సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి ఉద్యోగుల జీతాలను షార్టేజ్ పేరుతో నిలువు దోపిడి చేస్తున్న ఘటన రాచకొండ కాప్రా గాంధీ నగర్ అపోలో ఫార్మసీలో చోటుచేసుకుంది. చాలచాలనీ జీతాలు ఇస్తూ అందులోనూ షార్టేజ్ పేరుతో.. ఎగ్జిక్యూటివ్ సిబ్బంది డబ్బులు కాజేయడాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫార్మసీ ఉద్యోగులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు.
గాంధీనగర్ అపోలో ఫార్మసీలో ట్రైనీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న జెస్సీ(బేబీ) ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. ప్రతినెలా షార్టేజ్ పేరుతో 5వేల నుంచి 8వేల రూపాయల వరకు కాజేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వచ్చే జీతంలో మొత్తం డబ్బులు వారే తీసుకుంటే మేము ఎలా బ్రతకాలి..? మా కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇదేంటని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మా దగ్గర ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నట్లు వివరించారు. (హైదరాబాద్ పోలీసుల సాహసం..)
దీంతో ఫార్మసీ ఉద్యోగులు పోలీసులను కలిసి బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పై అధికారులకు తెలియకుండా కింది స్థాయి ఉద్యోగులు మాఫియాగా ఏర్పడి ఉద్యోగులను వేదిస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. ఫార్మసీ ఉద్యోగుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment