amarendar Reddy
-
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు..!
గులాబీ కండువాను తీసివేసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు జిల్లా నాయకులు కొందరు ముహూర్తాలు పెట్టుకుం టున్నారు. టికెట్ దక్కక కొందరు, పాత గూటికి చేరాలని మరికొందరు, అసంతృప్తులు ఇంకొందరు టీఆర్ఎస్ పార్టీకి టాటా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా టీఆర్ఎస్ మిర్యాలగూడ టికెట్ దక్కకపోవడంతో అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. నల్లగొండ పట్టణంలో ఇప్పటికే కొందరు హస్తం బాట పట్టగా... మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తన సహచరులు కొందరితో కలిసి టీఆర్ఎస్ను వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆ యా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు నెల రోజులుగా తర్జన భర్జన పడి.. చివరకు కారు ది గాలనే నిర్ణయించుకుంటున్నారు. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఎన్.భాస్కర్‌రావుకు సిట్టింగుగా భావించి టికెట్ ప్రకటించారు. దీంతో అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ప్రత్యామ్నాయం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నెల రోజులకు పైగా తన అనుచరులతో, దగ్గరి నాయకులతో మంతనాలు జరిపిన ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఆయన ముహూర్తం కూడా పెట్టుకున్నారని తెలిసింది. ప్రస్తుతం మిర్యాలగూడలో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వమన్న నిబంధన అమలయితే.. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు జనరల్ అభ్యర్థుల కొరత ఉందని అంటున్నారు. ఈ తరుణంలో అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఎలాంటి హామీ తీసుకోకుండానే బేషరతుగా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. టికెట్లు ఆశించి భగంగపడిన నాయకులు సొంత దారులు వెదుక్కుంటున్నారని దానిలో భాగంగానే అలుగుబెల్లి ఈనిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే జెడ్పీ చైర్మన్ బాలునాయక్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ నుంచే టీఆర్ఎస్లోకి వచ్చారు. దేవరకొండ టికెట్ హామీపైనే నాడు టీఆర్ఎస్లో చేరారని, కానీ, ఆయనకు టికెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ ఆతర్వాత పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరారు. తమ సిట్టింగుగానే భావించిన టీఆర్ఎస్ నాయకత్వం టికెట్ ఆయనకే ఖరారు చేసింది. దీంతో బాలునాయక్‌కు అవకాశం దక్కకుండా పోయింది. గతంలో ఆయన దేవరకొండ నుం చి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించా రు. 2009 ఎన్నికల్లో గెలిచిన బాలునాయక్ 2014 ఎన్నిక ల నాటికి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. దీంతో పొత్తుల్లో భాగంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. అదే దారిలో మరికొందరు నేతలు టీఆర్ఎస్లో టికెట్ దక్కక కాంగ్రెస్‌లోకి వెళుతున్న వారే కాకుండా, ఆయా స్థానాల్లో అభ్యర్థుల పట్ల అసంతృప్తిగా ఉన్న వారు, అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి టీ ఆర్ఎస్లో చేరిన వారు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే కొందరు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. పట్టణ కౌన్సిలర్లు కొందరు కాంగ్రెస్ బాట పట్టగా... మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తన సహచరులు కొందరితో కలిసి టీఆర్ఎస్ను వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా టీఆర్ఎస్ నాయకత్వ నిర్ణయాలపై అసంతృప్తితో కొందరు, అవకాశాలు రాక మరికొందరు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయాలు తీసుకుంటున్నారని విధితమవుతోంది. -
‘అమర’.. ఆగ్రహం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మిర్యాలగూడ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ అల్గుబెల్లి అమరేందరరెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత వర్గపోరు తాజాగా బహిరంగ వేదికలకు ఎక్కింది. నియోజకవర్గంలో పట్టణ, మండలాల కమిటీలు తమను సంప్రదించకుండానే వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమరేందర్‌రెడ్డి వర్గం బలప్రదర్శన చేసింది. మిర్యాలగూడలో శుక్రవారం ఆత్మీయసభ పేరుతో ఆయన అనుచరులు సభ నిర్వహించి నేరుగా ఎమ్మెల్యే భాస్కర్రావుపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఎమ్మెల్యే చేరినప్పటినుంచి మొదలైన గ్రూపులు కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే భాస్కర్‌రావు టీఆర్ఎస్లో చేరినప్పటినుంచి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కేడర్ గ్రూపులుగా విడిపోయింది. గతంలో ఉన్న ఉద్యమ, పార్టీ నేతలు, పలుపార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన కొంతమంది నేతలు అమరేందర్‌రెడ్డి వర్గంగా కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్‌నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నేతలు, కొంతమంది ఉద్యమ, పార్టీ నేతలు ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్నారు. ఇలా ఎవరివర్గం వారు ఉంటూ.. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను వేర్వేరుగానే చేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని అమరేందర్‌రెడ్డి వర్గం కొంతకాలంగా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నియోజకవర్గంలో మం త్రులు పర్యటించినా ఎమ్మెల్యే అనుచరులు కనీసం అమరేందర్‌రెడ్డి ఫొటో కూడా ఫ్లెక్సీల్లో పెట్టడం లేద ని అధినేతల ముందు ఆందోళన వ్యక్తంచేశారు. వర్గాలుగా ఉన్న పోరు మూడు రోజు లు క్రితం ని యోజకవర్గంలో పట్టణ, మండల కమిటీలను వేయడంతో మరింత ముదిరింది. ఇటీవల వేసిన రైతు సమన్వ య సమితుల్లో ఎమ్మెల్యే వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడూ కూడా ఆయన కనుసన్నల్లోనే ఆయన అనుచరులకే కమిటీల్లో కీలక బాధ్యతలు వచ్చాయని అమరేందర్‌రెడ్డి వర్గం ఆగ్రహంతో ఊగి పోయింది. కాంగ్రెస్‌నుంచి వచ్చిన నేతలకే పదవులు వస్తున్నాయని, పార్టీ జెండాను భూ జానికెత్తుకొని మోసన తమను పక్కన పెడతారని నిరసన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకునేం దుకు ఏ కంగా అమరేందర్‌రెడ్డి వర్గం బల ప్రదర్శన చేసింది. ‘మిర్యాలగూడ టికెట్ నాకే’ ప్రకటనతో అలజడా..? టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీనుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఈసారి ఆయా నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తారా..? లేక ఇతర నియోజకవర్గాలకు వెళ్తారా..? అని ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా జోరుగా చర్చ సాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగానే ఎమ్మెల్యే భాస్కర్‌రావు కూడా మిర్యాలగూడనా..? లేదా కోదాడనుంచి పోటీ చేస్తారా..? అని చర్చకు వచ్చింది. నాలుగు రోజుల క్రితం భాస్కర్‌రావు ‘మిర్యాలగూడ టికెట్ నాకే’ అంటూ ప్రకటన చేశారు. భాస్కర్‌రావు కోదాడకు వెళ్లితే.. అమరేందర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేయడం ఖాయమని ఆయన అనుచర నేతలు భావించారు. కానీ ఎమ్మెల్యే ప్రకటన, పార్టీ కమిటీల్లో చోటు లేకపోవడం, తది తర అంశాలతో నరాజులో ఉన్న అమరేందర్‌రెడ్డి వ ర్గం ఒక్కసారిగా ఎమ్మెల్యేపై మండిపడింది. ఆయన ప్రధాన అనుచరుడు గాయం ఉపేందర్‌రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ‘ఆత్మీసభ’ను నిర్వహించి ఎమ్మెల్యేనే టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపించారు. పార్టీ కమిటీల ప్రకటన.. ఎమ్మెల్యే వేయించిన పార్టీ కమిటీలను తాము గుర్తించడం లేదని పేర్కొంటూ ఉపేందర్‌రెడ్డి నేతృత్వంలో ఆత్మీయ సభలో కొత్త కమిటీలను ప్రకటిం చుకున్నారు. మిర్యాలగూడ పట్టణ, మండల, వేములపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి మండలాలకు కమిటీలను వేశారు. అయితే ఈ సభకు మాత్రం అమరేందర్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన కనుసన్నల్లోనే సభ జరిగిందని ఎమ్మెల్యే భాస్కర్‌రావు వర్గం భావి స్తోంది. మొత్తంగా మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఈ పరిణామం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లనుందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇక్కడితే చెక్‌పెట్టకపోతే దేవరకొండతో పా టు ఇతర నియోజకవర్గాల్లో కూడా అసమ్మతి గళం బాహటంగానే బయటకు వస్తుందని.. దీంతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆ పార్టీ నేతలు సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
అనంతపురం జిల్లా కదిరి శివారులో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఐదు ఎర్రచందనం దుంగలను, మూడు మోటార్‌సైకిళ్లు, రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నారాయణ, అమరేందర్‌రెడ్డి, చిన్నయ్య, శంకరప్ప, వెంకటరమణ, కార్తీక్‌లను అరెస్ట్ చేసి అర్బన్ స్టేషన్‌కు తరలించారు.