హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కిడ్నాప్నకు గురైన చిన్నారి కావ్య మిస్టరీ వీడింది. పోలీసులు ఈ చిన్నారి ఆచూకీని కనుగొన్నారు. పోలీసులు కిడ్నాపర్ల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని గుర్తించి, కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని హైదరాబాద్ తీసుకువస్తున్నారు.
శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తొమ్మిది నెలల కావ్యను అపహరించిన సంగతి తెలిసిందే. చిన్నారి కిడ్నాప్ ఘటనపై హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 14 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలపల్లికి చెందిన గూడ రేణుక థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంది. చికిత్స కోసం తొమ్మిది నెలల కుమార్తె కావ్య, అత్త సిద్ధమ్మ, తండ్రి మల్లేష్‌తో కలిసి గాంధీ ఆస్పత్రికి వచ్చినపుడు.. చిన్నారిని అపరణకు గురైంది.
కిడ్నాపైన కావ్య ఆచూకీ లభ్యం
Published Sun, Aug 2 2015 3:42 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM
Advertisement
Advertisement