పారేసింది... పట్టుకున్నారు... | Mother leave female child | Sakshi
Sakshi News home page

పారేసింది... పట్టుకున్నారు...

Published Wed, Oct 7 2015 7:33 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

Mother  leave female child

నవమాసాలు మోసి.. కన్న బిడ్డను ఓ తల్లి రోడ్డుపై పడేసేందుకు యత్నించింది. ఈ ఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎన్.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... కాప్రా జమ్మిగడ్డలో నివసించే జయ (21) బిహార్‌కు చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల క్రితం వీరు విడిపోయారు.

కాగా, అప్పటి నుంచి జయ తాగుడుకు బానిసై బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. జయ నెలన్నర క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మంగళవారం రాత్రి జయ చిత్తుగా మద్యం తాగి ఆటోలో వెళుతూ నేరేడ్‌మెట్ మూడు గుళ్ల వద్ద ఒడిలో ఉన్న పసికందును రోడ్డుపై పడేసేందుకు యత్నించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

జయను, పసి కందును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు జయను విచారించి మల్కాజిగిరి మారుతినగర్‌లో నివసించే జయ సోదరి మీనాకు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement