'భారత్ ఒక దేశం కాదు'.. డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు | DMK Leader A Raja India Has Never Been A Nation Remark, BJP Demands His Arrest - Sakshi
Sakshi News home page

'భారత్ ఒక దేశం కాదు'.. డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Mar 5 2024 6:42 PM | Last Updated on Tue, Mar 5 2024 7:13 PM

India Not A Nation DMK MP A Raja - Sakshi

డీఎంకే ఎంపీ ఎ రాజా ద్వేషపూరిత ప్రసంగాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించమని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చిన తరువాత, భారతదేశాన్ని బాల్కనైజేషన్ చేయాలని పిలుపునివ్వడమే కాకుండా.. రాముణ్ణి అపహేళన చేయడం, భారతదేశం ఒక దేశం కాదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం ఒక దేశం కాదు. దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక దేశం అంటే ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి. అప్పుడు మాత్రమే అది ఒక దేశంగా పరిగణిస్తారు. భారతదేశం ఒక ఉపఖండం. కారణం ఏమిటంటే.. ఇక్కడ తమిళం ఒక దేశం, మలయాళం ఒక భాష. ఇలా దేశాలన్నీ కలిసి భారతదేశాన్ని ఏర్పరుస్తాయి. సంస్కృతులు కూడా వేరుగా ఉన్నాయంటూ.. మణిపూర్ ప్రజలపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

మన ఇళ్లలోనే వంటగది, టాయిలెట్లకు ఒకే ట్యాంకర్ నుంచి నీళ్లు వస్తాయని. కానీ టాయిలెట్‌లో వచ్చే నీళ్లను వంటగదిలో ఉపయోగించరు. నీరు ఒక్కటే, అది వచ్చే ప్రదేశాన్ని బట్టి ఉపయోగించడమా.. లేదా అనేది మనమే నిర్ణయించుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పోస్ట్ చేశారు.

మేము రాముడికి శత్రువులు. నాకు రామాయణంపైనా, రాముడిపైనా విశ్వాసం లేదని ఎంపి ఎ రాజా వ్యాఖ్యానించారు. రాజా చేసిన ఈ వ్యాఖ్యలపైన అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి మండిపడ్డారు. దీనిపైన ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. 

భారతదేశ ధర్మాన్ని అవమానించడం, హిందూ దేవుళ్లను బహిరంగంగా కించపరచడం వంటివి క్షమించరానివని, ఈ వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని, వెంటనే ఎ రాజాను అరెస్టు చేయాలని తమిళనాడు బిజెపి అధికార ప్రతినిధులు అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement