'సీఎంను కలిసేందుకు మోదీ విముఖత' | PM Narendra Modi Refused to Meet Arvind Kejriwal, Says AAP | Sakshi
Sakshi News home page

'సీఎంను కలిసేందుకు మోదీ విముఖత'

Published Tue, Jun 30 2015 4:26 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

PM Narendra Modi Refused to Meet Arvind Kejriwal, Says AAP

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యేందుకు నిరాకరించారని ఆప్ వర్గాలు తెలిపాయి. మోదీ తీరికలేకుండా ఉన్నారని ప్రధాని కార్యాలయం అధికారులు చెప్పినట్టు వెల్లడించారు.

'10 రోజుల క్రితం ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ కేజ్రీవాల్ లేఖ రాశారు. అయితే ఇప్పటికీ సమయం ఇవ్వలేదు. ప్రధాని జాతీయ వ్యవహరాలతో తీరికలేకుండా ఉన్నారని మాకు సమాచారం ఇచ్చారు' అని కేజ్రీవాల్ సలహాదారు నాగేంద్ర శర్మ చెప్పారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీమ్ జంగ్తో ఏర్పడ్డ విభేదాల గురించి చర్చించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. సెల్ఫీలు దిగేందుకు మోదీకి సమయం ఉంది కానీ సీఎంతో మాట్లాడేందుకు తీరికలేదా అని ఓ ఆప్ లీడర్ విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement