గోవాపై కేజ్రీవాల్కున్నది కృత్రిమప్రేమ
పనాజీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గోవా పర్యటనకు రావడాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గోవాపై కేజ్రీవాల్కున్నది కృత్రిమమైన ప్రేమని, ఎన్నికల్లో లబ్ధిపొందటానికి మాత్రమే వచ్చారని గోవా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి టోజనొ డిమెల్లో అన్నారు.
గోవా ప్రజలపై కేజ్రీవాల్ లేనిపోని ప్రేమ వ్యక్తం చేస్తున్నారని, ఇక్కడి ప్రజలను మోసం చేసి, దోచుకోవడానికి వస్తున్నారని చెప్పారు. గోవాలోని భూవనరులపై కేజ్రీవాల్ కన్నుపడిందని, ఢిల్లీవాలాలకు ఏజెంట్ అని డిమెల్లో విమర్శించారు. గత ఆదివారం గోవా పర్యటనకు వెళ్లిన కేజ్రీవాల్ కాంగ్రెస్పై విమర్శులు చేశారు. వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేదని అన్నారు.