
సుప్రీం కోర్టులో సీఎంకు ఊరట
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్పై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్లోని అమేథి కోర్టుకు ప్రస్తుతానికి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరంలేదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ సీఎం తరపున ఆయన న్యాయవాది అమేథి కోర్టులో వాదనలు వినిపించవచ్చని వెసులుబాటు కల్పించింది.
అమేథి కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు. అమేథి కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి కేజ్రీవాల్ కు మినహాయింపు ఇచ్చిందని రాజీవ్ చెప్పారు.