హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో తొమ్మిది నెలల చిన్నారి కావ్య శుక్రవారం రాత్రి అదృశ్యమైంది. దాంతో సదరు చిన్నారి తల్లిదండ్రులు చిలకలగూడ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా గాంధీ ఆసుపత్రితోపాటు పరిసర ప్రాంతాలలోని సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం... కావ్య తల్లి రేణుక గత కొంత కాలంగా థైరాయిడ్ వ్యాధితో బాధపడుతోంది. దాంతో వైద్య పరీక్షల కోసం రేణుక భర్త, ఆమెను, కుమార్తెను గాంధీ ఆసుపత్రికి తీసుకు వచ్చాడు. ఆ క్రమంలో ఆసుపత్రిలో చిన్నారి కావ్యను ఆగంతంకులు అపహరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.