సాక్షి, చెన్నై : తిరువణ్ణామలై జిల్లా మెయ్యూరు గ్రామాన్ని ఎంపీ కనిమొళి దత్తతకు స్వీకరించారు. ఆ గ్రామంలో అభివృద్ధి పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు.డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కని మొళి రాష్ట్రం నుంచి రాజ్య సభకు ఎన్నికైన విష యం తెలిసిందే. ప్రతి ఏటా తన ఎంపీ నిధుల్ని ఖ ర్చు పెట్టేందుకు ఓ గ్రామాన్ని ఆమె దత్తత స్వీకరిస్తూ వస్తున్నారు. గత ఏడాది తూత్తుకుడి జిల్లా ఆళ్వార్ తిరుగనగర్ యూనియన్ పరిధిలోని శ్రీ వైకుంఠంను ఎంపిక చేసుకున్నారు. అక్కడ అభివృ ద్ధి పనులు కొన్ని ముగింపు దశకు చేరగా, మరికొన్ని శరవేగంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ ఏడాదికిగాను మరో గ్రామాన్ని ఆమె దత్తత స్వీకరించేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది తనకు కేటాయిం చి నిధుల్ని ఆ గ్రామానికి ఖర్చు పెట్టడంలో భా గంగా అభివృద్ధి కార్యాచరణను సిద్ధం చేశారు. పలు గ్రామాలను పరిశీలించి చివరకు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న తిరువణ్ణామలై జిల్లా మెయ్యూరు గ్రామానికి ఎంపిక చేసుకున్నారు.
మరో గ్రామం : మెయ్యూరు గ్రామాన్ని దత్తతకు తీసుకున్న కనిమొళి ఆదివారం ఆ గ్రామంలో పర్యటించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఎంపి నిధుల వినియోగం గురించి, వాటిని సద్వినియోగంచేసుకోవాల్సిన విధానం గురించి ప్రజలకు వివరించారు. తూత్తుకుడిలో తాను దత్తతకు స్వీకరించిన శ్రీ వైంకుంఠం గ్రామంలో పూర్తి చేసిన పనులు, జరుగుతున్న పనులను విశదీకరించారు. ఈ గ్రామం నుంచి అత్యధికంగా తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గ్రీన్ హౌస్‌ల నిర్మాణం, వృద్ధాప్య పెన్షన్ల గురించి అని పేర్కొన్నారు. అయితే, ఆ రెండు ప్రస్తుతం తన పరిధిలో లేదు అని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని వ్యాఖ్యానించారు.
మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికల ద్వారా డీఎంకే తప్పకుండా అధికారంలోకి రావడం ఖాయం అని, అప్పుడు తప్పకుండా ఆ రెండు పథకాలు ఈగ్రామంలో ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. అందరూ కలసి డీఎంకేను అధికారంలోకి తీసుకొస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో అన్ని రకాల మౌళిక వసతుల కల్పనకు నిధుల్ని వెచ్చించనున్నామని వివరించారు. అందరూ కలసి కట్టుగా నిధుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి పరుద్దామని పిలుపు నిచ్చారు. ఇక్కడికి తాను తరచూ వస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆ గ్రామ ప్రజలకు కనిమొళి హామీ ఇచ్చారు.
దత్తతకు మరో గ్రామం
Published Mon, Jun 22 2015 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM
Advertisement
Advertisement