'రాజకీయ గూండా గారడీ'కి వ్యతిరేకంగా పోరాడతామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) లోక్సభ సభ్యులు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: 'రాజకీయ గూండా గారడీ'కి వ్యతిరేకంగా పోరాడతామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) లోక్సభ సభ్యులు స్పష్టం చేశారు. కొత్తగా లోక్సభలో అడుగుపెట్టిన నలుగురు ఆప్ ఎంపీలు ప్రతిన బూనారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణమని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తేస్తామన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించుకున్న వంద రోజుల కార్యక్రమం తర్వాత ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. 101 రోజు నుంచే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆప్ ఎంపీ భగవంత్ మాన్ తెలిపారు. అపరిష్కృత సమస్యలపై మోడీ సర్కారును కడిగేస్తామన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు నీచ రాజకీయాలే కారణమని ధ్వజమెత్తారు.