అభిమానుల ఆగ్రహానికి గురైన రష్మిక .. అంతా ఆ కామెంట్స్ వల్లే..! (ఫోటోలు) | Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos | Sakshi
Sakshi News home page

అభిమానుల ఆగ్రహానికి గురైన రష్మిక .. అంతా ఆ కామెంట్స్ వల్లే..! (ఫోటోలు)

Published Sun, Feb 16 2025 1:38 PM | Last Updated on

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos1
1/15

నేషనల్‌ క్రష్‌ రష్మిక(Rashmika Mandanna)పై కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos2
2/15

పుట్టిన ఊరిని మర్చిపోయావంటూ ఆమెపై మండిపడుతున్నారు. దీనికి కారణం ‘ఛావా’(Chhaava) ప్రమోషన్స్‌ ఈవెంట్‌లో రష్మిక చేసేన వ్యాఖ్యలే.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos3
3/15

విక్కీ కౌశల్‌, రష్మిక జంటగా నటించిన హిందీ చిత్రం ‘ఛావా’. ఈ మూవీ ఈ నెల 14న విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తుంది.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos4
4/15

రిలీజ్‌కి ముందు ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో రష్మిక పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌ నుంచి వచ్చానని చెప్పింది. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో చర్చకు దారీ తీశాయి.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos5
5/15

పుట్టిన ప్రాంతం(కర్ణాటక) పేరు చెప్పడానికి రష్మికకు వచ్చిన సమస్య ఏంటంటూ కన్నడ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos6
6/15

కర్ణాటకలోని కొడగు జిలా విరాజ్‌ పేట రష్మిక జన్మస్థలం. కిరిక్‌ పార్టీ అనే కన్నడ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఛలో’తో తెలుగులోకి అడుగుపెట్టింది. గీత గోవిందం సినిమాలో సూపర్‌ హిట్‌ అందుకుంది.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos7
7/15

ఆ తర్వాత టాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ లిస్ట్‌లోకి చేరిపోయింది. పుష్ప చిత్రంతో నేషనల్‌ క్రష్‌గా మారింది.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos8
8/15

అయితే ఛావా ప్రమోషనల్‌ ఈవెంట్‌లో తన సొంతూరు హైదరాబాద్‌ అన్నట్లుగా మాట్లాడడంతో కన్నడ ఫ్యాన్స్‌ తీవ్రంగా హర్ట్‌ అయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అసంతృప్తిని తెలియజేస్తూ రష్మికను ట్రోల్‌ చేస్తున్నారు.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos9
9/15

వరుస హిట్లు వచ్చే సరికి సొంతూరును మర్చిపోవడం సరైన పద్దతి కాదంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos10
10/15

కాగా, గతంలోనూ రష్మికపై ఇలాంటి ట్రోలింగే జరిగింది.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos11
11/15

పుష్ప రిలీజ్‌ సమయంలో తన తొలి సినిమా కిరిక్‌ పార్టీ నిర్మాణ సంస్థ పేరును చెప్పకుండా...‘పేపర్లో వచ్చిన తన ఫొటో చూసి ఓ నిర్మాణసంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చింది’ అని రష్మిక చెప్పడంతో నెటిజన్స్‌ ఫుల్‌ ఫైర్‌ అయ్యారు.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos12
12/15

అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos13
13/15

రష్మిక నటించిన సినిమాలను బ్యాన్‌ చేయాలంటూ అప్పట్లో ట్వీట్స్‌ చేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత రష్మిక ట్రోలింగ్‌కి గురైంది. దీనికి ఈ నేషనల్‌ క్రష్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos14
14/15

Kannada Fans Fire On Rashmika Mandanna comments Photos15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement