
సాక్షి, తూర్పుగోదావరి : ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మపై కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న ఉప్పాడ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ నిబంధనలకు విరుద్ధంగా కారుతో ప్రవేశించారు. స్కూల్ గేట్లు వేసి అరగంటకు పైగా పోలింగ్ కేంద్రంలో గడిపారు. ఓటర్లతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశారు. వర్మ తీరుతో రెచ్చిపోయిన గ్రామస్థులు ఆందోళన దిగారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వర్మపై వైఎస్సార్ సీపీ ఎన్నికల ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వర్మతో పాటు మరో 30మందిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.