నిర్మాణానికి ఎల్జీని సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా భూమి కేటాయించడం ఏ విధంగానూ చెల్లుబాటు కాదని, అలాగే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌కు నివాస భవనం ఎలా కేటాయిస్తారని కూడా షుంగ్లు కమిటీ ఇటీవల ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాలపై కమిటీ దాదాపు 100 పేజీల నివేదిక సిద్ధం చేసింది. ఎల్జీ అనుమతి లేకుండా మంత్రులు విదేశీ ప్రయాణాలు, న్యాయవాదుల నియామకం విషయాలలో ఆప్ ప్రభుత్వ చర్యలను తప్పుబట్టింది. షుంగ్లు కమిటీ ఏవైనా అక్రమాలను గుర్తిస్తే, కేజ్రీవాల్ సహా సంబంధిత మంత్రులు క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిటీ వేసిన సమయంలోనే నజీబ్ జంగ్ హెచ్చరించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో చర్చించకుండా.. పార్టీ ఆఫీసు కోసం భూమి కేటాయింపు, మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్తెను ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మిషన్ డైరెక్టర్‌గా నియమించడం, పలువురు పార్టీ నేతలకు సహాయదారులుగా బాధ్యతలు అప్పగించడంపై షుంగ్లూ కమిటీ తమ నివేదికలో ప్రశ్నించింది. సీఎం కేజ్రీవాల్ ను ఆయన ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసేందుకు రూ.97 కోట్లు ఖర్చు చేయడంపై ఎల్జీ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేయడంపై కేజ్రీవాల్ ను వివరణ కోరడంతో పాటు ఆ డబ్బును తిరిగి ప్రభుత్వ సొమ్ముగా డిపాజిట్ చేయాలని ఇటీవల సూచించిన విషయం విదితమే. -
గబ్బర్‌సింగ్గే అహింస గురించి మాట్లాడినట్టు..
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేసిందంటూ షుంగ్లు కమిటీ ఇచ్చిన నివేదికతో ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ నివేదికను అస్త్రంగా చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీఎం కేజ్రీవాల్‌పై విరుచుకుపడుతున్నాయి. కేజ్రీవాల్ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. కేజ్రీవాల్‌కు ఏమాత్రం అంతరాత్మ ఉన్నా.. వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను, షుంగ్లూ కమిటీ నివేదికను ఆప్ తోసిపుచ్చింది. కీలకమైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రస్తుత తరుణంలో ఈ నివేదికను బయటపెట్టడంతోనే దీని వెనుక రాజకీయాలు అర్థమవుతున్నాయని పేర్కొంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రంగా మండిపడింది. 'కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే... (షోలే విలన్) గబ్బర్‌సింగ్ అహింస గురించి ఉపన్యాసం ఇచ్చినట్టు కనిపిస్తున్నది' అని ఆప్ నేత అశుతోష్ ఎద్దేవా చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన షుంగ్లు కమిటీని పాత లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయం కోసం ఆప్‌కు భూమి కేటాయింపు, మంత్రి సత్యేంద్ర జైన్ కూతురిని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మిషన్ డైరెక్టర్‌గా నియమించడం, పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను సలహాదారులుగా వేసుకోవడం లాంటి నిర్ణయాలను ఈ కమిటీ తూర్పారబట్టింది. -
ముఖ్యమంత్రిని కడిగి పారేసిన షుంగ్లు కమిటీ
-
ముఖ్యమంత్రిని కడిగి పారేసిన షుంగ్లు కమిటీ
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేసిందని ముగ్గురు సభ్యులతో కూడిన షుంగ్లు కమిటీ కడిగి పారేసింది. ఈ కమిటీని పాత లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించారు. పార్టీ కార్యాలయం కోసం ఆప్‌కు భూమి కేటాయింపు, మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్నెతను ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మిషన్ డైరెక్టర్‌గా నియమించడం, పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను సలహాదారులుగా వేసుకోవడం లాంటి నిర్ణయాలను తూర్పారబట్టింది. భారత రాజ్యాంగంలోని 239ఎఎ (3)ఎ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీకి బదిలీ అయిన అన్ని విషయాల్లోనూ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఏమాత్రం సంప్రదించాల్సిన అవసరం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలిన అధికారులకు సూచిస్తూ కేజ్రీవాల్ స్వయంగా 2015 ఏప్రిల్ నెలలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా కమిటీ తప్పుబట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం కార్యాలయ భవన నిర్మాణానికి ఆప్ ప్రభుత్వమే భూమి కేటాయించడం ఏ విధంగానూ చెల్లుబాటు కాదని, అలాగే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌కు నివాస భవనం ఎలా కేటాయిస్తారని కూడా షుంగ్లు కమిటీ ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ప్రశ్నిస్తూ కమిటీ దాదాపు 100 పేజీల నివేదిక సిద్ధం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ను సంప్రదించకుండా సలహాదారులను నియమించుకునే అధికారం కేజ్రీవాల్‌కు గానీ, ఆయన మంత్రివర్గానికి గానీ లేదని తెలిపింది. అలాగే అవినీతి నిరోధక శాఖలో అధికారుల నియామకాలు, బదిలీలపై నిర్ణయాలు తీసుకోవడాన్ని కమిటీ ప్రశ్నించింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా మంత్రులు విదేశీ ప్రయాణాలు చేయడం, న్యాయవాదులను నియమించడం లాంటివాటినీ తప్పుబట్టింది. ఈ కమిటీ ఏవైనా అక్రమాలను గుర్తిస్తే, కేజ్రీవాల్ క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉండొచ్చని గతంలో నజీబ్ జంగ్ అన్నారు. ఇప్పుడు పరిస్థితి దాదాపు అలాగే ఉంది. దీనిపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.