
సాక్షి, తూర్పు గోదావరి : పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మకు చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు సెజ్ రైతుల నుంచి నిరసన ఎదురయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్మ గురువారం రమణక్కపేటలో పర్యటిస్తుండగా సెజ్ రైతులు ఎమ్మెల్యే ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. గత ఎన్నికలకు ముందు సెబ్ భూముల్లో ఏరువాక చేసి వాటిని తిరిగి రైతులకు ఇచ్చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటివరకూ ఆ హామీని నేరవేర్చలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ భూములు తిరిగి ఇవ్వాలని.. లేదా నూతన భూసేకరణ చట్టం కింద తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను ఈడ్చిపడేశారు. అయితే రైతుల పట్ల నిర్దయగా వ్యవహరించిన ఎమ్మెల్యే వర్మ పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది.