అత్త మృతిని జీర్ణించుకోలేక కోడలు మృతి | - | Sakshi
Sakshi News home page

అత్త మృతిని జీర్ణించుకోలేక కోడలు మృతి

Published Mon, Mar 18 2024 1:55 AM | Last Updated on Mon, Mar 18 2024 11:05 AM

- - Sakshi

ఒకే రోజు ఇద్దరు హఠాన్మరణం

యాదాద్రి జిల్లాలో విషాదం

యాదగిరిగుట్ట రూరల్‌ : అత్త మృతిని జీర్ణించుకోలేక కోడలు కూడా గుండెపోటుతో కుప్పకూలి తనువు చాలించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లి ఆవాసమైన గొల్లగుడిసె గ్రామానికి చెందిన చుక్కల భారతమ్మ (65) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు శనివారం భువనగిరి మండలం రాయగిరిలోని పుట్టింటికి వెళ్లింది. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా ఆమె గుండెపోటుతో మరణించింది.

ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామమైన గొల్లగుడిసెకు తీసుకువచ్చారు. అత్త మృతదేహాన్ని చూసిన కోడలు చుక్కల మంగమ్మ (26) కన్నీరు మున్నీరైంది. పెద్ద పెట్టున రోదిస్తూనే మంగమ్మ కుప్పకూలి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆమెను భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగమ్మ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని బంధువులు తెలిపారు. అత్తా కోడళ్లు ఒకే రోజు మృతిచెందడంతో గొల్లగుడిసె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగమ్మకు ఇద్దరు పిల్లలు ఉండగా, భర్త మేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement