మన దేశ రాజధానిని చారిత్రాత్మక ప్రాధాన్యత తోపాటు విభిన్న సంస్కృతుల కలబోతగా పేర్కొనవచ్చు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అనంతరం కొత్త సీఎంగా అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కాగా మూడో మహిళ సీఎంగా నిలవడం విశేషం. పంజాబీ కుటుంబానికి చెందిన మన కొత్త సీఎం ఇష్టంగానే తినే వంటకం గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మన దేశ రాజధాని ఆహ్లాదపరిచే వివిధ వంటకాల సమ్మేళనాలకు ప్రతీకగా ఉంటుంది. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు విభిన్న సంస్కృతుల రుచులు ఇక్కడ కనిపిస్తాయి. అలాంటి ఢిల్లీకి సీఎం కానున్న అతిషి ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తాం అనే వాగ్దానంతో ప్రజల్లోకి బలంగా వచ్చిన నాయకురాలు. అయితే ఆమె ఒక ఇన్‌స్టాగ్రాం వీడియోలో తనకు ఇష్టమనే రెసీపీ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తనకు 'రాజ్మా చావలె' అంటే మహాఇష్టమని చెప్పారు.
పంజాబీ వంటకమైన ఈ మసాల రెసిపీ సంపూర్ణంగా తిన్న ఫీల్‌ని అందిస్తుంది. దీన్ని వండటం చాల సులభం. అప్పటికప్పుడూ ఇంట్లో ఉండే మసాలా దినుసులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉత్తర భారత వంటకాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చారు. మరింత రుచికరంగా ఉండాలంటే.. ఈ రాజ్మా కర్రీలో చివరగా కాస్త క్రీమ్ లేదా వెన్నని జోడిస్తే ఆ రుచే వేరేలెవెల్ అని అన్నారు. అయితే ఆమె తాను స్వయంగా వండటంలో ఇబ్బంది లేదు గానీ తానే ఆ కూర తినాలంటే మాత్రం కష్టమే అంటూ చమత్కరించారు.
(చదవండి: కాబోయే అమ్మలకే కాదు తండ్రులకు కావాలి సెలవు..!)
Comments
Please login to add a commentAdd a comment