
దర్శకుడిగా, హీరోగా లక్ష్మణ్ చిన్నా స్వీయ దర్శకత్వంలో తొలిసారిగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'నచ్చినవాడు'. ఈ చిత్రంలో కావ్య రమేశ్ అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. 'నా మనసు నిన్ను చేర' అనే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి మిజో జోసెఫ్ సంగీతమందించారు. ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
(ఇది చదవండి: ‘రుద్రమాంబపురం’పై మంత్రి తలసాని ప్రశంసలు)
లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ..' నచ్చినవాడు మూవీ మహిళల ఆత్మ గౌరవమే కథాంశంగా చేసుకుని తెరకెక్కించి ప్రేమ కథా చిత్రం. హాస్యానికి పెద్దపీట వేశాం. నేటి యూత్‌కు కావాల్సిన ప్రతి అంశాన్ని చూపించాం. త్వరలోనే చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. కర్ణాటక, పాండిచ్చేరిలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరించామని తెలిపారు. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు.
(ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్)
Comments
Please login to add a commentAdd a comment