భగవంత్ మన్, కేజ్రీవాల్
ఛండీగఢ్: శిరోమణి అకాలీదళ్ నేత, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ క్షమాపణలు కోరటం ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. కేజ్రీవాల్ చర్యకు నిరనసగా ఆ పార్టీ పంజాబ్ విభాగం అధ్యక్ష పదవికి భగవంత్ మన్ రాజీనామా చేశారు. ‘పంజాబ్ ఆప్ అధ్యక్షుడిగా తప్పుకుంటున్నా. కానీ, రాష్ట్ర పౌరునిగా అవినీతి, డ్రగ్స్ మాఫియాపై పోరాటం కొనసాగిస్తా’ అని ట్వీట్‌చేశారు. డ్రగ్స్ మాఫియాతో మజీతియాకు సంబంధాలున్నాయని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. దీనిపై మజీతియా కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. దీంతో కేజ్రీవాల్ ఆయనను క్షమాపణలు కోరుతూ లేఖ రాశారు. కాగా, ఎల్‌ఐపీ నేతలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఆప్‌కు దూరం కావాలని తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment