kidnaper arrest
-
బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
సింహాచలం: అడవివరంలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. హుకుంపేటకు చెందిన ఎన్.కాంతమ్మ తన కుమారుడు అభిరాం(2)తో కలిసి సోమవారం ఆర్టీసీ బస్సులో విశాఖపట్నం వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఆమెను ఇక్కడ కలిశాడు. ముగ్గురూ ఆటోలో సింహాచలం వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం కొండ దిగువకు వచ్చారు. అయితే పిల్లాడితో సహా శేఖర్ కనిపించకుండాపోయాడు. దీంతో కాంతమ్మ తనకు కుమారుడిని కిడ్నాప్ చేసేశారంటూ గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసును నమోదుచేసుకున్న పోలీసులు... కిడ్నాపర్ శేఖర్‌ను మొబైల్ కాల్ ట్రాకింగ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తిరిగి తల్లి కాంతమ్మకు అప్పగించారు. భర్తతో కాంతమ్మకు విబేధాలున్నాయని, ఈ నేపథ్యంలో ఆమెను నమ్మించి సింహాచలం తీసుకువచ్చిన శేఖర్.. ఆమె బాత్రూంలో ఉండగా బాలుడ్ని తీసుకొని వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. -
అరిస్తే చంపేస్తానని బెదిరించాడు..
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఫార్మాసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాపర్ రవిశేఖర్‌ను పోలీసులు అద్దంకిలో అరెస్ట్ చేసి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్‌కు సంబంధించి సోని స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కిడ్నాపర్ రవిశేఖర్ తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని సోని తెలిపిందన్నారు. ‘గత ఏడు రోజులుగా కారులోనే ఉంచిన కిడ్నాపర్.. నిన్న చిలకలూరిపేటలో సోనీని వదిలేశాడు. బస్ కండక్టర్ సాయంతో అద్దంకి వచ్చి అక్కడి నుంచి ఈ రోజు హైదరాబాద్ చేరుకుంది. రెండు రోజుల పాటు కిడ్నాప్ అయిన విషయం తెలుసుకోలేకపోయిన సోనీ.. తన నాన్న, తమ్ముడు గురించి రవిశంకర్‌ను ప్రశ్నిస్తే నీ ఉద్యోగం పనిపై వెళ్లారని నమ్మబలికాడు. మొదటగా సోనీని కడపకి తీసుకెళ్లిన అనంతరం తిరుపతి, అద్దంకి, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో తిప్పాడు. ఉద్యోగం పేరుతో సోనీని మభ్యపెట్టాలని చూసిన రవిశంకర్.. ఆమె మాట వినకపోవడంతో చంపేస్తానని బెదిరించాడు. రోజూ పెట్రోల్ బంక్, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలను ఎంచుకొని చంపేస్తానని బెదిరించి కారులో ఉంచాడు. రోజుకు ఒక్కసారే భోజనం పెట్టేవాడు. ఏదైనా కావాలంటే బయట ఉన్నవారినే కారు దగ్గరికి పిలిచేవాడు. అరిస్తే చంపేస్తానని బెదిరించాడని’ ఆమె స్టేట్మెంట్లో వెల్లడించిన విషయాన్ని పోలీస్ కమిషనర్ మీడియాకు తెలిపారు. వైద్య పరీక్షలు పూర్తి కిడ్నాప్ గురైన సోనీకి పేట్ల బుర్జ్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం హాస్పిటల్ నుంచి మీడియా కంట కనపడుకుండా ముసుగు వేసి ఆమెను అక్కడి నుంచి రాచకొండ పోలీసులు రహస్యంగా తీసుకెళ్లారు. -
కిడ్నాపైన కావ్య ఆచూకీ లభ్యం
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కిడ్నాప్‌నకు గురైన చిన్నారి కావ్య మిస్టరీ వీడింది. పోలీసులు ఈ చిన్నారి ఆచూకీని కనుగొన్నారు. పోలీసులు కిడ్నాపర్ల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని గుర్తించి, కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని హైదరాబాద్ తీసుకువస్తున్నారు. శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తొమ్మిది నెలల కావ్యను అపహరించిన సంగతి తెలిసిందే. చిన్నారి కిడ్నాప్ ఘటనపై హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 14 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలపల్లికి చెందిన గూడ రేణుక థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంది. చికిత్స కోసం తొమ్మిది నెలల కుమార్తె కావ్య, అత్త సిద్ధమ్మ, తండ్రి మల్లేష్‌తో కలిసి గాంధీ ఆస్పత్రికి వచ్చినపుడు.. చిన్నారిని అపరణకు గురైంది.