అపోలో మ్యూనిక్‌లో అపోలో హాస్పిటల్స్ వాటాల విక్రయం | Image for the news result Apollo Hospitals Group to sell 23.3% stake in Apollo Munich Health Insurance | Sakshi
Sakshi News home page

అపోలో మ్యూనిక్‌లో అపోలో హాస్పిటల్స్ వాటాల విక్రయం

Published Tue, Jan 26 2016 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

అపోలో మ్యూనిక్‌లో అపోలో హాస్పిటల్స్ వాటాల విక్రయం

అపోలో మ్యూనిక్‌లో అపోలో హాస్పిటల్స్ వాటాల విక్రయం

అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో తమకున్న 23.3 శాతం వాటాలను జర్మన్ భాగస్వామ్య సంస్థ ‘మ్యూనిక్ రీ’కి విక్రయించనున్నట్లు..

23.3 శాతం వాటాల అమ్మకం
డీల్ విలువ రూ. 163.5 కోట్లు

  హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో తమకున్న 23.3 శాతం వాటాలను జర్మన్ భాగస్వామ్య సంస్థ ‘మ్యూనిక్ రీ’కి విక్రయించనున్నట్లు అపోలో ఎనర్జీ కంపెనీ వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 163.5 కోట్లుగా ఉండనుంది. డీల్ అనంతరం జాయింట్ వెంచర్‌లో మ్యూనిక్ రీ వాటా 48.7 శాతానికి పెరుగుతుంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వాటా 74.4 శాతం నుంచి 51.1 శాతానికి తగ్గుతుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డీల్ పూర్తి కాగలదని అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో భాగమైన అపోలో ఎనర్జీ కంపెనీ తెలిపింది. ప్రతిపాదిత లావాదేవీ ప్రకారం అపోలో మ్యూనిక్ విలువ రూ. 703 కోట్లుగా ఉండనుంది. అందరికీ వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్య సాధనకు ఈ డీల్ తోడ్పడగలదని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement