vikram singh
-
హైదరాబాద్ ఇన్చార్జి సీపీగా విక్రమ్‌సింగ్ మాన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ మాన్ నియమాకమయ్యారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం బదిలీ చేసిన విషయం తెలసిందే. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. నేటి సాయంత్రం 5 గంటలలోగా బదిలీ అయిన వారి స్థానాల్లో ఒక్కోపోస్టుకు ముగ్గురి చొప్పున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లను తమకు ప్రతిపాదించాలని సర్కారుకు స్పష్టం చేసింది. డీజీపీ ఉత్తర్వులు ఈ నేపథ్యంలో బదిలీ అయినవారి స్థానంలో ఇన్చార్జిలను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ సీపీగా విక్రమ్‌సింగ్ మాన్, వరంగల్ సీపీగా డీ.మురళీధర్, నిజామాబాద్ సీపీగా ఎస్.జయరాంను నియమించారు. సూర్యాపేట ఎస్పీగా ఎం.నాగేశ్వర్రావు, సంగారెడ్డి ఎస్పీగా పీ.అశోక్, కామారెడ్డి ఎస్పీగా కే.నరసింహారెడ్డి, జగిత్యాల ఎస్పీగా ఆర్.ప్రభాకర్‌రావు, మహబూబ్‌నగర్ ఎస్పీగా అందెరాములు, నాగర్‌కర్నూల్ ఎస్పీగా సీహెచ్.రామేశ్వర్, గద్వాల ఎస్పీగా ఎన్ వి, మహబూబాబాద్ ఎస్పీగా జే.చెన్నయ్య, నారాయణ్‌పేట ఎస్పీగా కే.సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా ఏ.రాములును నియమించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లతో కూడిన బృందం ఈనెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది.ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, నిబంధనల అతిక్రమణ, తమ దృష్టికి వచ్చిన ఇతర అంశాల ఆధారంగానే పెద్ద సంఖ్యలో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. మరో నాలుగు రాష్ట్రాల్లోనూ బదిలీలు.. తెలంగాణతోపాటు శాసనసభ సాధారణ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో వేటుపడిన వారిలో 9 మంది కలెక్టర్లతోపాటు పలువురు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ఉన్నారు. -
రా RAW రాజు
‘కాలం కలిసి రావాలి’ అంటూ కాలాన్ని మాత్రమే నమ్ముకునే వారు ఒక రకం.‘కాలం కలిసి రావాలి అంటే కష్ట పడాలి’ అనుకునే వారు రెండో రకం. ‘రైతుబిడ్డ’ విక్రమ్‌సింగ్ రెండో రకానికి చెందిన కుర్రాడు.తన నాయకత్వ లక్షణాలతో ‘ఆఫ్‌బిజినెస్’కు కొత్త వెలుగు తీసుకువచ్చాడు... హరియాణా మహేంద్రగఢ్ జిల్లాలోని మల్రా గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన విక్రమ్‌సింగ్ ఖరీదైన స్కూళ్లలో ఎప్పుడూ చదువుకోలేదు. ఆరవతరగతిలో మాత్రమే ఇంగ్లీష్ చదువుకునే అవకాశం వచ్చింది. స్కూల్ పూర్తయిన తరువాత పొలానికి వెళ్లి తండ్రికి సహాయం చేసేవాడు.‘ఏ పనైనా ఇష్టంగా చేయాలి. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. నువ్వు కూడా చదువును ఇష్టంగా చదువుకోవాలి. చదువుకోవడం నా వల్ల కాదు అనిపిస్తే నాతో పా టు పనిచెయ్యి’ అనే వాడు నాన్న. మరోవైపు స్నేహితులు...‘నువ్వు రెజ్లర్ కాకపో తే జీవితంలో ఏది సాధించలేవు’ అనేవారు. ఆప్రాం తంలో రెజ్లింగ్ బాగా పాపులర్. ప్రైజ్‌మనీ కూడా భారీగా ఉండేది. స్నేహితుల మాటలతో రెజ్లర్ కావాలనే ఆశ విక్రమ్‌లో మొలకెత్తింది. ఎక్కడ రెజ్లింగ్ పొటీలు జరిగినా వెళ్లేవాడు. ఇది గమనించిన టీచర్ ‘నువ్వు చదువులో ముందున్నావు. నీకు మంచి భవిష్యత్ ఉంది. ఇలా రెజ్లింగ్ అంటూ ఊళ్లు తిరిగితే చదువు దెబ్బతింటుంది’ అని హెచ్చరించాడు. ఇక అప్పటి నుంచి తన మనసులో నుంచి ‘రెజ్లింగ్’ను డిలిట్ చేశాడు విక్రమ్.ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత దిల్లీలో ఎంబీఏ చేశాడు. ఆ తరువాత కామర్స్ అండ్ ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఆఫ్‌బిజినెస్’లో చేరాడు. మూడు సంవత్సరాల తరువాత విక్రమ్ దశ తిరిగింది. ‘ఆఫ్‌బిజినెస్’కు ఉన్న మూడు యూనిట్లలో ఒకటైన ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సరిౖయెన వ్యక్తుల కోసం కంపెనీ పెద్దలు చూస్తున్న సమయంలో వారికి విక్రమ్ పేరు తట్టింది. అలా విక్రమ్ ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు హెడ్ అయ్యాడు. ‘రా మెటీరియల్స్ ఎట్ లోయెస్ట్ ప్రైసెస్–గ్యారెంటీడ్’ అనే మాటలో మాంత్రికశక్తి లేకపో వచ్చు. అయితే దీన్ని కస్టమర్లలోకి బలంగా తీసుకెళ్లడంలో విక్రమ్ విజయం సాధించాడు. ఫ్రెషర్స్‌తో తనదైన ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకోని, అడుగులో అడుగు వేస్తూ మెల్లగా నడుస్తున్న యూనిట్‌ను పరుగెత్తేలా చేశాడు. కోట్ల టర్నోవర్‌కు చేర్చాడు. ‘విక్రమ్‌లో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మా నమ్మకాన్ని నిలబెట్టాడు’ అంటున్నాడు ‘ఆఫ్‌బిజినెస్’ సీయీవో ఆశీష్ మహాపా త్రో. ‘అదృష్టం కష్టం వైపు మొగ్గు చూపుతుంది అంటారు. నేను కష్టాన్నే నమ్ముకున్నాను. రైట్ ప్లేస్‌లో రైట్పర్సన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పుడే విజయం సాధించగలం’ అంటున్న 29 సంవత్సరాల విక్రమ్‌సింగ్ ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. -
కేజ్రీవాల్ క్షమాపణలు.. మన్ రాజీనామా
-
కేజ్రీవాల్ క్షమాపణలు.. మన్ రాజీనామా
ఛండీగఢ్: శిరోమణి అకాలీదళ్ నేత, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ క్షమాపణలు కోరటం ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. కేజ్రీవాల్ చర్యకు నిరనసగా ఆ పార్టీ పంజాబ్ విభాగం అధ్యక్ష పదవికి భగవంత్ మన్ రాజీనామా చేశారు. ‘పంజాబ్ ఆప్ అధ్యక్షుడిగా తప్పుకుంటున్నా. కానీ, రాష్ట్ర పౌరునిగా అవినీతి, డ్రగ్స్ మాఫియాపై పోరాటం కొనసాగిస్తా’ అని ట్వీట్‌చేశారు. డ్రగ్స్ మాఫియాతో మజీతియాకు సంబంధాలున్నాయని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. దీనిపై మజీతియా కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. దీంతో కేజ్రీవాల్ ఆయనను క్షమాపణలు కోరుతూ లేఖ రాశారు. కాగా, ఎల్ఐపీ నేతలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఆప్‌కు దూరం కావాలని తీర్మానించారు. -
కేజ్రీవాల్ రాజీమార్గం
చండీగఢ్: శిరోమణి అకాలీ దళ్ నేత, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియాకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. మాదక ద్రవ్యాల రాకెట్‌తో మజీతియాకు సంబంధముందంటూ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ సమయంలో రాష్ట్ర కేబినెట్ మంత్రి కూడా అయిన మజీతియా కోర్టులో కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఈ ఆరోపణలు అవాస్తవాలని ఇటీవల కేజ్రీవాల్ అంగీకరించటంతోపాటు తనకు కోర్టులో లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పారని మజీతియా చెప్పారు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో చెప్పారు. కేజ్రీవాల్ క్షమాపణలను స్వీకరిస్తున్నానన్నారు. కేజ్రీవాల్‌తోపాటు క్షమాపణలు చెప్పిన ఆప్ నేత ఆశిష్ ఖేతాన్‌పై వేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై ఆప్ ఢిల్లీ విభాగం అధికార ప్రతినిధి భరద్వాజ్ మాట్లాడుతూ ‘సీఎం కేజ్రీవాల్‌పై వారణాసి, అమేథీ, పంజాబ్, అస్సాం, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో 20కి పైగా సివిల్, క్రిమినల్ కేసులున్నాయి. వీటి కోసం ముఖ్యమంత్రి బాధ్యతలను పక్కనబెట్టి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ కేసులన్నీ ఆయన రాజకీయ ప్రత్యర్ధులు పెట్టినవే. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత వరకు రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని పార్టీ న్యాయవిభాగం నిర్ణయించింది’ అని అన్నారు. ఓ కేసుకు సంబంధించి కేంద్రమంత్రి జైట్లీకి కూడా కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. -
సంక్రాంతి కోడిపందాలపై ప్రత్యేక దృష్టి
నరసాపురం రూరల్ , న్యూస్‌లైన్ : రానున్న సంక్రాంతి పర్వదినాల్లో కోడిపందాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు. ఇందుకోసం గ్రామాల వారీ బీట్ కు కానిస్టేబుళ్లను నియమిస్తామన్నారు. ఆదివారం నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీకి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడిపందాలను నియంత్రించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, రాత్రివేళల్లో కానిస్టేబుళ్ల బీట్లు ముమ్మరం చేశామన్నారు. తొలుత ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. విలేజ్ విజిటింగ్‌పై దృష్టి సారించి రానున్న రోజుల్లో నేరాలు అదుపులోకి తెచ్చేందుకు సిబ్బందిని కూడా పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందుతున్న 150 మంది ఎస్సైలు జనవరిలో విధుల్లో చేరతారన్నారు. దొంగనోట్ల చలామణిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీఐజీ సమాధానమిస్తూ ఈ వ్యవహారం ఏలూరు రేంజ్ పరిధికి మాత్రమే సంబంధించింది కాదని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే కొంత వరకు సమాచారం లభించిందన్నారు. బంగ్లాదేశ్ నుంచి నకిలీ కరెన్సీ వస్తోందన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే ఇక్కడకు వచ్చానని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న కేసులను పరీశీలించేందుకు సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. మెరైన్ పోలీస్ స్టేషన్ విషయం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందని, కృష్ణాజిల్లా పాలకాయతిప్ప గ్రామంలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఒకటి నిర్మాణంలో ఉందన్నారు. ఆయన వెంట డీఎస్పీ రఘువీర్‌రెడ్డి, సీఐ నాగమురళి, రూరల్ ఎస్సై గుజ్జర్లపూ డి దాసు, మొగల్తూరు ఎస్సై ఆకుల రఘు ఉన్నారు.