సాక్షిప్రతినిధి, నల్లగొండ : మిర్యాలగూడ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ అల్గుబెల్లి అమరేందరరెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత వర్గపోరు తాజాగా బహిరంగ వేదికలకు ఎక్కింది. నియోజకవర్గంలో పట్టణ, మండలాల కమిటీలు తమను సంప్రదించకుండానే వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమరేందర్‌రెడ్డి వర్గం బలప్రదర్శన చేసింది. మిర్యాలగూడలో శుక్రవారం ఆత్మీయసభ పేరుతో ఆయన అనుచరులు సభ నిర్వహించి నేరుగా ఎమ్మెల్యే భాస్కర్‌రావుపైనే విమర్శలు ఎక్కుపెట్టారు.
ఎమ్మెల్యే చేరినప్పటినుంచి మొదలైన గ్రూపులు
కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే భాస్కర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటినుంచి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ కేడర్ గ్రూపులుగా విడిపోయింది. గతంలో ఉన్న ఉద్యమ, పార్టీ నేతలు, పలుపార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన కొంతమంది నేతలు అమరేందర్‌రెడ్డి వర్గంగా కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న నేతలు, కొంతమంది ఉద్యమ, పార్టీ నేతలు ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్నారు. ఇలా ఎవరివర్గం వారు ఉంటూ.. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను వేర్వేరుగానే చేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని అమరేందర్‌రెడ్డి వర్గం కొంతకాలంగా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నియోజకవర్గంలో మం త్రులు పర్యటించినా ఎమ్మెల్యే అనుచరులు కనీసం అమరేందర్‌రెడ్డి ఫొటో కూడా ఫ్లెక్సీల్లో పెట్టడం లేద ని అధినేతల ముందు ఆందోళన వ్యక్తంచేశారు.
వర్గాలుగా ఉన్న పోరు మూడు రోజు లు క్రితం ని యోజకవర్గంలో పట్టణ, మండల కమిటీలను వేయడంతో మరింత ముదిరింది. ఇటీవల వేసిన రైతు సమన్వ య సమితుల్లో ఎమ్మెల్యే వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడూ కూడా ఆయన కనుసన్నల్లోనే ఆయన అనుచరులకే కమిటీల్లో కీలక బాధ్యతలు వచ్చాయని అమరేందర్‌రెడ్డి వర్గం ఆగ్రహంతో ఊగి పోయింది. కాంగ్రెస్‌నుంచి వచ్చిన నేతలకే పదవులు వస్తున్నాయని, పార్టీ జెండాను భూ జానికెత్తుకొని మోసన తమను పక్కన పెడతారని నిరసన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకునేం దుకు ఏ కంగా అమరేందర్‌రెడ్డి వర్గం బల ప్రదర్శన చేసింది.
‘మిర్యాలగూడ టికెట్ నాకే’ ప్రకటనతో అలజడా..?
టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీనుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఈసారి ఆయా నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తారా..? లేక ఇతర నియోజకవర్గాలకు వెళ్తారా..? అని ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా జోరుగా చర్చ సాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగానే ఎమ్మెల్యే భాస్కర్‌రావు కూడా మిర్యాలగూడనా..? లేదా కోదాడనుంచి పోటీ చేస్తారా..? అని చర్చకు వచ్చింది. నాలుగు రోజుల క్రితం భాస్కర్‌రావు ‘మిర్యాలగూడ టికెట్ నాకే’ అంటూ ప్రకటన చేశారు. భాస్కర్‌రావు కోదాడకు వెళ్లితే.. అమరేందర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేయడం ఖాయమని ఆయన అనుచర నేతలు భావించారు. కానీ ఎమ్మెల్యే ప్రకటన, పార్టీ కమిటీల్లో చోటు లేకపోవడం, తది తర అంశాలతో నరాజులో ఉన్న అమరేందర్‌రెడ్డి వ ర్గం ఒక్కసారిగా ఎమ్మెల్యేపై మండిపడింది. ఆయన ప్రధాన అనుచరుడు గాయం ఉపేందర్‌రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ‘ఆత్మీసభ’ను నిర్వహించి ఎమ్మెల్యేనే టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపించారు.
పార్టీ కమిటీల ప్రకటన..
ఎమ్మెల్యే వేయించిన పార్టీ కమిటీలను తాము గుర్తించడం లేదని పేర్కొంటూ ఉపేందర్‌రెడ్డి నేతృత్వంలో ఆత్మీయ సభలో కొత్త కమిటీలను ప్రకటిం చుకున్నారు. మిర్యాలగూడ పట్టణ, మండల, వేములపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి మండలాలకు కమిటీలను వేశారు. అయితే ఈ సభకు మాత్రం అమరేందర్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన కనుసన్నల్లోనే సభ జరిగిందని ఎమ్మెల్యే భాస్కర్‌రావు వర్గం భావి స్తోంది. మొత్తంగా మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఈ పరిణామం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లనుందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇక్కడితే చెక్‌పెట్టకపోతే దేవరకొండతో పా టు ఇతర నియోజకవర్గాల్లో కూడా అసమ్మతి గళం బాహటంగానే బయటకు వస్తుందని.. దీంతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆ పార్టీ నేతలు సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment