సాక్షి, చైన్నె : తూత్తుకుడిలో అల్పాహారం పథకం వివాదానికి తెర పడింది. వెనుక బడిన సామాజిక వర్గానికి చెందిన మహిళ సిద్ధం చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి మంగళవారం ఎంపీ కనిమొళి , మంత్రి గీతా జీవన్ స్వీకరించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఎట్టయపురం సమీపంలోని ఉసిలం పట్టి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సీఎం అల్పాహార పథకం అమలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
ఆ గ్రామానికి చెందిన వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మునియ సెల్వి అల్పాహారాన్ని సిద్ధం చేసి వడ్డిస్తుండడం అగ్ర వర్ణాలలో ఆగ్రహాన్ని రేపింది. దీంతో తమ పిల్లల చేత అల్పాహారం బహిష్కరించారు. ఈ సమాచారంతో అధికారులు రంగంలోకి దిగి గ్రామస్తులను బుజ్జగించారు. అదే సమంయలో డీఎంకే ఎంపీ, మంత్రి గీతా జీవన్ , తూత్తుకుడి జిల్లా ఉన్నతాధికారులు అందరూ మంగళవారం ఉదయాన్నే ఆగ్రామానికి వెళ్లారు.
గ్రామ పెద్దలతో మాట్లాడారు. వివక్ష తగదని హితవు పలికారు. అందరూ సమానమే అని సూచించారు. విద్యార్థులను అల్పాహారం స్వీకరణకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. వీరి విజ్ఞప్తికి తల్లిదండ్రులు స్పందించారు. పిల్లలందరితో కలిసి ఎంపీ, మంత్రి, అధికారులు అల్పాహారం స్వీకరించారు. పిల్లలకు కనిమొళి స్వయంగా వడ్డించారు. అలాగే, ఆహారం తయారు చేస్తున్న మునియ సెల్వితో మాట్లాడారు. ఆమెకు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment