చెన్నై : డీఎంకే ఎంపీ జగత్రక్షకన్‌కు భారీ షాకిచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయనకు ఏకంగా రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటికే ఈ కేసులో కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇప్పుడు భారీ ఫైన్‌తో చర్యలు తీసుకుంది.
ఫెమా నిబంధనలు ఉల్లంఘన కేసులో బుధవారం ఈడీ అధికారులు తమిళనాడులో వ్యాపారవేత్త, డీఎంకే ఎంపీ జగత్రక్షకన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపారు. ఫెమా చట్టం సెక్షన్ 37ఏ కింద రూ.89.19 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్ చేయడంతో పాటు రూ.908 కోట్లు జరిమానా విధించినట్లు ఎక్స్ వేదికగా ఈడీ వెల్లడించింది.
ED, Gurugram has provisionally attached assets worth Rs. 294.19 Crore in the form of Lands, Buildings, Flats and FDR under the provisions of the PMLA, 2002 in the case of M/s Sunstar Overseas Ltd. & Others.
— ED (@dir_ed) August 28, 2024
జగత్రక్షకన్ ఎవరు?
జగత్రక్షకన్ తమిళనాడు డీఎంకే అరక్కోణం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పాటు పలు రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్‌పై ఈడీ కేసు
అయితే డిసెంబర్ 1,2021లో డీఎంకే ఎంపీ జగత్రక్షకన్, అతని కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలు ఫెమాలోని సెక్షన్ 16 కింద నిబంధనల ఉల్లంఘించినట్లు ఫిర్యాదు అందినట్లు ఈడీ తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా తాము విచారణ చేపట్టామని, విచారణలో జగత్రక్షకన్‌పై ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ భారీ మొత్తంలో ఫైన్ విధించినట్లు ఈడీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment