ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి కాదని.. ఆయన ఒక సిద్ధాంతమని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు. వ్యక్తిని అర్టెస్ చేయవచ్చు. కానీ సిద్ధాంతాన్నిఅరెస్ట్ చేయలేరని అన్నారు. ఢిల్లీలో ఆప్ నిర్వహించిన బహిరంగ సభలో భగవంత్ సింగ్ పాల్గొని మాట్లాడారు.
‘‘అరవింద్ కేజ్రీవాల్ దేశంలోనే అత్యంత ప్రజాదారణ కలిగి ఉన్న నేత. ఆయన విషయంలో ఏం జరగిందో మొత్తం దేశం చూసింది. దేశంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి కాదు.. ఒక సిద్ధాంతం. వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు. కానీ సిద్ధాంతాన్ని అరెస్ట్ చేయలేరు.
మే 25న బీజేపీ పని అయిపోతుంది. పంజాబ్‌లో 13 స్థానాల్లో ఆప్ గెలుస్తుంది. ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ బ్యాటింగ్ చేయడానికి పోలిటికల్ పిచ్‌కు వచ్చారు. ఆయన అవుట్ కాలేదు. కేవలం రిటైర్డ్ హర్ట్ అయ్యారు. అదే రాజకీయ క్షేత్రంలోకి మళ్లీ తిరిగి వచ్చారు’’ అని భగవంత్ సింగ్ అన్నారు.
ఢిలీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ నిన్న(శుక్రవారం) మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు సుప్రీం కోర్టు మధ్యత బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment