ప్రధాని మోదీపై డీఎంకే మంత్రి నీచపు వ్యాఖ్యలు.. మండిపడుతున్న బీజేపీ నేతలు | BJP slams DMK after Tamil Nadu ministers derogatory comments on PM Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై డీఎంకే మంత్రి నీచపు వ్యాఖ్యలు.. మండిపడుతున్న బీజేపీ నేతలు

Published Mon, Mar 25 2024 11:41 AM | Last Updated on Mon, Mar 25 2024 1:44 PM

BJP slams DMK after Tamil Nadu ministers derogatory comments on PM Modi - Sakshi

చెన్నై: డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్‌ ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీని దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు మండి పడుతున్నారు. తక్షణమే రాధాకృష్ణన్‌ మీద చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అనితా రాధాకృష్ణన్‌.. మోదీపై చేసిన వ్యాక్యాలకు సంబంధించిన వీడియోను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రధానిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, అది క్షమించరాని నేరమని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ కూడా ఈ వీడియోను తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు.

ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి స్పందిస్తూ.. మంత్రిని బర్తరఫ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. ఇంగ్లిష్ భాషలో అత్యంత నీచమైన (చెడ్డ) పదమని ఆ మంత్రి వాడారని.. డీఎంకేకు సిగ్గు ఉంటే.. ప్రధానిని దుర్భాషలాడినందుకు మంత్రిని బర్తరఫ్ చేయాలని అన్నారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా.. ప్రధానిపై రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో అలాంటి భాషకు స్థానం లేదని అన్నారు. మనిషికి విధ్వంసం సంభవించినప్పుడు, ముందుగా చనిపోయేది మనస్సాక్షి. ఇండియా కూటమిలో ఉన్నవారు మనస్సాక్షిని కోల్పోతున్నారని ఠాకూర్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement