కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (73) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తీవ్ర కడుపునొప్పితో చేరారు. వైద్యపరీక్షల అనంతరం ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం ఉన్నట్లు చెబుతున్నారు. మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి రజనీ డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఉదయం అపోలో కాత్ ల్యాబ్‌లో రజినీకాంత్‌కు ఎలక్టివ్ ప్రొసీజర్ ట్రీట్ మెంట్ జరిగింది. భయపడాల్సింది ఏం లేదని, రెండు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు చెప్పుకొచ్చారు.
రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని వార్తలు వచ్చిన వెంటనే ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఆయన సతీమణి లతా కూడా స్పందించారు. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు. అభిమానులు ఆందోళన చెందకండని కోరారు. రజనీ క్షేమంగా ఉన్నారని తెలియగానే అభిమానులు సంతోషిస్తున్నారు. చెన్నై అపోలో కాత్ ల్యాబ్‌లో రజినీకాంత్‌కు కార్డియాలజిస్టుల పరీక్షలు కూడా పూర్తిచేశారు.
జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10న దర్శకుడు జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన వేట్టైయన్ విడుదల కానుంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని రజనీ చెన్నై వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment