MP Kanimozhi
-
క్రెడిట్ కోసం చైనా స్టిక్కర్లు
-
తూత్తుకుడిలో వివక్షకు చెక్
సాక్షి, చైన్నె : తూత్తుకుడిలో అల్పాహారం పథకం వివాదానికి తెర పడింది. వెనుక బడిన సామాజిక వర్గానికి చెందిన మహిళ సిద్ధం చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి మంగళవారం ఎంపీ కనిమొళి , మంత్రి గీతా జీవన్ స్వీకరించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఎట్టయపురం సమీపంలోని ఉసిలం పట్టి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సీఎం అల్పాహార పథకం అమలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆ గ్రామానికి చెందిన వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మునియ సెల్వి అల్పాహారాన్ని సిద్ధం చేసి వడ్డిస్తుండడం అగ్ర వర్ణాలలో ఆగ్రహాన్ని రేపింది. దీంతో తమ పిల్లల చేత అల్పాహారం బహిష్కరించారు. ఈ సమాచారంతో అధికారులు రంగంలోకి దిగి గ్రామస్తులను బుజ్జగించారు. అదే సమంయలో డీఎంకే ఎంపీ, మంత్రి గీతా జీవన్ , తూత్తుకుడి జిల్లా ఉన్నతాధికారులు అందరూ మంగళవారం ఉదయాన్నే ఆగ్రామానికి వెళ్లారు. గ్రామ పెద్దలతో మాట్లాడారు. వివక్ష తగదని హితవు పలికారు. అందరూ సమానమే అని సూచించారు. విద్యార్థులను అల్పాహారం స్వీకరణకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. వీరి విజ్ఞప్తికి తల్లిదండ్రులు స్పందించారు. పిల్లలందరితో కలిసి ఎంపీ, మంత్రి, అధికారులు అల్పాహారం స్వీకరించారు. పిల్లలకు కనిమొళి స్వయంగా వడ్డించారు. అలాగే, ఆహారం తయారు చేస్తున్న మునియ సెల్వితో మాట్లాడారు. ఆమెకు భరోసా ఇచ్చారు. -
కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయింది?
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా అందరి మన్ననలు పొందుతున్న ఎం షర్మిల(24) శుక్రవారం రోడ్డున పడ్డారు. ఆమె నడిపిన బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేసిన కొన్ని గంటల్లో ఆ బస్సు డ్రైవర్ ఉద్యోగాన్ని షర్మిల కోల్పోవాల్సి వచ్చింది. కోయంబత్తూరులో బస్సు డ్రైవర్ షర్మిల ఇటీవల సెలబ్రటీ అయ్యారు. ఆమె ఓ ప్రైవేటు బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఓ యువతిగా ఆమె బస్సు నడిపే విధానం సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమకు షర్మిల ఆదర్శం అంటూ అనేక మంది యువతులు అనేక మంది మీడియా ముందుకొచ్చారు. తాము సైతం డ్రైవింగ్ నేర్చుకుని బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రటీగా మారిన షర్మిలను అభినందించేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడే వాళ్లు మరీ ఎక్కువే. డ్రైవర్‌గా ఆమె పనితీరును పరిశీలించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం కోయంత్తూరుకు వచ్చారు. కండక్టర్ తీరుతో.. షర్మిల నడిపే బస్సులో ఇదివరకు ఉన్న మగ కండక్టర్‌ను తొలగించి శుక్రవారం నుంచి కొత్తగా లేడీ కండక్టర్‌ను ఆ ట్రావెల్స్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే, ఆ లేడీ కండక్టర్ రూపంలో షర్మిలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తన బస్సులోకి హఠాత్తుగా కనిమొళి ఆమెతో పాటు మరికొందరు ఎక్కడంతో షర్మిల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆమె పనితీరున స్వయంగా కనిమొళి వీక్షించి, అభినందించారు. అయితే, ఆ లేడీ కండక్టర్ టికెట్టుకు చిల్లర ఇవ్వాల్సిందేనని కనిమొళితో పాటు ఆమెతో వచ్చిన వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. జాబ్ పోలేదు? తనకోసం కనిమొళి రావడంతో ఆ కండక్టర్‌ను షర్మిల వారించారు. అయితే, ఆ కండక్టర్ మరింత దూకుడుగా వ్యవహరించడంతో తదుపరి స్టాప్‌లో కనిమొళితో పాటుగా మిగిలిన వారు బస్సు దిగి వెళ్లిపోయారు. అయితే.. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమోగానీ గాంధీపురం స్టాప్‌లో బస్సును ఆపేసి షర్మిల దిగి వెళ్లిపోయారు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నానని తన యజమాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆమె ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎంపీ కనిమొళి పట్ల మహిళా కండక్టర్ ప్రవర్తన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక ఆ బస్సు నడపనని షర్మిల స్పష్టం చేశారు. ఏదేమైనా తన కలల కొలువుకు దూరమైనట్టు బాధపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బస్సు యజమాని దురై కన్నా మాత్రం మరోలా స్పందించారు. వ్యక్తిగత పబ్లిసిటీ షర్మిలకు పెరిగిందని, అయినా, తాము భరిస్తున్నామని, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించలేదని బస్సు యాజమాని దురై కన్న పేర్కొన్నారు. ఈ వ్యవహారం కనిమొళి దృష్టికి చేరడంతో షర్మిలతో ఆమె వ్యక్తిగత సహాయకులు మాట్లాడినట్టు సమాచారం. -
కనిమొళి వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలి
సాక్షి, చెన్నై: రూ.కోట్లు ఇచ్చే వారికే బాలాజీ దేవుడంటూ.. పేదవాడిని కాపాడలేని దేవుడు ఎందుకంటూ.. డీఎంకే ఎంపీ కనిమొళి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వెంకన్నపై ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించడం ఇది ఒక కొత్త రాజకీయ ఎత్తుగడలో భాగమని కేతిరెడ్డి అన్నారు. ప్రజలను ఆశాంతికి గురిచేయటం తమిళ రాజకీయ నాయకుల లక్ష్యమని ఆయన విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిపై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. హిందువుల మనోభాబాలను కనిమొళి దెబ్బతీశారని కేతిరెడ్డి మండిపడ్డారు. సంచలనం వ్యాఖ్యలు చేసి వార్తలో ఉండాలనుకోవడం సిగ్గు చేటు.. మీరు ఇదే వ్యాఖ్యలను ఇతర మతస్తులపై చేసే దమ్ము ఉందా అని కేతిరెడ్డి ప్రశ్నించారు. మీరు చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం త్వరలో చెల్లించటం ఖాయమని ఆయన అన్నారు. ఆమె చేసిన నాస్తిత్వం ప్రసంగంలో వెంకన్నను ఉదాహరణగా చేప్పిన విషయం తెలిసిందే. హిందూ సమాజంను అవమాపరిచిన రాజ్యసభ సభ్యురాలు కనిమొళిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి: తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ కనిమొళి హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని, ఆమెపై తక్షణమే కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. కనిమొళిపై గురువారం ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతికి ఫిర్యాదు చేశారు. అనంతరం భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.కోట్లు ఇచ్చే వారికే బాలాజీ దేవుడంటూ కనిమొళి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పేదవాడిని కాపాడలేని దేవుడు ఎందుకంటూ.. భక్తుల మనోభావాలను ఆమె దెబ్బతీశారని మండిపడ్డారు. -
తెట్టు తిప్పలు!
► నేతల పడగ ► వంద టన్నులు తొలగింపు ► పీఆర్కే పరిశీలన ► కెప్టెన్ల వద్ద విచారణ సాక్షి, చెన్నై: ఆయిల్ తెట్టు అధికార వర్గాల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. క్రమంగా చెన్నై సముద్ర తీరం తెట్టుతో కలుషితం అవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, వీసీకే నేత తిరుమావళవన్ నేతలు తీరం వెంబడి పర్యటించారు. పనుల వేగం పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఎన్నూరు పరిసరాల్లో పర్యటించారు. ఎన్నూర్ కామరాజర్ హార్బర్‌కు కూత వేటు దూరంలో సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న విషయం తెలిసిందే. క్రూడాయిల్‌తో వచ్చిన నౌకలో ఏర్పడ్డ లీకేజీ చెన్నై సముద్ర తీరాన్ని కలుషితం చేసింది. క్రూడాయిల్ సముద్రంలో కలవడంతో తీరం రంగు మారింది. జల సంపద మీద ప్రభావం, తీరం కలుషిత ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతో ఆందోళన బయలు దేరింది. ఎనిమిదో రోజుగా సముద్రం నుంచి ఆయిల్ తెట్టును తొలగించే పనులు శర వేగంగా శనివారం కూడా సాగాయి. తొలగించే కొద్దీ తెట్టు తీవ్రత పెరుగుతుండడంతో ఈ కలుషితం ఎలాంటి కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతుందో అన్న ఆందోళన తీరవాసుల్లో, జాలర్ల కుటుంబాల్లో బయలుదేరింది. కోస్టుగార్డు, రెవెన్యూ, కేంద్ర ప్రభుత్వ, హార్బర్వర్గాలు ఈ తెట్టుతో ముప్పుతిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంద టన్నులు : శనివారం నాటికి వంద టన్నుల మేరకు తెట్టును తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బకెట్లతో సిబ్బంది, సూపర్ సక్కింగ్ పరికరంతో శరవేగంగా తెట్టు తొలగింపు సాగుతున్నట్టు వివరించారు. సూపర్ సక్కింగ్ పరికరంతో రెండు రోజుల్లో 54 టన్నుల మేరకు తెట్టును తొలగించినట్టు, ఇందులో నీళ్లు సైతం కలిసి ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఎన్నూర్ పరిసరాల్లో 21 టన్నులు, ఆర్కే నగర్లో 3.4 టన్నులు, మెరీనాతీరంలో ఏడు టన్నులు, శక్తి నగర్, గాంధీనగర్‌లలో ఐదు టన్నుల మేరకు అత్యధికంగా తెట్టు తొలగింపు సాగింది. కెప్టెన్ల వద్ద విచారణ : కామరాజర్ హార్బర్ అధికారి గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో మీంజూరు పోలీసులు రంగంలోకి దిగారు. 336, 427, 431, 250, 285 సెక్షన్ల కింద కేసుల నమోదుతో హార్బర్లో ఉన్న రెండు నౌకల కెప్టెన్ల వద్ద తీవ్రంగా విచారణ సాగిస్తున్నారు. రెండు నౌకలు ఢీకొనాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ సాగుతోంది. పీఆర్కే పరిశీలన : కేంద్ర రహదారులు, రోడ్డు , రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తిరువొత్తియూరు, ఎన్నూరు పరిసరాల్లో తీరం వెంబడి సాగుతున్న తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలను సేకరించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నౌకలు ఢీకొన్న సమాచారంతో తక్షణ పరిశీలన సాగిందని, అయితే, ఎలాంటి లీకేజీ తొలుత కనిపించక పోవడంతో పెద్దగా ముప్పు ఉండదని భావించామన్నారు. ఆ నౌకలో 58 వేల టన్నుల మేరకు చమురు ఉన్నట్టు, దానిని దిగుమతి చేసే పనుల వేగం శరవేగంగా సాగుతోందన్నారు. నౌక ఇంజిన్ ఆగడంతోనే లీకేజీని గుర్తించామని, ఒక వేళ నౌకలో చీలిక ఏర్పడి ఉంటే, భారీ ముప్పును చవి చూసి ఉండాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెట్టు తొలగింపునకు తగ్గ అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, త్వరితగతిన తొలగిస్తామన్నారు. హార్బర్లో ఉన్న నౌకలను పరిశీలించినానంతరం నష్టం తీవ్రతను ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమకు నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల తీరంలోని జాలర్ల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. స్టాలిన్, కనిమొళిల పరిశీలన : డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, డీఎంకే ఎంపీ కనిమొళి, వీసీకే నేత తిరుమావళవన్ నాయకులు సముద్ర తీరంలో పర్యటించారు. తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు. తిరువొత్తియూరు, భారతీనగర్ పరిసరాల్లో స్టాలిన్ పర్యటించి, అక్కడి జాలర్లతో సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ 32 కిమీ మేరకు తెట్టు విస్తరించే వరకు అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండడం శోచనీయమన్నారు. సంబంధిత మంత్రి ఆలస్యంగా తీరానికి పరుగులు పెట్టారని పేర్కొంటూ, ఇకనైనా పనుల్నిమరింత వేగవంతం చేయించాలన్నారు. ఈ తెట్టు రూపంలో చెన్నైకు నీటిని అందిస్తున్న మీంజూరు నిర్లవణీకరణ పథకంకు ఎలాంటి ఇబ్బందులు నెలకొననున్నాయోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిపుణుల్ని రంగంలోకి దించాలని, అత్యాధునిక పరికరాలను మరింతగా ఉపయోగించాలని, లేని పక్షంలో మరింత ఆందోళన తప్పదేమోనని పేర్కొన్నారు. ఇక, డీఎంకే ఎంపీ కనిమొళి ఎన్నూరు పరిసరాల్లో పర్యటించి, అధికారుల మధ్య సమన్వయం కొరవడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక నిపుణులు లేకుండా, సాధారణ సిబ్బందితో పనులు సాగుతున్నాయన్నారు. వీసీకే నేత తిరుమావళవన్ జాలర్ల గ్రామాల్లో పర్యటించి, తెట్టు రూపంలో పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. -
దత్తతకు మరో గ్రామం
సాక్షి, చెన్నై : తిరువణ్ణామలై జిల్లా మెయ్యూరు గ్రామాన్ని ఎంపీ కనిమొళి దత్తతకు స్వీకరించారు. ఆ గ్రామంలో అభివృద్ధి పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు.డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కని మొళి రాష్ట్రం నుంచి రాజ్య సభకు ఎన్నికైన విష యం తెలిసిందే. ప్రతి ఏటా తన ఎంపీ నిధుల్ని ఖ ర్చు పెట్టేందుకు ఓ గ్రామాన్ని ఆమె దత్తత స్వీకరిస్తూ వస్తున్నారు. గత ఏడాది తూత్తుకుడి జిల్లా ఆళ్వార్ తిరుగనగర్ యూనియన్ పరిధిలోని శ్రీ వైకుంఠంను ఎంపిక చేసుకున్నారు. అక్కడ అభివృ ద్ధి పనులు కొన్ని ముగింపు దశకు చేరగా, మరికొన్ని శరవేగంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ ఏడాదికిగాను మరో గ్రామాన్ని ఆమె దత్తత స్వీకరించేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది తనకు కేటాయిం చి నిధుల్ని ఆ గ్రామానికి ఖర్చు పెట్టడంలో భా గంగా అభివృద్ధి కార్యాచరణను సిద్ధం చేశారు. పలు గ్రామాలను పరిశీలించి చివరకు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న తిరువణ్ణామలై జిల్లా మెయ్యూరు గ్రామానికి ఎంపిక చేసుకున్నారు. మరో గ్రామం : మెయ్యూరు గ్రామాన్ని దత్తతకు తీసుకున్న కనిమొళి ఆదివారం ఆ గ్రామంలో పర్యటించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఎంపి నిధుల వినియోగం గురించి, వాటిని సద్వినియోగంచేసుకోవాల్సిన విధానం గురించి ప్రజలకు వివరించారు. తూత్తుకుడిలో తాను దత్తతకు స్వీకరించిన శ్రీ వైంకుంఠం గ్రామంలో పూర్తి చేసిన పనులు, జరుగుతున్న పనులను విశదీకరించారు. ఈ గ్రామం నుంచి అత్యధికంగా తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గ్రీన్ హౌస్‌ల నిర్మాణం, వృద్ధాప్య పెన్షన్ల గురించి అని పేర్కొన్నారు. అయితే, ఆ రెండు ప్రస్తుతం తన పరిధిలో లేదు అని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికల ద్వారా డీఎంకే తప్పకుండా అధికారంలోకి రావడం ఖాయం అని, అప్పుడు తప్పకుండా ఆ రెండు పథకాలు ఈగ్రామంలో ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. అందరూ కలసి డీఎంకేను అధికారంలోకి తీసుకొస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో అన్ని రకాల మౌళిక వసతుల కల్పనకు నిధుల్ని వెచ్చించనున్నామని వివరించారు. అందరూ కలసి కట్టుగా నిధుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి పరుద్దామని పిలుపు నిచ్చారు. ఇక్కడికి తాను తరచూ వస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆ గ్రామ ప్రజలకు కనిమొళి హామీ ఇచ్చారు. -
బలోపేతమే లక్ష్యం: కనిమొళి
సాక్షి, చెన్నై : ప్రజల్లో మమేకమై బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుదామని మహిళా నేతలకు డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళి పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆదివారం అరివాలయంలో ఆమె మహిళా విభాగం నేతలతో భేటీ అయ్యారు. డీఎంకే మహిళా విభాగం నాయకులతో కనిమొళి ఉదయం గంటన్నర పాటుగా భేటీ అయ్యారు. ఆ విభాగం బలోపేతం, మహిళ మన్ననలు అందుకునే రీతిలో కార్యక్రమాల నిర్వహణ, అధినేత ఎం కరుణానిధి పుట్టినరోజు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఇక ప్రతి మహిళా విభాగం నాయకురాలు, కార్యకర్త ప్రజల్లో మమేకమై బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. అనంతరం మీడియాతో కనిమొళి మాట్లాడుతూ, తిరుపతి శేషాచలం ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఏపీ ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉందన్నారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు దెబ్బతినే విధంగా వ్యవహరించ కూడదని హితవు పలికారు. వ్యవసాయ శాఖ ఇంజనీరింగ్ అధికారి ముత్తుకుమార స్వామి మరణం వెనుక ఉన్న మిస్టరీ బయటకు రావాలంటే కేసును సీబీఐకు అప్పగించాల్సిందేని, ఇందు కోసం డీఎంకే మహిళా విభాగం ఉద్యమించబోతోందన్నారు. అదుపులో.. ముత్తుకుమార స్వామి మృతి కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి, ఇంజనీరింగ్ అధికారి సెంథిల్‌కుమార్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం అగ్రి అసిస్టెంట్ వందవాసికి చెందిన వెంకటేషన్‌ను అదుపులోకి తీసుకుని సీబీసీఐడీ వర్గాలు విచారిస్తున్నాయి. -
కనిమొళి కసరత్తు
చతికిలబడిన మహిళా విభాగంలో పునరుత్తేజం నింపడం లక్ష్యంగా ఎంపీ కనిమొళి కసరత్తుల్లో పడ్డారు. మహిళాకర్షణే లక్ష్యంగా అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. యువజన విభాగం తరహాలో మహిళా విభాగంతో పార్టీలో పట్టు కోసం వ్యూహ రచనల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 14న చెన్నై వేదికగా మహిళా విభాగం కార్యవర్గం భేటీకి పిలుపునిచ్చారు. సాక్షి, చెన్నై : డీఎంకేలో మహిళా విభాగం ఉన్నా, ఆ విభాగంతో పార్టీకి ఒరిగింది పెద్దగా ఏమీ లేదు. పార్టీ కార్యక్రమాల్లో గత కొన్నేళ్లుగా ఈ విభాగం నమ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇక చురుగ్గా దూసుకెళుతున్న అన్నాడీఎంకే మహిళా విభాగం తరహాలో తమ పార్టీలోని విభాగాన్ని సైతం తీర్చిదిద్దాలన్న ఆశ కరుణానిధిలో ఉన్నా, ఆచరణలో విఫలం అవుతూ వచ్చారు. పార్టీలోని యువజన విభాగానికి కోశాధికారి ఎంకే స్టాలిన్ ఏళ్ల తరబడి నాయకత్వం వహిస్తూ రావడంతో, ఆ విభాగం పార్టీకి పట్టుకొమ్మగా ఉంటున్నారు. దీన్ని పరిగణించిన కరుణానిధి మహిళా విభాగానికి పటిష్ట నాయత్వం అవసరమని గుర్తించారు. ఎట్టకేలకు తన గారాల పట్టిని అందలం ఎక్కించడంతోపాటుగా మహిళా విభాగం బలోపేత బాధ్యతల్ని ఆమె భుజాన వేశారు. పార్టీలో పదవి కోసం ఆశించి చివరకు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్న కనిమొళి తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయని రీతిలో ఆ విభాగం బలోపేతానికి కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. పట్టుకు వ్యూహం : మహిళా విభాగం బలోపేతంతో పాటుగా, పార్టీ పరంగా పట్టు సాధించడం లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో కనిమొళి పడ్డారు. అధినేత కరుణానిధి సూచనలు, సలహాలను అనుసరిస్తూనే, తన దైన శైలిలో మహిళాకర్షణకు సిద్ధం అయ్యారు. యువజన విభాగాన్ని ఏ మేరకు కోశాధికారి ఎంకే స్టాలిన్ పటిష్ట వంతంగా ముందుకు తీసుకెళ్తున్నారో, దాన్ని తలదన్నే రీతిలో మహిళా విభాగాన్ని పార్టీకి పట్టుకొమ్మగా మలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మహిళా విభాగం నాయకులందర్నీ పిలిపించి, వారి వారి అభిప్రాయాల్ని స్వీకరిస్తున్న కనిమొళి, ఇక తన వ్యూహాల్ని అమలు చేయించి బలోపేతం లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. 14న భేటీ: మహిళా విభాగం బలోపేతంతో పాటుగా, ఆ విభాగం నేతృత్వంలో మహిళా సమస్యల్ని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. వీటిని మహిళా విభాగం నాయకుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని అమలు చేయించేం దుకు నిర్ణయించారు. ఇందు కోసం ఈనెల 14న చెన్నై వేదికగా రాష్ట్ర, జిల్లా మహిళా విభాగాలతో భేటీకి నిర్ణయించారు. అందరూ తప్పని సరిగా ఈ సమావేశానికి హాజరయ్యే రీతిలో ఆహ్వానాల్ని పం పించారు. ప్రధానంగా ఈ సమావేశంలో మహిళా విభాగంలోని సీనియర్లను కలుపుకుంటూ, సరికొత్త మార్గంలో పయనించే విధంగా కనిమొళి కసరత్తులు చేశారని అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. స్వయం సహాయక బృందాల్లోని మహిళల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టబోతున్నారని చెబుతోన్నారు. ఐటీ, వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో రాణిస్తున్న మహిళా ప్రముఖుల్ని కలవడం, వారి సహకారంతో ఆయా రంగాల్లోని మహిళలను పార్టీలోకి ఆహ్వానించే విధంగా వినూత్న ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేస్తూ కనిమొళి కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థల్లోని మహిళల సహకారంతో కార్యక్రమాల్ని వేగవంతం చేసే విధంగా ఈ భేటీలో తన మార్కు వ్యూహాల్ని అమలు పరిచేందుకు కనిమొళి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశానంతరం రోజుకో జిల్లా చొప్పున పర్యటించి, మహిళా విభాగం నాయకుల్ని ఉత్సాహ పరిచే విధంగా కార్యక్రమాలు, మహిళా విభాగం సభ్యత్వ నమోదు ప్రక్రియతో బలోపేతం లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లే విధంగా తన డైరీలో బిజి బిజీ షెడ్యూల్‌ను ఆమె రూపొందించుకున్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటుండటం విశేషం. -
దత్తతకు గ్రామం
ఒక ఎంపీ ఒక గ్రామం నినాదంతో ఓ గ్రామాన్ని దత్తతకు స్వీకరించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి నిర్ణయించారు. తూత్తుకుడి జిల్లా ఆళ్వార్ తిరునగర్ పరిసరాల్లో పర్యటించిన ఆమె శ్రీ వెంకటేశ్వర పురాన్ని దత్తతకు తీసుకున్నారు. * ఎంపీ కనిమొళి నిర్ణయం * తూత్తుకుడిలో పర్యటన సాక్షి, చెన్నై: ఒక ఎంపీ ఒక గ్రామం నినాదంతో గ్రామాల దత్తతకు పీఎం నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపునకు రాష్ట్రంలో స్పందించిన తొలి ఎంపీగా రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఖ్యాతి గడించారు. ఇటీవల పీఎం నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి చివరకు కనిమొళి భంగపడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాజాగా మోదీ ఇచ్చిన పిలుపునకు ఆ పార్టీ ఎంపీ ఇంత వరకు స్పందించ లేదు. ఇతర పార్టీలు సైతం ఇంకా మేల్కొన లేదు. అయితే, తాను ఎల్లప్పుడూ ప్రజా సేవలో ముందుంటానని చాటుకునే విధంగా, పరోక్షంగా మోదీ దృష్టిలో పడే రీతిలో ఓ గ్రామాన్ని దత్తతకు స్వీకరించేందుకు నిర్ణయించారు. దత్తతకు స్వీకారం : తూత్తుకుడి జిల్లా ఆళ్వార్ తిరునగర్ యూనియన్ పరిసరాల్లో బుధవారం కనిమొళి పర్యటించారు. అక్కడి శ్రీవెంకటేశ్వర పురం గ్రామాన్ని దత్తతకు స్వీకరించారు. అక్కడి ప్రజలతో ముచ్చటించారు. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు. మీడియాతో కనిమొళి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తమ గ్రామాన్ని దత్తతకు స్వీకరించాలని, ఇక్కడి ప్రజలు తనకు విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. అందుకే ఈ గ్రామంలో పర్యటించి, ఇక్కడి వసతులు, ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాల్ని స్వయంగా తెలుసుకున్నట్లు చెప్పారు. ఇక్కడ భూగర్భ జలాల్ని పీల్చే చెట్లు అనేకం ఉన్నాయని, వాటిని తొలగించి, ప్రజోపయోగకరంగా ఉండే చెట్ల పెంపకం మీద దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. తాగునీటి వసతుల కల్పన, రోడ్లు, కనీస సదుపాయూల కల్పన మీద దృష్టి సారిస్తామన్నారు. ఇక్కడి ప్రజలు విద్యా పరంగా, వైద్య, ఆరోగ్య పరంగా సేవల్ని అంది పుచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఇక్కడి ప్రజలతో కలసి తాను స్వయంగా అభివృద్ధిలో పాలు పంచుకోబోతున్నట్టు పేర్కొన్నారు.