
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.275తో పోలిస్తే 74 శాతం లాభం తో రూ.478 వద్ద లిస్టయింది. ఇష్యూ ధరతో పోలిస్తే 65 శాతం లాభంతో రూ.454 వద్దముగిసింది.
ఇంట్రాడేలో రూ.480 గరిష్ట స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో రూ.465 వద్ద లిస్టయిన ఈ షేర్ ఇంట్రాడేలో రూ.480 గరిష్ట స్థాయిని తాకి చివరకు రూ.442 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 1.7 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 10.38 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.