పంజాబ్‌ సీఎం మాన్‌ సంచలన నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్‌ | Punjab CM Bhagwant Mann Chairs First Cabinet Meet | Sakshi

పంజాబ్‌ సీఎం మాన్‌ సంచలన నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్‌

Mar 19 2022 9:17 PM | Updated on Mar 19 2022 9:18 PM

Punjab CM Bhagwant Mann Chairs First Cabinet Meet - Sakshi

ఛండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకుని ఆప్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చింది. సీఎం భగవంత్‌ మాన్‌.. 10 మంది ఎమ్మెల్యేలతో శుక్రవారం కేబినెట్‌ విస్తరణ చేశారు. ఈ క్రమంలో శనివారం మంత్రుల తొలి సమావేశంలోనే మాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ మంత్రివర్గం 25వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో పోలీసు శాఖలో 10 వేల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో 15 వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఓ నెల‌లోపే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ల జారీకి కేబినెట్ ఓకే చెప్పటం విశేషం.

కాగా, పంజాబ్ యువ‌కులకు ఉద్యోగాలు క‌ల్పించాల‌న్నదే తమ ప్రభుత్వ ప్రథ‌మ ప్రాధాన్యం అంటూ మాన్‌ కామెంట్స్‌ చేశారు. ఎన్నికలకు ముందు తాము వాగ్దానం చేసినట్లుగానే ఆమ్‌ ఆద్మీ పార్టీ.. పంజాబ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు మాన్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement