అపోలో, మెడ్‌ప్లస్, ఆసుపత్రుల దుకాణాలు మినహా..
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో మందుల (మెడిసిన్స్) కొనుగోలు, అమ్మకాలు జరిపే విధానాన్ని నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా 8 లక్షల మందుల దుకాణాలు బంద్ పాటించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ కెమిస్ట్, డ్ర గ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటపతి, గౌరవ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మధుసూదన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో మందుల కొనుగోలు అమ్మకాల వల్ల అనేక నష్టాలున్నాయని పేర్కొన్నారు. డాక్టర్‌ను సంప్రదించకుండానే ప్రజలు అపరిమితంగా మందులను వాడే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న బంద్‌కు సహకరించాలని కోరారు.
కాగా, మందుల దుకాణాల బంద్ నేపథ్యంలో ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని దుకాణాలు, జెనరిక్ మందుల దుకాణాలు, సింగరేణికి చెందిన దుకాణాలు, అపోలో, మెడ్‌ప్లస్ దుకాణాలు, ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌లో అన్ని ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలన్నీ తెరిచే ఉంటాయని వెల్లడించారు.
నేడు మందుల దుకాణాలు బంద్
Published Wed, Oct 14 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM
Advertisement