సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: కిషన్‌రెడ్డి | Kishan Reddy Says He Is Accepting Cm Revanth Challenge | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: కిషన్‌రెడ్డి

Feb 22 2025 4:19 PM | Updated on Feb 22 2025 4:59 PM

Kishan Reddy Says He Is Accepting Cm Revanth Challenge

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని.. సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హామీలు అమలుకు ప్రణాళిక,

సాక్షి, నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని..  సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హామీలు అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమన్నారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదు. చర్చకు రమ్మనడం  హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలో సీఎం రేవంత్ స్పష్టం చేయాలని కిషన్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి. బీజేపీని ఆదరించాలి. బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుంది. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్‌లను స్వాగతిస్తాం. ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తాం. బీజేపీ తో బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్‌తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో అనేక సార్లు బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. జిల్లా అధ్యక్షుల నియామకాల ప్రక్రియ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక’’ ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

14 నెలల్లో కాంగ్రెస్ ప్రజలకు ఓరగబెట్టింది ఏమీ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు శాసన మండలి ప్రాధాన్యతను తగ్గించాయి. ప్రజా సమస్యల పోరాటానికి శాసన మండలి వేదిక. కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. ముస్లింలను బీసీ లో చేర్చే కుట్ర జరుగుతుంది. దానికి వ్యతిరేకం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement