![Tollywood Hero Vijay Devarakonda Craze In USA Goes Viral](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/06/10/viaj.jpg.webp?itok=UvSsJZ96)
కొత్త ఏడాదిలో ఫ్యామిలీ స్టార్‌తో హిట్ కొట్టిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ అతనికి జంటగా నటించింది. పరశురామ్ పెట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.
అయితే తాజాగా మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ అమెరికాలో సందడి చేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. విజయ్‌ను చూసిన అక్కడి అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఎక్కడికెళ్లినా విజయ్ క్రేజ్ వేరే లెవెల్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. ప్రస్తుతం విజయ్- గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. వీటితో పాటు రాహుల్ సంకృత్యాన్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు.
Akkada ikkada clg oo mall oo kadhu raa idii US lo Ela mida padtunnaro chudandii adi ma @TheDeverakonda anna craze uuuu❤️🔥❤️🔥🔥#VijayDeverakonda pic.twitter.com/39FBZIfrF6
— The Revanth (@Revanth__7) June 10, 2024
Rowdy boy @TheDeverakonda receives overwhelming love and massive response from USA Telugu people-Women forum At ATA - USA! ❤️🔥😍#VijayDeverakonda #VD12 #TeluguFilmNagar pic.twitter.com/T3W7paaWPH
— Telugu FilmNagar (@telugufilmnagar) June 10, 2024
Comments
Please login to add a commentAdd a comment