సాక్షి, కర్నూలు జిల్లా: సినిమాల్లో ఎందరు హీరోలున్నా రాజకీయాల్లో మాత్రం సీఎం జగన్ ఒక్కరే హీరో.. అంతులేని అభిమానం ఆయనకే సొంతం. తాజాగా, కర్నూలు ప్రచార సభలో సీఎం జగన్‌కు ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు తెలిపారు. ది లీడర్ జగన్ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. జై జగన్ అంటూ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ సభలో నినాదాలు చేశారు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలకు జనం ప్రభంజనంలా తరలివస్తున్నారు. ఓవైపు సీఎం జగన్ నిర్వహిస్తున్న ప్రచార సభలకు సునామీలా జనం పోటెత్తుతుండటం.. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందనే లేకపోవడంతో కూటమి శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment