రూపు మారుతున్న ఉత్తరాంధ్ర | Inorbit Mall will change the face of Vizag says CM Ys Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

రూపు మారుతున్న ఉత్తరాంధ్ర

Published Wed, Aug 2 2023 3:51 AM | Last Updated on Wed, Aug 2 2023 3:18 PM

Inorbit Mall will change the face of Vizag says CM Ys Jagan Mohan Reddy - Sakshi

విశాఖలోని కైలాసపురంలో ఇనార్బిట్‌ మాల్‌కు భూమిపూజ చేస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో రహేజా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా తదితరులు

రాష్ట్రంలోని నాయకత్వం వాణిజ్య, వ్యాపార, పారిశ్రామికాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలందిస్తోంది. ఇనార్బిట్‌ మాల్‌తో మరింత అభివృద్ధికి బాటలు పడాలని ఆకాంక్షిస్తున్నా. ఇక్కడ త్వరలో నిర్మించబోయే ఐటీ స్పేస్‌ ద్వారా ఐటీ రంగం అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. హిందూపురంలో 350 ఎకరాల్లో టెక్స్‌టైల్స్, ఎల్రక్టానిక్‌ హార్డ్‌వేర్‌పార్కు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా 15 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.
 – నీల్‌ రహేజా, రహేజా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ 
  
సీఎం జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి ఎంతో అనువైన వాతావరణం ఉంది. అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం శుభ పరిణామం. ఇనార్బిట్‌ మాల్‌ ప్రజల షాపింగ్‌ అవసరాలు తీర్చడమే కాకుండా ఆహ్లాదకరమైన, వినోదాత్మక ప్రదేశంగా అందరినీ ఆకట్టుకుని అలరిస్తుంది. – రజనీష్‌ మహాజన్, ఇనార్బిట్‌ మాల్‌ సీఈవో 


ఇనార్బిట్‌ మాల్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ అభివృద్ధికి మరింత దోహదపడేలా నగరానికి ఆణిముత్యంలా ఇనార్బిట్‌ మాల్‌ నిలిచిపోతుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. విశాఖలో మరో ప్రాజెక్టుకు శ్రీ కారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంగళవారం విశాఖ పర్యటన సందర్భంగా కైలా సపురం ప్రాంతంలో రూ.600 కోట్ల పెట్టుబడు లతో రహేజా గ్రూప్‌ చేపట్టిన ఇనార్బిట్‌ మాల్‌ ని ర్మాణ పనులకు సీఎం జగన్‌ భూమి పూజ చేశారు. రూ.134.58 కోట్లతో జీవీఎంసీ తలపెట్టిన అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఏయూలో రూ.130 కోట్లతో నిర్మించిన 5 భవనాలను సీఎం ప్రారంభించారు.

దక్షిణాదిలో అతి పెద్దదైన ఇనార్బిట్‌ మాల్‌తో పాటు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ స్పేస్, కన్వెన్షన్‌ సెంటర్‌ను కూడా తర్వాత దశలో రహేజా సంస్థ నిర్మించనుందని సీఎం జగన్‌ చెప్పారు. లగ్జరీ హో టళ్ల నిర్మాణా­నికి కూడా రహేజా ఆసక్తి చూపుతోందన్నారు. కేటాయించిన మొత్తం స్థలం విస్తీర్ణం 17 ఎకరాలు కాగా 12–13 ఎకరాల్లో మాల్‌ ఏర్పాటు కావడం చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే జరు గుతుందన్నారు. ఇదే రహేజా గ్రూప్‌ హైదరాబాద్‌ లో ఇనా­ర్బిట్‌ మాల్‌ను 7–8 ఎకరాల్లో నిర్మించగా విశాఖలో 12–13 ఎకరాల్లో నిర్మాణానికి శంకుస్థా­పన చేస్తున్నామని గుర్తు చేశారు.

గత పర్యటన సందర్భంగా విశాఖలో అదానీ డేటా సెంటర్, ఐటీ స్పేస్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశామన్నారు. అలాగే అంతకుముందు శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేసుకున్నామని గుర్తు చేశారు. ఇవన్నీ రానున్న రోజుల్లో విశాఖ, ఉత్తరాంధ్ర రూపు­రే­ఖలు మార్చుతా­యన్నారు. మాల్‌ కూడా అదే కోవలోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే...


ఏయూలో అల్గారిథమ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

దక్షిణాదిలో అతిపెద్దది..
ఇంత భారీ మాల్‌ ఏర్పాటుతో విశాఖ రూపురేఖలు మారడమే కాకుండా దక్షిణాదిలో అతి పెద్దదిగా నిలవనుంది. 8 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. 12–13 ఎకరాల్లో మాల్‌ నిర్మాణం పూర్తయ్యాక రెండో దశ కింద మిగిలిన 4 ఎకరాల్లో 2.5 లక్షల చదరపు అడుగుల్లో ఐటీ స్పేస్‌ కూడా అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందించారు. ఐటీ స్పేస్‌ ద్వారా మరో 3 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. 

సాగర తీరంలో 7 స్టార్‌ హోటళ్లు..
రహేజా›గ్రూప్‌ దేశంలో పలు చోట్ల ఫైవ్‌స్టార్‌ హోటళ్లను నిర్మించింది. ఏపీలో కూడా రాజ్‌ విలాస్‌ తరహాలో సూపర్‌ లగ్జరీ ఫైవ్‌ స్టార్, సెవెన్‌ స్టార్‌ హోటళ్లు నిర్మాణం కానున్నాయి. ఇప్పటికే ఒబె రాయ్‌ సంస్థ రాజ్‌ విలాస్‌ తరహాలో 7 స్టార్‌ కేట గిరీలో రిసార్ట్, మే ఫెయిర్‌ సంస్థ సూపర్‌ లగ్జరీ 7 స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చా యి. అదే తరహాలో నీల్‌ రహేజా కూడా 7 స్టార్‌ హోటల్‌ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇవన్నీ విశా ఖ రూపురేఖలను మార్చే గొప్ప ప్రాజెక్టులు. హిందూపూర్‌లో 350 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌ టైల్స్‌ కు సంబంధించిన పార్క్‌ రా నుంది. దీని ద్వారా 15 వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభి స్తాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు నీల్‌ రహేజా చెప్పారు. దీనికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. 

ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో..
రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న వారికి ప్రతి అడు గులోనూ తోడుగా ఉంటాం. కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో వారికి అందుబాటులో ఉంటాం. ఈ విష యాన్ని మనసులో పెట్టుకోవాలని కోరుతున్నా. మి గిలిన రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీలో పారి శ్రామికవేత్తలకు ఎలా సహాయ, సహకారాలను అందిస్తామో మీరే చూస్తారు. దేవుడి దయ వల్ల వారు బాగుపడటంతోపాటు విశాఖలో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నా. దీన్ని సాకా రం చేసిన నీల్‌ రహేజా, సీఈవో రజనీష్‌ మహాజన్, సీవోవో శ్రావణ్‌కుమార్‌కు  ధన్యవాదాలు తెలియచేస్తున్నా.


జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్‌  

రూ. 134.58 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన
జీవీఎంసీ పరిధిలో రూ.134.58 కోట్లతో చేపట్ట­నున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అమృత్‌ పథకంలో భాగంగా రూ.107.42 కోట్లతో 32 పనులను చేపడుతున్నారు. స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా రూ.16.10 కోట్లతో 7 పనులు చేపడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 11.06 కోట్లతో 8 పనులను తలపె­ట్టారు. మొత్తం 47 అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

ఏయూలో ఐదు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం
ఇనార్బిట్‌ మాల్, జీవీఎంసీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం రోడ్డు మార్గంలో నేరుగా ఏయూ వద్దకు చేరుకున్నారు. గత మూడే ళ్లుగా ఏయూలో 18 ప్రాజెక్టులను చేపట్టగా వీటిలో ఐదు ప్రాజెక్ట్‌లు సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. టెక్‌ స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ (ఆ హబ్‌), ఫార్మా ఇంక్యుబేషన్‌ ఎలిమెంట్, ఏయూ డిజిటల్‌ జోన్‌ అండ్‌ స్మార్ట్‌  క్లాస్‌ రూమ్‌ కాంప్లెక్స్‌ (అల్గారిథమ్‌), ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (ఏయూ సిబ్‌), ఏయూ అవంతి ఆక్వా కల్చర్‌ ఇన్నోవేషన్‌ స్కిల్‌ హబ్స్‌ వీటిలో ఉన్నాయి. యువత నైపుణ్యాలను ఇతోధికంగా పెంచేలా ఇది దోహదం చేయనున్నాయి. వీటి పని తీరును ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి సీఎంకు వివరించారు. ఎలిమెంట్‌ భవనంలో నెలకొల్పిన ఫార్మసీ లేబరేటరీని పరిశీలించిన సీఎం జగన్‌ వివిధ పరికరాల పనితీరును తెలుసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బా రెడ్డి, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స, రజని,అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారా యణ, మేయర్‌ వెంకటకుమారి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు, కలెక్టర్‌ మల్లికార్జున, జీవిఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, సీపీ త్రివిక్రమ్‌ వర్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. 

దారి పొడవునా పూల వర్షం

సాక్షి, విశాఖపట్నం: అందరి అభిమాన నేతపై కుంభవృష్టిని తలపించేలా పూల వర్షం కురిసింది! సంక్షేమ సారథిపై అనురాగం వెల్లువెత్తింది. మంగళవారం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా మహిళలు నీరాజ­నం పలికారు. ఉదయం 11.13 గంటలకు ఎయి­ర్‌­పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌ కొద్దిసేపటి తర్వాత బయలుదేరారు. విమానాశ్రయం నుంచి పోర్టు ఆస్పత్రి జంక్షన్‌ వరకు జాతీయ రహదారి పక్కన సీఎం సార్‌కు స్వాగతం అంటూ ప్లకార్డులతో కిలోమీటర్ల మేర పెద్ద సంఖ్యలో మహిళలు స్వాగతం పలికారు. 7 కి.మీ. మేర భారీ మానవహారంగా ఏర్పడి జై జగన్‌ అంటూ నినదించారు. ఈ స్థాయి­లోఘన స్వాగతం పలకడం ఇదే మొదటిసారి అని పేర్కొంటు­న్నారు. హైవేపై వాహనంలో వస్తున్న సీఎం జగన్‌పై దారి పొడవునా పూల వర్షాన్ని కురిపించారు.

ముఖ్య కూడళ్లలో తన వాహనాన్ని కొద్ది­సేపు నిలిపిన ముఖ్యమంత్రి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్‌ మాల్‌కు శంకుస్థాపన చేసే పోర్టు ఆస్పత్రి జంక్షన్‌కు చేరుకునేందుకు 45 నిమి­షాలకు పైగా సమయం పట్టింది. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పార్టీ నాయకులు విమానాశ్రయం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం వరకు సీఎం కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పలుచోట్ల వైఎస్సార్‌సీపీ జెండాలు రెపరె­ప­లాడాయి. ముఖ్యమంత్రి జగన్‌ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జాతీయ రహదారిపైకి రావడంతో కిక్కిరిసిపోయింది. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విశాఖ పర్యటనను ముగించుకుని సీఎం జగన్‌ మధ్యాహ్నం 2.28 గంటలకు విమానంలో గన్నవరం పయనమయ్యారు. 

ఏపీలో ఎంతో అనువైన వాతావరణం
ముంబైలో 2004 జనవరిలో అద్దె ప్రాతిపదికన ఆరంభమైన ఇనార్బిట్‌ మాల్‌ సరికొత్త బెంచ్‌ మార్కును సృష్టించింది. రెండు దశాబ్దాలుగా ఉన్న మాల్స్‌ రంగంలో కొనసా గుతూ తాజాగా మరో మూడు మాల్స్‌ను ప్రారంభించాం. 100కిపైగా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీ య బ్రాండ్లు భారతీయ మార్కెట్‌లో రిటైల్‌ ప్రయా ణాన్ని ప్రారంభించేందుకు ఒక వేదికను సృష్టించాం. విశాఖలో కొత్త చాప్టర్‌ను ప్రారంభించాం. దార్శనిక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి ఎంతో అనువైన వాతావరణం ఉంది. అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం శుభ పరిణామం.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ వరుసగా అగ్ర స్థానంలో నిలవడానికి ఇవే కారణం. ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రితో ముంబైలో పలు విషయాలపై చర్చించాం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతం. ఇనార్బిట్‌ మాల్‌ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించడంతోపా టు స్థానికంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన విశాఖ పో ర్టు అథారిటీకి కృతజ్ఞతలు. రూ.600 కోట్లతో 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న ఈ మాల్‌ ద్వారా 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది ప్రజల షాపింగ్‌ అవసరాలు తీర్చడమే కాకుండా ఆహ్లాద కరమై న, వినోదాత్మక ప్రదేశంగా అందరినీ ఆకట్టుకుని అలరిస్తుంది.    – రజనీష్‌ మహాజన్, ఇనార్బిట్‌ మాల్‌ సీఈవో


సీఎం జగన్‌తో మాట్లాడుతున్న నీల్‌ రహేజా

మాల్‌ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దుతాం
విశాఖలో మా ఉత్సాహవంతమైన ప్రయా­ణం ప్రారంభమైంది. ఇనార్బిట్‌ మాల్‌ భూమి పూజ కార్యక్రమం మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఏపీలో దివంగత సీఎం వైఎస్సార్‌ సమక్షంలో జరిగిన శంకుస్థాపనలో పాల్గొన్నా. ఇనార్బిట్‌ మాల్స్‌ ఏర్పాటు ద్వారా వ్యాపార ఒరవడిని మార్చాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 221 డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ లు­న్నాయి.  విశాఖలో మా డిపార్టుమెంటల్‌ స్టోర్లున్నాయి(షాపర్స్‌స్టాప్‌). విజయ­వాడ, గుంటూరు, రాజమండ్రిలోనూ ఉన్నాయి. త్వరలోనే కాకినాడ, నెల్లూరు, తిరుపతిలో ప్రారంభించను­న్నాం. ఇటీవల విశాఖను సందర్శించిన సందర్భంగా నగర అభివృద్ధి, మౌలిక సదు పాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆకట్టు కున్నాయి. ఇక్కడ త్వరలో నిర్మించబోయే ఐటీ స్పేస్‌ ద్వారా ఐటీ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం.

మాకు ప్రపంచవ్యాప్తంగా రాజ్‌­విల్లాల తరహాలో లగ్జరీ హోటళ్లున్నాయి. అదే కాన్సెప్ట్‌ను విశా­ఖతో పాటు ఏపీలో తేవాలనుకుంటున్నాం. హిందూ పూర్‌లో 350 ఎకరాల్లో టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌ వేర్‌ పార్కు అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా 15 వేల ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలోని నాయకత్వంతో సంతోషంగా ఉన్నాం.  వాణిజ్య, వ్యాపార, పా రిశ్రామికాభివృద్ధికి పూర్తి సహాయసహకారాలను అందిస్తున్నా రు. విశాఖలో ఇనార్బిట్‌ మాల్‌ను ప్రపంచ స్థాయి మాల్‌గా అభివృద్ధి చేస్తున్నాం. మాల్‌ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దుతాం.  – నీల్‌ రహేజా, రహేజా గ్రూప్‌ ప్రెసిడెంట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement