MCD election results
-
ఢిల్లీ కాంగ్రెస్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. పెద్ద పొరపాటు చేశానంటూ..!
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పార్టీకి షాక్ ఇస్తూ ఢిల్లీ ఉపాధ్యక్షుడు అలీ మెహది, పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పనితీరు నచ్చడం వల్లే వాళ్లు తాము ఆప్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని అలీ మెహది చెప్పారు. రాజధాని అభివృద్ధిలో తామూ భాగస్వాములవుతామన్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని పేర్కొన్నారు. పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు అలీ మెహది. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. తాను పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు చెబుతూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను రాహుల్ గాంధీ నమ్మకస్తుడినైన కార్మికుడిగా పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ముస్తఫాబాద్, బ్రిజ్‌పురి కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్‌లు సైతం తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. అర్ధరాత్రి 1.25 గంటలకు వీడియో పోస్ట్ చేశారు అలీ మెహది.. చేతులు జోడించి ‘నేను పెద్ద పొరపాటు చేశాను. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాను. నా తండ్రి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు. పలుమార్లు పార్టీ అధిష్ఠానానికి, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. తనతో వచ్చిన కౌన్సిలర్లు సైతం క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేయాలని కోరారు. వీడియో విడుదల చేసిన గంటన్నర తర్వాత మరో ట్వీట్ చేశారు అలీ మెహది. ‘బ్రిజ్‌పురి కౌన్సిలర్ నాజియా ఖాటూన్, ముస్తఫాబాద్ కౌన్సిలర్ సబిలా బేగం, 300 ఓట్ల మార్క్‌తో ఓడిపోయిన బ్లాక్ ప్రెసిడెంట్ అలీమ్ అన్సారీ ఇప్పటికీ రాహుల్ జీ, ప్రియాంక జీలకు నమ్మకమైన కార్మికులు. రాహుల్ గాంధీ జిందాబాద్.’ అని పేర్కొన్నారు. వీడియోలో కనిపించిన మరో ముగ్గురు సైతం ఆప్‌ను కలిశారు. श्री @RahulGandhi जी के जो सच्चे सिपाही होते हैं उन्हें कुछ समय के लिए दिग्भ्रमित किया जा सकता है लम्बे समय के लिए नहीं। शुक्रिया भाई @alimehdi_inc जी का जिन्होंने कुछ पल में ही गलती सुधार ली। आप कांग्रेस के जन्मजात सच्चे सिपाही हो, गलती इंसान से हो जाती है। @INCDelhi pic.twitter.com/UaqMUQGjMZ — Minnat Rahmani (@MRahmaniINC) December 10, 2022 ఇదీ చదవండి: Manneguda Young Woman Kidnap Case: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి -
గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు
న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని, అనూహ్య ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలిచిన వారంతా తమతోనే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, గుజరాత్, హిమచల్ ప్రదేశ్ ఎన్నికలు ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ ఢిల్లీని వరుసగా 15 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌ను అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టి ఓడించారని సీఎం భగవంత్ మాన్ గుర్తు చేశారు. అలాగే 15 ఏళ్లుగా ఎంసీడీని ఏలుతున్న బీజేపీని ఇప్పుడు మట్టి కరిపించారని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని బీజేపీ.. ఢిల్లీలో మొహరించిందని ఆరోపించారు. విద్వేష రాజకీయాలు వద్దు ఢిల్లీ ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారని సీఎం భగవంత్ మాన్ అన్నారు. ‘ఢిల్లీ వాసులు విద్వేష రాజకీయాలు ఇష్టపడటం లేదు. స్కూల్స్, ఆస్పత్రులు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కోసం ఓటు వేశార’ని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: హస్తినలో ‘ఆప్’ హవా.. ఢిల్లీ మేయర్‌గా మహిళ!) -
హస్తినలో ‘ఆప్’ హవా.. ఢిల్లీ మేయర్‌గా మహిళ!
న్యూఢిల్లీ: హస్తినలో మరోసారి ‘ఆప్’సత్తా చాటింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. దశాబద్దన్నరగా ఎంసీడీలో పాగా వేసిన కమలనాథులకు షాక్ ఇచ్చింది. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 104 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. మూడు చోట్ల ఇతరులు పాగా వేశారు. మహిళా మేయర్! ఢిల్లీ మహా నగర మేయర్ పీఠాన్ని ఈసారి మహిళకు కట్టబెట్టనున్నారు. మహిళను మేయర్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఆప్ తరపున పలువురు మహిళలు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి. ‘ఆప్’లో ఆనందం ఎంసీడీ ఎన్నికల్లో విజయంతో ‘ఆప్’ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రతికూల పార్టీని ఓడించడం ద్వారా ఢిల్లీ ప్రజలు నిజాయితీగా పనిచేసే అరవింద్ కేజ్రీవాల్‌ను గెలిపించారు. మాకు ఇది విజయం మాత్రమే కాదు, పెద్ద బాధ్యత’ని సిసోడియా ట్వీట్ చేశారు. (క్లిక్ చేయండి: ఢిల్లీలో బీజేపీకి బ్రేక్.. ఫలించిన కేజ్రీవాల్ ప్లాన్స్) బీజేపీకి తగిన గుణపాఠం ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టారన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి హస్తిన ఓటర్లు తగిన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరంగా మారుస్తామని హామీయిచ్చారు. -
బీజేపీ 15ఏళ్ల పాలనకు ‘ఆప్’ బ్రేకులు.. ఢిల్లీలో ఘన విజయం
దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ 15 ఏళ్ల జైత్రయాత్రకు బ్రేకులు వేసింది ఆప్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ విజయధుందుబి మోగించింది. మొత్తం 250 స్థానాలకు గానూ అవసరమైన మెజారిటీ 126 కాగా.. 134 సీట్లు సాధించింది. మరోవైపు.. బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 09 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 3 స్థానాలు గెలుపొందారు. ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్. ‘ఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనను కేజ్రీవాల్ కూకటివెళ్లతో పెకిలించారు. ఇప్పుడు ఎంసీడీలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించారు. విధ్వేషపూరిత రాజకీయాలను ఢిల్లీ ప్రజలు కోరుకోవటం లేదని ఈ ఎన్నికలు చెబుతున్నాయి. వారు పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్తు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కోసం ఓటు వేశారు’ అని పేర్కొన్నారు పంజాబ్ సీఎం. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేజ్రీవాల్ మాదిరిగా మఫ్లర్, టోపీ ధరించిన చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని మొత్తం 250 వార్డులకు డిసెంబర్ 4న పోలింగ్ జరిగింది. 1349 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో అప్పటి సీఎం షీలా దీక్షిత్ మూడు కార్పొరేషన్లుగా విభజించారు. తర్వాత తిరిగి 2022లో వాటిని విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. మే 22 నుంచి అమల్లోకి వచ్చింది. 2017 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 181 సీట్లు గెలుపొందగా.. ఆప్ 48, కాంగ్రెస్ 27 స్థానాలు గెలుచుకున్నాయి. అప్డేట్ 12:55PM విజయం దిశగా ఆప్.. 106 స్థానాలు కైవసం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం దిశగా ఆప్ దూసుకెళ్తోంది. ఇప్పటికే 106 స్థానాలు కైవసం చేసుకుంది. మరో 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ 126కు మంచి సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తు చేస్తున్నారు. అప్డేట్ 11:55AM ఢిల్లీ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. 250 వార్డులకు కౌంటింగ్ జరుగుతుండగా ఇప్పటి వరకు 75 స్థానాల్లో విజయం సాధించింది. మొదటి నుంచి హోరాహోరీ పోటీ కొనసాగినప్పటికీ బీజేపీ కాస్త వెనకబడింది. ప్రస్తుతం 55 స్థానాలను కైవసం చేసుకుంది కాషాయ పార్టీ. ఇంకా ఆప్ 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 48 వార్డుల్లో ముందంజలో ఉంది. తొలి ట్రాన్స్‌జెండర్ ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శస్తోంది. మరోవైపు.. ఎంసీడీ చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది. సుల్తాన్‌పురి-ఏ వార్డులో ఆప్ తరపున పోటీ చేసిన బోబి విజయం సాధించారు. దీంతో తొలిసారి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంసీడీ సభ్యులుగా ఎన్నికైనట్లయింది. #DelhiMCDPolls | AAP wins 75 seats and leads on 60, BJP wins 55 seats and leads on 48 seats as counting continues. Congress wins 4, leads on 5 and Independent candidates win 1 and lead on 2. Counting is underway for 250 wards. pic.twitter.com/XPLrBCq2Fz — ANI (@ANI) December 7, 2022 అప్డేట్ 10:25AM ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. బీజేపీ, ఆప్ పార్టీలు తలో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు.. ఇరు పార్టీలు 112 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ 12, స్వతంత్రులు 4, బీఎస్పీ, ఎన్సీపీలు ఒక్కోస్థానంలో ముందంజలో ఉన్నాయి. అప్డేట్ 10:00AM హోరాహోరీ ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. నిమిష నిమిషానికి ఆధిక్యం తారుమారవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆప్ 109, బీజేపీ 105, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. #DelhiMCDPolls | Latest official trends show AAP now leading on 109, BJP on 105 and Congress on 9 seats. Counting is underway for 250 wards. pic.twitter.com/OYguGITT03 — ANI (@ANI) December 7, 2022 న్యూఢిల్లీ: ఢిల్లీ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం 250 వార్డుల ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ప్రస్తుతం బీజేపీ 110, ఆప్ 100, కాంగ్రెస్ 9, ఎన్సీపీ 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మరోవైపు.. తమ పార్టీ 180 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్. తమ పార్టీ నుంచే మేయర్ ఎన్నికవుతారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కాబోతున్నాయని పేర్కొన్నారు. #DelhiMCDPolls | Latest official trends show BJP leading on 110 seats, AAP on 100, Congress on 9, Independent 3 & NCP on 1. Counting is underway for 250 wards. pic.twitter.com/UhoqKCjAS3 — ANI (@ANI) December 7, 2022 ఇదీ చదవండి: Delhi MCD Exit Poll 2022: టాప్‌లో ఆప్.. బీజేపీ మెరుగైన ప్రదర్శన.. మరి కాంగ్రెస్? -
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆల్కా లంబ
-
బంపర్ విక్టరీ సాధించినా.. సంబరాలకు దూరం
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ సంబరాలు చేసుకోరాదని బీజేపీ నిర్ణయించింది. తమ విజయాన్ని సుక్మాలో మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితమిస్తున్నట్టు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో సంబరాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి తెలిపారు. తమ విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నట్టు బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట హోర్డింగులు పెట్టారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం రిఫరెండంగా మనోజ్ తివారీ పేర్కొన్నారు. ‘ఎంసీడీ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్ సర్కారుపై రిఫరెండమని ముందే చెప్పాం. పాలకులను రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలని కేజ్రీవాల్ అడుగుతుంటారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఆయనను రీకాల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నార’ని తివారీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆప్ రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సివుంది. -
తొలి ఆధిక్యాల్లో బీజేపీ దూకుడు
-
తొలి ఆధిక్యాల్లో బీజేపీ దూకుడు
ఎన్నికల పండితులు చెప్పినదే నిజమయ్యేలా ఉంది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. కార్పొరేషన్ ఎన్నికల్లో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం 272 స్థానాలకు గాను 270 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఉత్తర ఢిల్లీలోని సరాయ్ పిపాల్, తూర్పు ఢిల్లీలోని మౌజ్పూ్ స్థానాల్లో అభ్యర్థులు మరణించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం ఉత్తర ఢిల్లీలో బీజేపీ 69, కాంగ్రెస్ 17, ఆప్ 15, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దక్షిణ ఢిల్లీలో బీజేపీ 74, కాంగ్రెస్ 15, ఆప్ 14, ఇతరులు 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తూర్పు ఢిల్లీలో బీజేపీ 39, కాంగ్రెస్ 13, ఆప్ 10, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ చివరకు వరకు కొనసాగితే మాత్రం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ మరోసారి చేజిక్కించుకోవడం ఖాయంలాగే కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యం కనబరిచినా, తాజా కార్పొరేషన్ ఎన్నికలలో పూర్తిగా చతికిలబడుతోంది. ఈవీఎంల గురించిన వివాదాలు, ఢిల్లీలో ప్రజారోగ్యం గురించిన విమర్శలు.. వీటన్నింటి నడుమ ఈ ఎన్నికలు జరగడం, వాటిలో బీజేపీ ఆధిక్యం చూపిస్తుండటం విశేషం.