
హైదరాబాద్: అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఎ) నుండి కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ (సిఎస్ సి) సర్టిఫికేషన్‌తో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ దేశంలో స్ట్రోక్ చికిత్సకు సంబంధించి నూతన ప్రమాణాన్ని నెలకొల్పింది. ప్రత్యేక స్ట్రోక్ బృందాలు, అధునాతన ఇమేజింగ్‌తో స్ట్రోక్ డయాగ్నసిస్, క్రిటికల్ కేర్‌లో అత్యవసర ప్రతిస్పందనలతో అత్యంత కఠినమైన ప్రమాణాలను అందుకోగలదని ఏహెచ్ఎ సర్టిఫికేషన్‌తో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ విజయవంతంగా నిరూపించుకుంది. అత్యున్నత స్ట్రోక్-కేర్ సర్టిఫికేషన్‌ను పొందిన భారతదేశంలో మొట్టమొదటి సంస్థగా ఏహెచ్ఎ దీనిని గుర్తించింది. జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ 24 గంటలూ పూర్తిగా అంకితం చేయబడిన, ప్రత్యేకమైన, మల్టీడిసిప్లినరీ స్ట్రోక్ బృందాన్ని కలిగి ఉంది,
ఈ బృందంలో అత్యవసర వైద్యులు, న్యూరాలజిస్టులు, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్టులు, న్యూరో సర్జన్లు, ఇంటెన్సివిస్టులు, ప్రత్యేక నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మల్టీడిసిప్లినరీ నిపుణుల బృందంలో డాక్టర్ అలోక్ రంజన్-సీనియర్ కన్సల్టెంట్ & హెచ్ఓడి న్యూరోసర్జరీ, డాక్టర్ ఇమ్రాన్ సుభాన్, సీనియర్ కన్సల్టెంట్ & హెడ్ ఎమర్జెన్సీ మెడిసిన్; డాక్టర్ కె. సుబ్బారెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ & హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్: డాక్టర్ సురేష్ గిర్గాని, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ మరియు డాక్టర్ సి. రాజేష్ రెడ్డి, న్యూరాలజిస్ట్ ఉన్నారు.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ, "భారతదేశంలో మొట్టమొదటి ఆసుపత్రిగా ప్రతిష్టాత్మకమైన ఏహెచ్ఎ సర్టిఫికేషన్ సాధించడం, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించడంలో మా అచంచలమైన నిబద్ధతను వెల్లడిస్తుంది. సమయం, నైపుణ్యం ప్రాణాలను కాపాడుతుందని గుర్తించిన మేము మా శ్రేష్ఠత వినియోగంలో ఎలాంటి అవకాశాన్ని వదులుకోము.
ఈ సర్టిఫికేషన్ రోగులకు వేగవంతమైన, అత్యంత ఖచ్చితమైన సంరక్షణ మార్గదర్శకాలకు హామీ ఇస్తుంది, సాధ్యమైనంత ఉత్తమంగా కోలుకునేలా చేస్తుంది. ఇది మా నిరంతర శ్రేష్ఠత సాధన, ప్రపంచ నాణ్యత, రోగి భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటాన్ని ప్రతిబింబిస్తుంది" అని అన్నారు. అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ, శ్రీ వి. తేజస్వి రావు మాట్లాడుతూ "ఈ ధృవీకరణ మేము అందించే అత్యున్నత స్థాయి సంరక్షణకు గుర్తింపు, దేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మార్చాలనే మా ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.
రోగ నిర్ధారణ నుండి రీహాబిలిటేషన్ వరకు స్ట్రోక్ కేర్కు క్రాస్-డిసిప్లినరీ విధానాన్ని అవలంబించడం ద్వారా, ప్రతి రోగికి వైకల్యాన్ని తగ్గించడానికి, కోలుకోవడాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన రీతిలో రూపొందించిన వైద్య సహాయం, క్రిటికల్-కేర్ మద్దతు లభిస్తుందని మేము నిర్ధారిస్తున్నాము. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, నిరంతర పరిశోధన కమ్యూనిటీ ఔట్రీచ్ ద్వారా, ప్రతిచోటా రోగులు అత్యున్నత ప్రమాణాల తో చికిత్సను పొందగలిగేలా మేము స్ట్రోక్ కేర్‌ను పెంచుతున్నాము" అని అన్నారు.
ఈ అక్రిడిటేషన్ మైలురాయి స్ట్రోక్ లక్షణాలు కనిపించటం నుండి రీ హాబిలిటేషన్, స్ట్రోక్ తరువాత రికవరీ ద్వారా రోగులకు మద్దతు ఇవ్వడం వరకూ అపోలో హాస్పిటల్స్ తీసుకున్న సమగ్ర విధానాన్ని వెల్లడిస్తుంది. తరచుగా "బ్రెయిన్ స్ట్రోక్ " గా పిలువబడే స్ట్రోక్, మెదడుకు రక్త సరఫరా సరిగా జరగనప్పుడు సంభవిస్తుంది. సాధారణంగా మూసుకుపోయిన లేదా పగిలిన నాళం కారణంగా, రక్త ప్రవాహం సరిగా లేకపోవడం జరుగుతుంది.
ఈ కారణం వల్ల మాట్లాడటం, కదలడం లేదా శరీరం ఒక వైపు ఉపయోగించగల సామర్థ్యం వంటి కొన్ని శారీరక విధులను అకస్మాత్తుగా కోల్పోవడం జరుగుతుంది. వైకల్యాన్ని తగ్గించడంలో, ప్రాణాలను కాపాడడంలో వేగవంతంగా గుర్తింపు, తక్షణ చికిత్స చాలా కీలకం. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్ హెడ్ డాక్టర్ ఇమ్రాన్ సుభాన్ మాట్లాడుతూ, "తెలంగాణలో నిర్వహించిన అధ్యయనాలు వ్యవస్థీకృత మల్టీడిసిప్లినరీ బృందాలుఅందించే స్ట్రోక్ కేర్ సేవలతో అత్యవసర స్ట్రోక్ కేసులకు చికిత్స చేయడంలో నిర్మాణాత్మక క్లినికల్ నిర్వహణను అందించాల్సిన అవసరాన్ని చూపించాయి.
మా అంకితమైన అత్యవసర సంబర్ 1066 తో రోడ్డుపై ఉన్నప్పుడు కూడా రోగికి చికిత్స చేయగల రీతిలో సౌకర్యాలు కలిగిన అంబులెన్స్లు, బాగా శిక్షణ పొందిన అత్యవసర వైద్యులు, నర్సులతో, మేము ఇప్పటికే ప్రపంచ స్థాయి స్ట్రోక్ కేర్ను అందిస్తున్నాము. భారతదేశంలో మొట్టమొదటి ఏహెచ్ఎ-ధృవీకృత సమగ్ర స్ట్రోక్ సెంటర్గా ఉండటం గర్వకారణం" అని అన్నారు. జీవనశైలి మార్పులతో భారతదేశం స్ట్రోక్ విషయంలో గణనీయమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ప్రాంతాలలో, అవగాహన లేకపోవడం, తగినంత అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు అందుబాటులో ఉండక పోవటం చేత సమయానికి తగిన చికిత్స అందించటం కష్టమవుతుంది.
ఈ కారణం చేత రోగుల నాడీ వ్యవస్థ దెబ్బతినడం లేదా మరణంతో సహా అధ్వాన్నమైన ఫలితాలకు దారితీస్తుంది. ఇప్పుడు, అపోలో హాస్పిటల్స్ వద్ద, కొత్త ఏహెచ్ఎ-సర్టిఫైడ్ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ స్ట్రోక్ కేసులను ఎలా గుర్తించవచ్చు, చికిత్స చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు అనే దానిలో ఒక అద్భుతమైన మెరుగుదలను సూచిస్తుంది.
అత్యాధునిక ఇమేజింగ్ పరికరాలు, ఈఎంఎస్, హాస్పిటల్ బృందాల మధ్య రియల్-టైమ్ కమ్యూనికేషన్, ఉత్తమ ప్రపంచ పద్ధతులతో సమలేఖనం చేయబడిన, స్థిరపడిన చికిత్సా ప్రోటోకాల్లను కలపడం ద్వారా, అపోలో హాస్పిటల్స్ లోని రోగులు ఇప్పుడు ఏకీకృత సంరక్షణ అనుభవాన్ని పొందుతున్నారు, ఇది తక్కువ సమస్యలతో కోలుకునే అవకాశాలను పెంచుతుంది. కార్డియోవాస్కులర్, హార్ట్, స్ట్రోక్ కేర్లో ప్రపంచ సాధికార సంస్థ అయిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ద్వారా సమగ్ర స్ట్రోక్ సెంటర్ ధృవీకరణ పొందటం అనేది ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కేర్కు అత్యున్నత ప్రమాణం. ఆసుపత్రులు కఠినమైన ప్రమాణాలను అనుసరించిన మీదట మాత్రమే ఈ ధృవీకరణ అందిస్తారు. అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, ఈ అవసరాలలో ప్రతిదాన్ని తీర్చింది లేదా అధిగమించింది, భారతదేశంలో స్ట్రోక్ కేర్ కోసం అత్యుత్తమ ప్రమాణాన్ని నెలకొల్పింది. వీటిలో..
* స్ట్రోక్ రోగులు ఆసుపత్రికి చేరుకోవడానికి ముందే వారిని త్వరగా గుర్తించేలా చేసే అత్యంత సమర్థవంతమైన స్ట్రోక్-అలర్ట్ వ్యవస్థతో ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ మరియు స్ట్రోక్ మార్గాలు. ఇందులో అత్యవసర వైద్య సేవలు (EMS), క్రమబద్ధీకరించబడిన ట్రయాజ్ ప్రక్రియ, తగిన సమయంలో క్లాట్-బస్టింగ్ ఔషధాల తక్షణ నిర్వహణ మధ్య సమన్వయం ఉన్నాయి.
• స్ట్రోక్ రకం, తీవ్రతను ఖచ్చితంగా నిర్ధారించడానికి సిటి స్కాన్లు, ఎంఆరా లు మరియు ఇతర ప్రత్యేక న్యూరోఇమేజింగ్ వంటి సామర్థ్యాల 24/7 లభ్యత, లక్ష్య జోక్యాలను అనుమతిస్తుంది.
అధునాతన ఇమేజింగ్ ఏ సమయంలోనైనా ఎండోవాస్కులర్ థ్రోంబెక్టమీ (కాథెటర్ ద్వారా క్లాట్లను తొలగించడం) వంటి అధునాతన స్ట్రోక్ చికిత్సల కోసం ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ సేవల 24/7 లభ్యత, రోగి ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. * క్రిటికల్ కేర్, స్ట్రోక్ నిర్వహణలో నిపుణులతో కూడిన ప్రత్యేక న్యూరో- ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కొనసాగుతున్న రోగి పరిశీలన, స్థిరీకరణ మరియు కోలుకోవడానికి అవసరం.
వైద్య సిబ్బందికి శిక్షణతో పాటు స్ట్రోక్ కేర్‌లో నిరంతర పరిశోధన, విద్య మరియు రోగి అవగాహన కార్యక్రమాలు అత్యున్నత నిర్వహించడానికి తోడ్పడతాయి. ప్రమాణాల సాధనను భారతదేశంలో వైద్య పురోగతి పరంగా అపోలో హాస్పిటల్స్ నిరంతరం ముందంజలో ఉంది. ముఖ్యంగా, హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్, 2006లో స్ట్రోక్ నిర్వహణ కోసం యునైటెడ్ స్టేట్స్ వెలుపల వ్యాధి-నిర్దిష్ట దృవీకరణ పొందిన మొట్టమొదటి ఆసుపత్రిగా గుర్తింపు పొందింది . ఈ శ్రేష్ఠత వారసత్వం భారతదేశంలో పెరుగుతున్న స్ట్రోక్ భారాన్ని ఎదుర్కోవడానికి వినూత్న సాంకేతికతలు, బహుళ విభాగ బృంద కృషి, పరిశోధన-ఆధారిత పద్ధతులను ఉపయోగించుకునే అధునాతన కార్యక్రమాలకు పునాది వేసింది.
Comments
Please login to add a commentAdd a comment