Village Adoption
-
వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
-
వాసాలమర్రిలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతోంది. గ్రామంలోని దళితవాడల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి ‘దళితబంధు’ పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. ‘దళిత బంధు’ పథకంతో వచ్చే పెద్ద మొత్తం డబ్బుతో ఎలాంటి ఉపాధి పొందుతారని దళితులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద మొత్తంలో వచ్చే డబ్బును వృధా చేసుకోవద్దని స్పష్టమైన అవగాహనతో దళిత బందు ద్వారా లబ్ధి పొందాలని సీఎం సూచించారు. సుమారు గంటకుపైగా దళితవాడల్లో కాలినడకన కలియతిరిగారు. గ్రామమంతా కలియతిరిగి మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులతో కూడా మాట్లాడారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై రైతు వేదికలో గ్రామస్తులతో సమావేశం కానున్నారు. వాసాలమర్రికి సీఎం కేసీఆర్ రావడం ఇది రెండోసారి. జూన్ 22వ తేదీన కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
దత్తత ఉత్తదయిన వేళ...
సాక్షి, పెదకూరపాడు : ‘ఈ గ్రామవాసిగా పెదకూరపాడును దత్తత తీసుకుంటున్నా. గ్రామ దశ, దిశలు మారుస్తా. ఎక్కడా జరగని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా.. జన్మభూమి రుణం తీర్చుకుంటా’.. అంటూ పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన కొమ్మాలపాటి శ్రీధర్ హామీలు గుప్పించారు. అయితే ఆయన ఈ గ్రామానికి చేసింది మాత్రం శూన్యమని, సొమ్మొకరిది, సోకొకరిది అన్న చందంగా 13,14 ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో కాలనీలో రోడ్లు వేసి తన నిధులతో చేసినట్లు బీరాలు పలకడం మినహా ఒరగబెట్టింది ఏమీ లేదని గ్రామస్తులు ఎద్దేవాచేస్తున్నారు. పెదకూరపాడు రైల్వేస్టేషన్లో జన్మభూమి, పల్నాడు ఎక్సెప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలన్నది గ్రామ ప్రజల చిరకాల వాంఛ. ఇందు కోసం ఎన్నోసార్లు రైల్వే అధికారులను కలసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తానంటూ తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, తాజా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు. ఎక్సెప్రెస్ రైలుకు హాల్ట్ కల్పిస్తే హైదరాబాద్, విశాఖపట్నం వెళ్లేవారు గ్రామంలోనే రైలు ఎక్కొచ్చన్న ఆశ కలగానే మిగిలింది. మూతపడ్డ హాస్టళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్య లేని కారణంగా పెదకూరపాడులో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ బాలుర వసతి గృహాన్ని రద్దుచేశారు. ఎమ్మెల్యేగా కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నా ఈ హాస్టళ్లను కొనసాగించేందుకు తీసుకున్న చర్యలు ఏమీ లేవని ఎస్సీ, బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సొమ్మొకరిది... సోకు ఒకరిది ఇరుకుగా ఉన్న పెదకూరపాడు ప్రధాన రహదారి తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి స్వగ్రామం పెదకూరపాడులో నిర్మించిన సీసీ రోడ్ల వ్యవహారం సొమ్మొకరది, సోకు ఒకరది అన్న చందంగా మారింది. ఈ గ్రామాన్నికి ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.1.95 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు నిర్మించారు. ఈ నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానివి. 13, 14 ఆర్థిక సంఘం నిధులు రూ.95 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతోనూ సీసీ రోడ్లు నిర్మించారు. పంచాయతీ నిధులు రూ.30 లక్షలు మంజూరయ్యాయి. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్‌ను పక్కన పెట్టి ఆ నిధులతోనూ టీడీపీ వారే రోడ్లు వేశారు. అయితే కొమ్మాలపాటి శ్రీధర్ రహదారులు అంటూ బోర్డులు మాత్రం ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఎమ్మెల్యే నిధులు కింద పెదకూరపాడు గ్రామానికి వచ్చింది రూ.60 లక్షలు. వాటిలో రూ.40 లక్షలే వినియోగించారు. మిగిలిన రూ.20 లక్షలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఏమైంది? ప్రజల చిరకాల కోరిక పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగాలన్నది. మేము అనేక సార్లు రైల్వే అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించాం. అయితే ప్రయోజనం లేదు. ఎమ్మెల్యేగా శ్రీధర్ రైళ్ల హాల్ట్ కూడా సాధించలేకపోయారు. – షేక్ బాలిసైదా, అడ్వకేట్, పెదకూరపాడు చేనేతలకు చేసింది శూన్యం పెదకూరపాడులో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి కొమ్మాలపాటి చేసిన మేలు ఏమీ లేదు. సొంతూరు వ్యక్తి అయినా కనీసం చేనేత సమస్యలపై అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. – గాత్రం కాంతారావు,పెదకూరపాడు -
స్ట్రీట్కాజ్ ..శ్రీమంతులు
వారంతా విద్యార్థులు. ఓవైపు చదువుకుంటూ... మరోవైపు సేవాపథంలో నడుస్తున్నశ్రీమంతులు. వీరందర్ని నడిపిస్తోందిహైదరాబాద్ యూత్ అసెంబ్లీ (హెచ్‌వైఏ). ముగ్గురు స్నేహితుల మనసులో అంకురించిన ఆలోచన.. నేడు మరెందరినో సేవా మార్గంలో నడిపిస్తోంది. గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తోంది. హిమాయత్‌నగర్: నగరానికి చెందిన అఖిలేష్ జుక్కారెడ్డి, మితేష్ లోహియా, స్నిగ్ధా చల్లపల్లి స్నేహితులు. ప్రతిరోజు ఏదో ఒక రెస్టారెంట్లో లంచ్ చేసి.. కొద్దిసేపు మాటామంతీ వీరికి అలవాటు. అలా 2009లో ఓ రోజు హోటల్లో లంచ్ అనంతరం బయటకొస్తుండగా ఓ వ్యక్తి దగ్గరికొచ్చి చేయిచాచడం వీరిని కదిలించింది. ఆ క్షణాన పుట్టిన ఆలోచనే.. నేడు వేలాది మందిని సేవాపథంలో నడిపిస్తోంది. ప్రతిరోజు మెయింటనెన్స్‌కు ఎన్నో రూపాయలు ఖర్చు చేస్తున్నాం కదా.. ఆ ఖర్చుకు ఫుల్స్టాప్ పెట్టి, దానితో సేవా కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకున్నారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ యూత్ అసెంబ్లీ (హెచ్‌వైఏ) పేరుతో ఓ ఎన్జీఓ ఏర్పాటు చేశారు. ఇందులో మరో భాగమే స్ట్రీట్కాజ్ సంస్థ. మూడు గ్రూపులు.. 30 మంది పేదరిక నిర్మూలన, ఆకలి తీర్చడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం, మహిళా సాధికారత, ఉన్నత విద్యనందించడం, స్వచ్ఛభారత్, ఆర్థిక చేయూత, గ్రామాల అభివృద్ధి తదితర లక్ష్యాలతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఇందులోని సభ్యులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 30 మంది చొప్పున ప్రజలకు సేవలందిస్తారు. అకృత్యాలను అరికట్టేందుకు అవగాహనసదస్సులు, చర్చా కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఖర్చులు వీరు సొంతంగానే భరిస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్‌లో చేరేటప్పుడు ఒక్కో సభ్యుడు రూ.10 వేలు కట్టాల్సి ఉంటుంది. మొత్తం మూడు గ్రూపుల్లో 30 మంది సభ్యులుంటారు. ఈ సభ్యులు వ్యక్తిగతంగా ఇచ్చే డబ్బులతోనే సేవలందిస్తున్నారు. మూడు గ్రామాల దత్తత... రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. హెచ్‌వైఏ స్ట్రీట్కాజ్ ప్రతినిధులు తమ వద్దనున్న ఫండ్ ఆధారంగా గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలోని లెండిగూడ గ్రామాన్ని దత్తత తీసుకోగా... ఇప్పుడు చేవేళ్ల వద్దనున్న ఇక్కారెడ్డిగూడ, రెడ్డినాయక్తండాలను దత్తత తీసుకున్నారు. గ్రామాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. కరెంట్, బల్బుల పంపిణీ, తాగునీరు, ఉచిత విద్య, పర్యావరణంపై అవగాహన... ఇలా వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే చికిత్సకు ఖర్చులు కూడా భరిస్తున్నారు. తండా కోసం 10కే రన్ జడ్చర్ల శివారులోని లక్యానాయక్ తండాలో సుమారు 200 కుటుంబాలునివసిస్తున్నాయి. ఇక్కడ కనీస వసతులేమీ లేవు. ఇది తెలుసుకున్న స్ట్రీట్కాజ్ సంస్థ ఈ గ్రామానికి సహాయం అందించాలని నిర్ణయించుకుంది. గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ఏప్రిల్ 1న నెక్లెస్ రోడ్లో 10కే రన్ నిర్వహించనుంది. ఈ రన్లో పాల్గొనేవారు రూ.100 చెల్లించి పాస్ తీసుకోవాలి. దీని ద్వారా వచ్చే మొత్తంతో గ్రామంలో సౌకర్యాలు కల్పిస్తామని స్ట్రీట్కాజ్ ప్రతినిధి మధుచంద్ర తెలిపారు. మన బాధ్యత.. మొదట ఈ ఆర్గనైజేషన్ గురించి కొందరు స్నేహితులు చెప్పినప్పుడు... హే ఏం చేస్తారులే అనుకున్నాను. కానీ సేవా కార్యక్రమాలు చూశాక నాకూ చేరాలని అనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా ఆర్గనైజేషన్‌లో చేరిపోయాను. సమాజానికి సేవ చేయడం మన బాధ్యత. – మధుచంద్ర, అసోసియేట్ ప్రెసిడెంట్ అదే ఆనందం.. సేవా కార్యక్రమాల్లో భాగంగా చాలా మందిని కలుస్తుంటాం. వాళ్లతో మాట్లాడినప్పుడు వారి మోముల్లో వచ్చే చిరునవ్వులు మాకెంతో ఆనందాన్ని ఇస్తాయి. చిన్న వయసులో ఇదంతా మీకెందుకు అన్నవాళ్లూ ఉన్నారు. అయినా సేవా చేయాలనే తపనతోనే ముందుకెళ్తున్నాం.– తన్వీ, వైస్ ప్రెసిడెంట్ -
ప్రకాష్ రాజ్.. శ్రీమంతుడయ్యాడు!
అవును... సినీనటుడు ప్రకాష్ రాజ్ శ్రీమంతుడయ్యాడు. ఆయన ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో నటిస్తున్నారు కాబట్టి ముందే శ్రీమంతుడు అయ్యారని డౌటొచ్చిందా? అదేనండీ.. శ్రీమంతుడు సినిమాలో చూపించినట్లుగా, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమం స్ఫూర్తితో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోడానికి ఆయన ముందుకొచ్చారు. ఈ విషయం గురించి చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావును సోమవారం కలిశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లె అనే గ్రామాన్ని తాను దత్తత తీసుకుని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. దానికి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. Had a far reaching meeting with minister Mr KTR in connection with adopting a village . Journey begins.. Details soon pic.twitter.com/A5Y7k8MJHZ — Prakash Raj (@prakashraaj) September 7, 2015 @prakashraaj would be adopting Kondareddipalle village in Mahabubnagar dist. pic.twitter.com/B91kI0w1Ut — Min IT, Telangana (@MinIT_Telangana) September 7, 2015 -
దత్తతకు మరో గ్రామం
సాక్షి, చెన్నై : తిరువణ్ణామలై జిల్లా మెయ్యూరు గ్రామాన్ని ఎంపీ కనిమొళి దత్తతకు స్వీకరించారు. ఆ గ్రామంలో అభివృద్ధి పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు.డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కని మొళి రాష్ట్రం నుంచి రాజ్య సభకు ఎన్నికైన విష యం తెలిసిందే. ప్రతి ఏటా తన ఎంపీ నిధుల్ని ఖ ర్చు పెట్టేందుకు ఓ గ్రామాన్ని ఆమె దత్తత స్వీకరిస్తూ వస్తున్నారు. గత ఏడాది తూత్తుకుడి జిల్లా ఆళ్వార్ తిరుగనగర్ యూనియన్ పరిధిలోని శ్రీ వైకుంఠంను ఎంపిక చేసుకున్నారు. అక్కడ అభివృ ద్ధి పనులు కొన్ని ముగింపు దశకు చేరగా, మరికొన్ని శరవేగంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ ఏడాదికిగాను మరో గ్రామాన్ని ఆమె దత్తత స్వీకరించేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది తనకు కేటాయిం చి నిధుల్ని ఆ గ్రామానికి ఖర్చు పెట్టడంలో భా గంగా అభివృద్ధి కార్యాచరణను సిద్ధం చేశారు. పలు గ్రామాలను పరిశీలించి చివరకు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న తిరువణ్ణామలై జిల్లా మెయ్యూరు గ్రామానికి ఎంపిక చేసుకున్నారు. మరో గ్రామం : మెయ్యూరు గ్రామాన్ని దత్తతకు తీసుకున్న కనిమొళి ఆదివారం ఆ గ్రామంలో పర్యటించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఎంపి నిధుల వినియోగం గురించి, వాటిని సద్వినియోగంచేసుకోవాల్సిన విధానం గురించి ప్రజలకు వివరించారు. తూత్తుకుడిలో తాను దత్తతకు స్వీకరించిన శ్రీ వైంకుంఠం గ్రామంలో పూర్తి చేసిన పనులు, జరుగుతున్న పనులను విశదీకరించారు. ఈ గ్రామం నుంచి అత్యధికంగా తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గ్రీన్ హౌస్‌ల నిర్మాణం, వృద్ధాప్య పెన్షన్ల గురించి అని పేర్కొన్నారు. అయితే, ఆ రెండు ప్రస్తుతం తన పరిధిలో లేదు అని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికల ద్వారా డీఎంకే తప్పకుండా అధికారంలోకి రావడం ఖాయం అని, అప్పుడు తప్పకుండా ఆ రెండు పథకాలు ఈగ్రామంలో ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. అందరూ కలసి డీఎంకేను అధికారంలోకి తీసుకొస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో అన్ని రకాల మౌళిక వసతుల కల్పనకు నిధుల్ని వెచ్చించనున్నామని వివరించారు. అందరూ కలసి కట్టుగా నిధుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి పరుద్దామని పిలుపు నిచ్చారు. ఇక్కడికి తాను తరచూ వస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆ గ్రామ ప్రజలకు కనిమొళి హామీ ఇచ్చారు.