
కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ అక్షింతలు
ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ అక్షింతలు వేసింది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్టు ఈసీ పేర్కొంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. కల్యాణలక్ష్మీ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలకు వర్తింప చేస్తామని వరంగల్ ఎన్నికల్లో ప్రకటించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనేనని ఈసీ తెలిపింది.