Inorbit mall
-
ఇనార్బిట్ మాల్లో పాన్ ఏషియా ఫో రెస్టారెంట్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
రూ.600 కోట్లతో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్
-
13 ఎకరాల్లో మాల్‌ను నిర్మించాక.. రెండవ దశలో 3000 మంది పనిచేసేలా ఐటీ క్యాంపస్
-
విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్
-
ఇనార్బిట్ మాల్ విశాఖకు ఆణిముత్యం అవుతుందన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రూపు మారుతున్న ఉత్తరాంధ్ర
రాష్ట్రంలోని నాయకత్వం వాణిజ్య, వ్యాపార, పారిశ్రామికాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలందిస్తోంది. ఇనార్బిట్ మాల్తో మరింత అభివృద్ధికి బాటలు పడాలని ఆకాంక్షిస్తున్నా. ఇక్కడ త్వరలో నిర్మించబోయే ఐటీ స్పేస్ ద్వారా ఐటీ రంగం అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. హిందూపురంలో 350 ఎకరాల్లో టెక్స్టైల్స్, ఎల్రక్టానిక్ హార్డ్‌వేర్‌పార్కు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా 15 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. – నీల్ రహేజా, రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి ఎంతో అనువైన వాతావరణం ఉంది. అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం శుభ పరిణామం. ఇనార్బిట్ మాల్ ప్రజల షాపింగ్ అవసరాలు తీర్చడమే కాకుండా ఆహ్లాదకరమైన, వినోదాత్మక ప్రదేశంగా అందరినీ ఆకట్టుకుని అలరిస్తుంది. – రజనీష్ మహాజన్, ఇనార్బిట్ మాల్ సీఈవో ఇనార్బిట్ మాల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ అభివృద్ధికి మరింత దోహదపడేలా నగరానికి ఆణిముత్యంలా ఇనార్బిట్ మాల్ నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. విశాఖలో మరో ప్రాజెక్టుకు శ్రీ కారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంగళవారం విశాఖ పర్యటన సందర్భంగా కైలా సపురం ప్రాంతంలో రూ.600 కోట్ల పెట్టుబడు లతో రహేజా గ్రూప్ చేపట్టిన ఇనార్బిట్ మాల్ ని ర్మాణ పనులకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. రూ.134.58 కోట్లతో జీవీఎంసీ తలపెట్టిన అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఏయూలో రూ.130 కోట్లతో నిర్మించిన 5 భవనాలను సీఎం ప్రారంభించారు. దక్షిణాదిలో అతి పెద్దదైన ఇనార్బిట్ మాల్తో పాటు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ స్పేస్, కన్వెన్షన్ సెంటర్‌ను కూడా తర్వాత దశలో రహేజా సంస్థ నిర్మించనుందని సీఎం జగన్ చెప్పారు. లగ్జరీ హో టళ్ల నిర్మాణానికి కూడా రహేజా ఆసక్తి చూపుతోందన్నారు. కేటాయించిన మొత్తం స్థలం విస్తీర్ణం 17 ఎకరాలు కాగా 12–13 ఎకరాల్లో మాల్ ఏర్పాటు కావడం చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే జరు గుతుందన్నారు. ఇదే రహేజా గ్రూప్ హైదరాబాద్ లో ఇనార్బిట్ మాల్‌ను 7–8 ఎకరాల్లో నిర్మించగా విశాఖలో 12–13 ఎకరాల్లో నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని గుర్తు చేశారు. గత పర్యటన సందర్భంగా విశాఖలో అదానీ డేటా సెంటర్, ఐటీ స్పేస్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశామన్నారు. అలాగే అంతకుముందు శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేసుకున్నామని గుర్తు చేశారు. ఇవన్నీ రానున్న రోజుల్లో విశాఖ, ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చుతాయన్నారు. మాల్ కూడా అదే కోవలోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... ఏయూలో అల్గారిథమ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దక్షిణాదిలో అతిపెద్దది.. ఇంత భారీ మాల్ ఏర్పాటుతో విశాఖ రూపురేఖలు మారడమే కాకుండా దక్షిణాదిలో అతి పెద్దదిగా నిలవనుంది. 8 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. 12–13 ఎకరాల్లో మాల్ నిర్మాణం పూర్తయ్యాక రెండో దశ కింద మిగిలిన 4 ఎకరాల్లో 2.5 లక్షల చదరపు అడుగుల్లో ఐటీ స్పేస్ కూడా అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందించారు. ఐటీ స్పేస్ ద్వారా మరో 3 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. సాగర తీరంలో 7 స్టార్ హోటళ్లు.. రహేజా›గ్రూప్ దేశంలో పలు చోట్ల ఫైవ్‌స్టార్ హోటళ్లను నిర్మించింది. ఏపీలో కూడా రాజ్ విలాస్ తరహాలో సూపర్ లగ్జరీ ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు నిర్మాణం కానున్నాయి. ఇప్పటికే ఒబె రాయ్ సంస్థ రాజ్ విలాస్ తరహాలో 7 స్టార్ కేట గిరీలో రిసార్ట్, మే ఫెయిర్ సంస్థ సూపర్ లగ్జరీ 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చా యి. అదే తరహాలో నీల్ రహేజా కూడా 7 స్టార్ హోటల్‌ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇవన్నీ విశా ఖ రూపురేఖలను మార్చే గొప్ప ప్రాజెక్టులు. హిందూపూర్‌లో 350 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్ కు సంబంధించిన పార్క్ రా నుంది. దీని ద్వారా 15 వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభి స్తాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు నీల్ రహేజా చెప్పారు. దీనికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న వారికి ప్రతి అడు గులోనూ తోడుగా ఉంటాం. కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో వారికి అందుబాటులో ఉంటాం. ఈ విష యాన్ని మనసులో పెట్టుకోవాలని కోరుతున్నా. మి గిలిన రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీలో పారి శ్రామికవేత్తలకు ఎలా సహాయ, సహకారాలను అందిస్తామో మీరే చూస్తారు. దేవుడి దయ వల్ల వారు బాగుపడటంతోపాటు విశాఖలో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నా. దీన్ని సాకా రం చేసిన నీల్ రహేజా, సీఈవో రజనీష్ మహాజన్, సీవోవో శ్రావణ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్ రూ. 134.58 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన జీవీఎంసీ పరిధిలో రూ.134.58 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అమృత్ పథకంలో భాగంగా రూ.107.42 కోట్లతో 32 పనులను చేపడుతున్నారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా రూ.16.10 కోట్లతో 7 పనులు చేపడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 11.06 కోట్లతో 8 పనులను తలపెట్టారు. మొత్తం 47 అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఏయూలో ఐదు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం ఇనార్బిట్ మాల్, జీవీఎంసీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం రోడ్డు మార్గంలో నేరుగా ఏయూ వద్దకు చేరుకున్నారు. గత మూడే ళ్లుగా ఏయూలో 18 ప్రాజెక్టులను చేపట్టగా వీటిలో ఐదు ప్రాజెక్ట్‌లు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఆ హబ్), ఫార్మా ఇంక్యుబేషన్ ఎలిమెంట్, ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ (అల్గారిథమ్), ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూ సిబ్), ఏయూ అవంతి ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ స్కిల్ హబ్స్ వీటిలో ఉన్నాయి. యువత నైపుణ్యాలను ఇతోధికంగా పెంచేలా ఇది దోహదం చేయనున్నాయి. వీటి పని తీరును ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి సీఎంకు వివరించారు. ఎలిమెంట్ భవనంలో నెలకొల్పిన ఫార్మసీ లేబరేటరీని పరిశీలించిన సీఎం జగన్ వివిధ పరికరాల పనితీరును తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స, రజని,అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారా యణ, మేయర్ వెంకటకుమారి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, కలెక్టర్ మల్లికార్జున, జీవిఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, సీపీ త్రివిక్రమ్ వర్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. దారి పొడవునా పూల వర్షం సాక్షి, విశాఖపట్నం: అందరి అభిమాన నేతపై కుంభవృష్టిని తలపించేలా పూల వర్షం కురిసింది! సంక్షేమ సారథిపై అనురాగం వెల్లువెత్తింది. మంగళవారం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా మహిళలు నీరాజనం పలికారు. ఉదయం 11.13 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ కొద్దిసేపటి తర్వాత బయలుదేరారు. విమానాశ్రయం నుంచి పోర్టు ఆస్పత్రి జంక్షన్ వరకు జాతీయ రహదారి పక్కన సీఎం సార్‌కు స్వాగతం అంటూ ప్లకార్డులతో కిలోమీటర్ల మేర పెద్ద సంఖ్యలో మహిళలు స్వాగతం పలికారు. 7 కి.మీ. మేర భారీ మానవహారంగా ఏర్పడి జై జగన్ అంటూ నినదించారు. ఈ స్థాయిలోఘన స్వాగతం పలకడం ఇదే మొదటిసారి అని పేర్కొంటున్నారు. హైవేపై వాహనంలో వస్తున్న సీఎం జగన్‌పై దారి పొడవునా పూల వర్షాన్ని కురిపించారు. ముఖ్య కూడళ్లలో తన వాహనాన్ని కొద్దిసేపు నిలిపిన ముఖ్యమంత్రి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేసే పోర్టు ఆస్పత్రి జంక్షన్‌కు చేరుకునేందుకు 45 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పార్టీ నాయకులు విమానాశ్రయం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం వరకు సీఎం కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పలుచోట్ల వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడాయి. ముఖ్యమంత్రి జగన్‌ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జాతీయ రహదారిపైకి రావడంతో కిక్కిరిసిపోయింది. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విశాఖ పర్యటనను ముగించుకుని సీఎం జగన్ మధ్యాహ్నం 2.28 గంటలకు విమానంలో గన్నవరం పయనమయ్యారు. ఏపీలో ఎంతో అనువైన వాతావరణం ముంబైలో 2004 జనవరిలో అద్దె ప్రాతిపదికన ఆరంభమైన ఇనార్బిట్ మాల్ సరికొత్త బెంచ్ మార్కును సృష్టించింది. రెండు దశాబ్దాలుగా ఉన్న మాల్స్ రంగంలో కొనసా గుతూ తాజాగా మరో మూడు మాల్స్‌ను ప్రారంభించాం. 100కిపైగా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీ య బ్రాండ్లు భారతీయ మార్కెట్లో రిటైల్ ప్రయా ణాన్ని ప్రారంభించేందుకు ఒక వేదికను సృష్టించాం. విశాఖలో కొత్త చాప్టర్‌ను ప్రారంభించాం. దార్శనిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి ఎంతో అనువైన వాతావరణం ఉంది. అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం శుభ పరిణామం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ వరుసగా అగ్ర స్థానంలో నిలవడానికి ఇవే కారణం. ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రితో ముంబైలో పలు విషయాలపై చర్చించాం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతం. ఇనార్బిట్ మాల్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించడంతోపా టు స్థానికంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన విశాఖ పో ర్టు అథారిటీకి కృతజ్ఞతలు. రూ.600 కోట్లతో 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న ఈ మాల్ ద్వారా 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది ప్రజల షాపింగ్ అవసరాలు తీర్చడమే కాకుండా ఆహ్లాద కరమై న, వినోదాత్మక ప్రదేశంగా అందరినీ ఆకట్టుకుని అలరిస్తుంది. – రజనీష్ మహాజన్, ఇనార్బిట్ మాల్ సీఈవో సీఎం జగన్‌తో మాట్లాడుతున్న నీల్ రహేజా మాల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతాం విశాఖలో మా ఉత్సాహవంతమైన ప్రయాణం ప్రారంభమైంది. ఇనార్బిట్ మాల్ భూమి పూజ కార్యక్రమం మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఏపీలో దివంగత సీఎం వైఎస్సార్ సమక్షంలో జరిగిన శంకుస్థాపనలో పాల్గొన్నా. ఇనార్బిట్ మాల్స్ ఏర్పాటు ద్వారా వ్యాపార ఒరవడిని మార్చాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 221 డిపార్ట్మెంట్ స్టోర్ లున్నాయి. విశాఖలో మా డిపార్టుమెంటల్ స్టోర్లున్నాయి(షాపర్స్‌స్టాప్). విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలోనూ ఉన్నాయి. త్వరలోనే కాకినాడ, నెల్లూరు, తిరుపతిలో ప్రారంభించనున్నాం. ఇటీవల విశాఖను సందర్శించిన సందర్భంగా నగర అభివృద్ధి, మౌలిక సదు పాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆకట్టు కున్నాయి. ఇక్కడ త్వరలో నిర్మించబోయే ఐటీ స్పేస్ ద్వారా ఐటీ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. మాకు ప్రపంచవ్యాప్తంగా రాజ్విల్లాల తరహాలో లగ్జరీ హోటళ్లున్నాయి. అదే కాన్సెప్ట్‌ను విశాఖతో పాటు ఏపీలో తేవాలనుకుంటున్నాం. హిందూ పూర్లో 350 ఎకరాల్లో టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్కు అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా 15 వేల ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలోని నాయకత్వంతో సంతోషంగా ఉన్నాం. వాణిజ్య, వ్యాపార, పా రిశ్రామికాభివృద్ధికి పూర్తి సహాయసహకారాలను అందిస్తున్నా రు. విశాఖలో ఇనార్బిట్ మాల్‌ను ప్రపంచ స్థాయి మాల్గా అభివృద్ధి చేస్తున్నాం. మాల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతాం. – నీల్ రహేజా, రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ -
అనారోగ్య బాధితులకు సీఎం జగన్ భరోసా.. తక్షణ ఆర్థిక సాయం
సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తమకు కష్టం వచ్చిందని సీఎం జగన్‌ను కలిసిన బాధితులకు తానున్నానంటూ భరోసా కల్పించారు. మంగళవారం విశాఖ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఇనార్బిట్‌మాల్‌కు చేరుకున్న క్రమంలో అక్కడ ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్న గవిడి ఢిల్లీశ్వరరావు(19) తన తల్లి సంతోషితో కలిసి వేచి ఉన్నాడు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి రావడంతో అతన్ని పరామర్శించారు. తన కుమారుడు పుట్టుకతో ఆర్దోపెడిక్ సమస్య తో బాధపడుతున్నాడని సీఎం జగన్‌కు బాధితుని తల్లి సంతోషి తెలిపారు. వారి సమస్యను విన్న సీఎం జగన్ గవిడి ఢిల్లీశ్వరరావుకి వైద్య సేవలు నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జనను ఆదేశించగా తక్షణమే వైద్య సేవలు నిమిత్తం లక్ష రూపాయల చెక్కును అందజేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మరో బాధితుడు మోహన్(17)ను కూడా ఇన్ఆర్బిట్ మాల్ వద్దే సీఎం జగన్ పరామర్శించారు. ఆ యువకుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెందుర్తి మండలం వేపగుంటకు చేందిన వీరవల్లి మోహన్ తాను 4వ అంతస్తూ నుండి పడిపోయానని, వెన్నపూస దెబ్బ తిన్నదని ఆరోగ్య శ్రీ లో వైద్యం పొందినట్లు తెలిపారు. ఇంకా కోలుకోలేదని, వైద్య సేవల నిమిత్తం సహాయం కోరగా ముఖ్యమంత్రి స్పందిచి ఫిజియో థెరపీ వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున వీరవల్లి మోహన్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును అందజేశారు. చదవండి: ఇది ఆణిముత్యంలాంటి ప్రాజెక్టు: సీఎం జగన్ -
ఇది ఆణిముత్యంలాంటి ప్రాజెక్టు: సీఎం జగన్
సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(మంగళవారం)విశాఖ పర్యటన సందర్భంగా అక్కడ రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహేజా గ్రూప్స్ ఇనార్బిట్ మాల్‌కు భూమి పూజ చేశారు. విశాఖపట్నం కైలాసపురంలో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు సీఎం జగన్. ఈ సందర్బంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆణిముత్యంలాంటి ప్రాజెక్టు... దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇక్కడ ప్రారంభమవుతుంది. విశాఖ అభివృద్ధికి మరింత దోహదం చేస్తూ... విశాఖపట్టణంలో ఆణిముత్యంగా నిల్చిపోయే మంచి ప్రాజెక్టుకు శంకుస్ధాపనతో శ్రీకారం చుట్టాం. 17 ఎకరాల స్ధలానికిగాను... 12–13 ఎకరాల పెద్ద విస్తీర్ణంలో మాల్ రావడం అన్నది కొన్ని చోట్లే ఉంటుంది. ఇదే రహేజా గ్రూపు హైదరాబాద్‌లో ఇనార్బిట్ మాల్‌ను 7–8 ఎకరాల్లోనే కడితే మనం 12–13 ఎకరాల విస్తీర్ణంతో పెద్ద మాల్‌కు ఇక్కడ శంకుస్ధాపన చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని సాధ్యమయ్యేలా చేసిన నీల్ రహేజాకు, సీఈఓ రజనీష్ మహాజన్‌కు, సీఓఓ శ్రావణ్ కుమార్‌తో పాటు మిగిలిన అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున, నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. మారనున్న విశాఖ రూపురేఖలు.... ఈ రోజు ఇక్కడ కడుతున్న మాల్ నిర్మాణం ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారడమే కాకుండా... దక్షిణ భారతదేశంలోనే పెద్ద మాల్ కానుంది. రూ.600 కోట్ల పెట్టుబడితో ఇంత పెద్ద విస్తీర్ణంలో మాల్ నిర్మాణం వల్ల... 8వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఫేజ్ –2లో ఐటీ స్పేస్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. 12 నుంచి 13 ఎకరాల్లో మాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత.... మిగిలిన భూమిలో రాబోయే రోజుల్లో రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ రెండున్నర లక్షల ఎస్‌ఎప్‌టీతో ఐటీ స్పేస్ కూడా రాబోతుంది. అంతర్జాతీయ స్ధాయిలో ఒక కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు. వీటన్నింటి ద్వారా ఇంకా ఉద్యోగఅవకాశాలు మెరుగవుతాయి. 2.50 లక్షల ఎస్‌ఎఫ్‌టితో ఐటీ స్పేస్ రావడం వల్ల మరో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నాయి. ఇవన్నీ రాబోయో రోజుల్లో విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్ధాయిలో నిలబెట్టే కార్యక్రమాలు. ఇంతకముందు వచ్చినప్పుడు ఆదానీ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డేటాపార్కు, ఐటీ స్పేస్‌కు శంకుస్ధాపన చేసుకున్నాం. అదే రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు కూడా శంకుస్ధాపన చేశాం. అంతకన్నా ముందు శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే విధంగా మూలపేటలో పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేసుకున్నాం. ఇవన్నీ ఉత్తరాంధ్రా అభివృద్ధి రూపురేఖలను మార్చే గొప్ప అడుగులు. ఇనార్బిట్ మాల్ కూడా అలాంటిదే. ఇవన్నీ విశాఖలో గొప్ప ప్రాజెక్టులుగా నిలుస్తాయి ఇవి కాకుండా రహేజా గ్రూపు దేశంలో పలుచోట్ల ఫైవ్ స్టార్ హోటళ్లు కట్టారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో రాజ్‌విలాస్ తరహాలో సూపర్ లగ్జరీ ఫైవ్‌స్టార్ ప్లస్, సెవెన్ స్టార్ హోటల్ కట్టబోతున్నారు. ఇప్పటికే ఒబెరాయ్, మేపెయిర్ హోటల్స్ గ్రూపు వాళ్లు కూడా కడుతున్నారు. ఆ తరహాలో రహేజా గ్రూపు కూడా సెవెన్ స్టార్ లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణంలో మూడో గ్రూపు కానుంది. ఇవన్నీ విశాఖలో గొప్ప ప్రాజెక్టులుగా నిలుస్తాయి. అదే విధంగా హిందూపూర్‌లో కూడా 350 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, టెక్ట్స్‌టైల్స్‌కు సంబంధించిన పార్కు రాబోతుంది. దానివల్ల మరో 15వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు కూడా అడుగులు ముందుకు వేశాము... యుద్ధ ప్రాతిపదికన అది కూడా టేకప్ చేస్తామన్నారు. దానికి కూడా ప్రభుత్వం సపోర్టు చేస్తుంది. మేము మీకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాం ఈ రోజు మీ అందరి ద్వారా రహేజా గ్రూపు అధ్యక్షుడు నీల్‌కు చెప్తున్నాను. మేము మీకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాం. కేవలం ఒక్క ఫోన్‌కాల్ దూరంలోనే మీకు అందుబాటులో ఉంటాం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని... పెట్టుబడులు పెట్టండి. మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా... ఏపీలో పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా సహాయ, సహకారాలు అందిస్తామో మీరు కచ్చితంగా చూస్తారు. దేవుని దయవలన వీళ్లు మరింత బాగుపడి.. మన ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నాను. దీని తర్వాత ఆంధ్రాయూనివర్సిటీలో రూ.130 కోట్లతో హై ఎండ్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో విశాఖ అభివృద్ధికి దోహదపడతాయి అని సీఎం ప్రసంగం ముగించారు. -
CM Jagan Vizag Tour Photos: విశాఖ ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
దక్షిణాదిలోనే విశాఖ ఇనార్బిట్ మాల్ అతిపెద్దది
Updates: ► ఏయూ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్. ► ఆంధ్ర యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజిని, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ప్రసాద్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నబాబు రాజు పాల్గొన్నారు. ►జీవీఎంసీ పరిధిలో రూ. 136 కోట్ల రూపాయలతో 50 అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు.\ ఇనార్బిట్ మాల్తో 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్ మాల్ తయారు కాబోతుందని తెలిపారు. దక్షిణాదిలోనే విశాఖ మాల్ అతిపెద్దదని... రెండున్నర ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తారని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని.. మాల్ నిర్మాణంతో రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. ►విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్: సీఎం జగన్ ► ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించాలని రహేజా గ్రూప్ ఆసక్తిగా ఉంది. ► రహేజా గ్రూప్‌కు అన్ని విధాలుగా సపోర్టు ఇస్తాం. ► ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటాం. 👉విశాఖలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో మాల్‌ను నిర్మిస్తున్నారు. జీవీఎంసీ చేపట్టిన రూ. 136 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. 👉విశాఖపట్నం చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పూల వర్షంతో విశాఖ వాసులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది పనులు చూసి ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు మహిళలు భారీగా తరలి వచ్చారు. 👉 గన్నవరం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాలలో సీఎం పాల్గొననున్నారు. సాక్షి, అమరావతి: దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్‌కు విశాఖ వేదిక కానుంది. 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు అభివృద్ధి చేయనున్న ఇనార్బిట్ మాల్ తొలి దశ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం కానుంది. దీనికి అదనంగా పార్కింగ్ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేయనున్నారు. 2026 నాటికి దీన్ని అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు నిర్దేశించుకుంది. 250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్లకు వేదికగా మారనున్న ఈ మాల్ ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మాల్ నిర్మాణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. రెండో దశలో ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తారు. 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను 2027 నాటికి అందుబాటులోకి తెస్తారు. మూడో దశలో ఫోర్ స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్‌ను 200 గదులు, బాంకెట్ హాళ్లతో నిర్మిస్తారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిరి్మంచనున్నట్లు రహేజా గ్రూపు వెల్లడించింది. నేడు ఏయూలో పలు ప్రారంభోత్సవాలు విశాఖ పర్యటన సందర్భంగా మొత్తం రూ.864.88 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు నిర్వహించనున్నారు. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ చేపడుతున్న ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో పలు నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఏయూ క్యాంపస్‌లో సుమారు రూ.21 కోట్లతో స్టార్టప్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్ (ఏ హబ్)ను అభివృద్ధి చేశారు. 2025 నాటికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దనున్నారు. విభిన్న రంగాలకు చెందిన ఇంక్యుబేషన్ సెంటర్‌తోపాటు ఎనెక్స్ సెంటర్స్, ప్రోటోటైపింగ్/మేకర్స్ ల్యాబ్, స్టూడెంట్ ఐడియేషన్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.44 కోట్లతో ఫార్మా కంపెనీల కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఫార్మా ఇంక్యుబేషన్, బయోలాజికల్ మానిటరింగ్ హబ్‌ను సీఎం ప్రారంభిస్తారు. చదవండి: ఈనాడు బురద రాతలు.. వరద సహాయక చర్యలపైనా అక్కసు డిజిటల్ క్లాసులు, డిజిటల్ పరీక్షల కోసం రూ.35 కోట్లతో అల్గోరిథమ్ పేరుతో ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్‌ను నూతనంగా నిర్మించారు. అంతర్జాతీయ అనలిటిక్స్‌లో మాస్టర్ పోగ్రాములు నిర్వహించేలా ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్‌ను రూ.18 కోట్లతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్ ప్యాకేజింగ్‌లో నైపుణ్య శిక్షణ కోసం అవంతి ఫుడ్స్‌తో కలిపి రూ.11 కోట్లతో ఏయూ అవంతి ఆక్వా కల్చర్ స్కిల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ హబ్‌ను నెలకొల్పారు. వీటిని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి విద్యార్థులతో సంభాషిస్తారు. నూతన భవనాల ద్వారా 2025 నాటికి ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో విభిన్న రంగాలకు అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్‌గా తయారు అవుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం 350కుపైగా స్టార్టప్స్‌తోపాటు 150కు పైగా పేటెంట్లు, ట్రేడ్ మార్క్స్‌ను నమోదు చేస్తుందని అంచనా. ఈ హబ్స్ ద్వారా కనీసం 2,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించడమే కాకుండా ఎగుమతులు దిగుమతుల ద్వారా ఆరి్థక వ్యవస్థకు రూ.480 కోట్ల వరకు సమకూరనుంది. భారీ మానవహారంతో స్వాగతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 10.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రోడ్డుమార్గంలో సాలిగ్రామపురం వెళతారు. అక్కడ రూ.600 కోట్ల వ్యయంతో రహేజా గ్రూప్స్ ఇనార్బిట్ మాల్‌కు భూమి పూజ చేస్తారు. అనంతరం నగరంలో జీవీఎంసీ చేపడుతున్న మౌలిక సదుపాయాలు, రహదారులు, ముఖ్య కూడళ్ల అభివృద్ధి, స్మార్ట్ రోడ్డు, యూరోపియన్ తరహా ఈట్ స్ట్రీట్స్, అమృత్ 2.0లో భాగంగా చెరువుల అభివృద్ధి లాంటి రూ.135.88 కోట్ల విలువైన 50 పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. చదవండి: నారీ శక్తికి 'చేయూత' అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్ చేరుకొని విద్యార్థులకు కొత్త కోర్సులు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్‌లకు చేయూతనందించేలా రూ.129 కోట్లతో నిరి్మంచిన ఐదు భవనాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు బీచ్ రోడ్డు నుంచి బయలుదేరి 1.40కి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖ నుంచి తిరుగు పయనమవుతారు. విశాఖ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్మాల్ను నిర్మించే సాలిగ్రామపురం వరకు దాదాపు 9 కిలోమీటర్ల పొడవునా రహదారికి ఇరువైపులా మానవహారంగా ఏర్పడి సీఎం జగన్‌కు స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నెడ్‌క్యాప్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు పర్యవేక్షిస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కైలాసపురం వద్ద ఇనార్భిట్ మాల్ కు భూమిపూజ చేయనున్న సీఎం
-
సీఎం జగన్‌తో కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజా భేటీ..
సాక్షి, తాడేపల్లి: కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆయనతో పాటు ఇనార్బిట్ మాల్స్ సీఈఓ రజనీష్ మహాజన్, కె రహేజా గ్రూప్ ఆంధ్రా, తెలంగాణా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమానికి రావాలని సీఎం జగన్‌ను కె రహేజా గ్రూపు ప్రతినిధులు ఆహ్వానించారు. కాగా విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మించనున్నారు. మూడేళ్లలో కె రహేజా గ్రూప్ రాష్ట్రంలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఏపీలో మరిన్ని పెట్టుబడులపై సీఎం జగన్‌తో రహేజా గ్రూప్ ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్‌లు పాల్గొన్నారు. చదవండి: పెద్ద కష్టం తీరింది.. సర్వీస్ ఈనాం భూములపై సర్వ హక్కులు -
‘కాంబ్లీ దంపతులు క్షమాపణ చెప్పాలి’
సాక్షి, ముంబై : ముంబైలోని ఇనార్బిట్ మాల్లో తనను కొట్టిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, ఆయన భార్య ఆండ్రియా తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని గాయకుడు అంకిత్ తివారీ తండ్రి రాజేంద్ర కోరారు. రాజేంద్ర తనను ఉద్దేశపూర్వకంగా తాకాడని అందుకే తాను అతడిపై చేయి చేసుకున్నానని ఆండ్రియా చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆండ్రియా తన చేతిలో ఉన్న బ్యాగ్‌తో వృద్ధుడిని కొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తర్వాత ఆయనను బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి రాజేంద్ర (59)గా గుర్తించారు. ఆదివారం ముంబైలోని ఓ మాల్లో తాను అసభ్యకరంగా తాకానంటూ భర్త కాంబ్లీతో కలిసి ఆండ్రియా తనపై దాడిచేశారని ఘటనపై తన కుమారులకు చెప్పానని రాజేంద్ర తెలిపారు. వారు తమకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే కేసును కొనసాగిస్తామని చెప్పారు. రాజేంద్ర తనను అభ్యంతరకరంగా తాకిన తర్వాతే తాను ప్రతిఘటించానని, తనవైపు దూసుకొచ్చిన రాజేంద్ర అమర్యాదకరంగా వ్యవహరించడంతో పాటు దురుసు వ్యాఖ్యలు చేశాడని ఆండ్రియా తన చర్యను సమర్థించుకున్నారు. ఆయన కుమారులు వచ్చిన తర్వాత వారు తమతో ఘర్షణకు దిగారని, దీనిపై తాము ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని చెప్పారు. -
వివాదంలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య
-
కాంబ్లీ భార్యతో అసభ్య ప్రవర్తన
సాక్షి, ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్యతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. కాంబ్లీ భార్య ఆండ్రియా ఆ వృద్ధుడిపై చెయ్యి చేసుకోగా.. సదరు వృద్ధుడ్ని బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి రాజ్ కుమార్ తివారీగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో అంకిత్ సోదరుడు అంకుర్ తిరిగి కాంబ్లీ దంపతులతో వాగ్వాదానికి దిగారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మలాద్‌లోని ఇన్ఆర్బిట్ మాల్‌కు కాంబ్లీ-ఆండ్రియా వెళ్లారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ వృద్ధుడు ఆండ్రియాను తాకాడు. దీంతో కోపంతో ఆమె తన చేతిలోని బ్యాగుతో అతనిపై దాడి చేసింది. ఆ వెంటనే కాంబ్లీ జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. అయితే కాసేటికే ఆ వ్యక్తి కొడుకులమంటూ ఓ ఇద్దరు వ్యక్తులు కాంబ్లీ-ఆండ్రియాలతో గొడవకు దిగారు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవటంతో మాల్ సిబ్బంది జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటన తర్వాత కాంబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరోవైపు తివారీ సోదరులు కూడా బంగూర్ నగర్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. చెప్పుతో కొట్టింది... కాగా, తివారీ సోదరులు ఘటనపై మీడియాతో మాట్లాడుతూ కాంబ్లీ భార్యపై ఆరోపణలు గుప్పించారు. ‘తోపులాటలో నా తండ్రి పొరపాటున ఆమెను తాకాడు. వృద్ధుడని కూడా చూడకుండా ఆమె చెప్పుతో కొట్టింది. అందుకే వాళ్లను మేం నిలదీశాం. కానీ, కాంబ్లీయే మమల్ని బెదిరించాడు’ అని అంకుర్ చెబుతున్నాడు. అయితే కాంబ్లీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు. -
‘సొరంగం’ మారింది
ఇనార్బిట్ మాల్ నుంచి చిత్రపురి కాలనీ వరకు సొరంగ మార్గంతో సహా నిర్మించనున్న రోడ్ కనెక్టివిటీ పనుల టెండర్లను ఈపీసీ పద్ధతిలో పిలిచేందుకు సిద్ధమయ్యారు. తొలుత యాన్యుటీ పద్ధతిలో టెండర్లు పిలవాలని నిర్ణయించిన అధికారులు.. అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. అయితే గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈపీసీ పద్ధతికి ఆమోదం తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: ఇనార్బిట్ మాల్ నుంచి చిత్రపురి కాలనీ వరకు సొరంగమార్గంతో సహ నిర్మించనున్న రోడ్ కనెక్టివిటీ పనుల టెండర్లను ఈపీసీ పద్ధతిలో పిలవాలిచేందుకు సిద్ధమయ్యారు. తొలుత ఈ పనుల కోసం యాన్యుటీ పద్ధతిలో టెండర్లు పిలిచేందుకు అన్నీ సిద్ధం చేసిన అధికారులు అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. రేపో మాపో అనుమతి రాగానే ఇక టెండర్లు పిలవాలనుకుంటున్న తరుణంలో ఈపీసీలో టెండర్లు పిలిచేందుకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయం ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించింది. దీంతో టెండర్ల ప్రక్రియకు మరికొంత జాప్యం జరగనుంది. అంతేకాదు.. ఈపీసీ పద్ధతిలో నిర్మించేందుకు సిద్ధం కావడంతో ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం నిధుల్ని జీహెచ్ఎంసీయే భరించాల్సి ఉంది. అంటే.. జీహెచ్ఎంసీ నెత్తిన మరో రూ.875 కోట్ల భారం పడనుంది. యాన్యుటీ పద్ధతిలో అయితే కాంట్రాక్టు పొందే సంస్థే తొలుత పెట్టుబడి పెడుతుంది. నిర్ణీత వ్యవధుల్లో దానికి చెల్లింపులు చేస్తారు. అలా తొలుత ఇనార్బిట్ మాల్ నుంచి ఫీనిక్స్ జంక్షన్ వరకు పనులు చేయాలనుకున్నారు. అందుకు దాదాపు రూ.1535 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఆమేరకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేలోగా ఈ ప్రాజెక్టును యాన్యుటీ స్థానే ఈపీసీ పద్ధతిలో చేపట్టాలని ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచించారు. అందుకనుగుణంగా స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సొరంగ మార్గం లెక్క ఇదీ.. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇనార్బిట్ మాల్ వైపు నుంచి ఖాజాగూడ జంక్షన్ వరకు సొరంగ మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండు సొరంగ మార్గాలు ఒక్కొక్కటి నాలుగు లేన్ల క్యారేజ్‌వేలతో ఏర్పాటు చేస్తారు. సొరంగం పొడవు 502.91 మీటర్లు. దీని అంచనా వ్యయం రూ. 215 కోట్లు. మారిన ప్రణాళిక.. ♦ ఖాజాగూడ నుంచి ఓఆర్ఆర్ దాటి విప్రో జంక్షన్ వైపు ఫీనిక్స్ రోడ్ వరకు సాఫీ ప్రయాణానికి రూపొందించిన ప్రణాళికలో మార్పు చేశారు. చిత్రపురి కాలనీ వరకు రూ.875 కోట్లతో పూర్తవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ.100 కోట్లు భూసేకరణకు ఖర్చు కానుంది. రూ.875 కోట్లే కనుక యాన్యుటీ అవసరం లేదని మంత్రి అభిప్రాయపడిన నేపథ్యంలో తాజాగా ఈపీసీకి సిద్ధమయ్యారు. ♦ ఎస్సార్డీపీలో భాగంగా రూ.2631 కోట్లతో 18 జంక్షన్ల వద్ద మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు తదితర పనులకు తొలుత యాన్యుటీ విధానంలోనే టెండర్లు పిలిచారు. కానీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడంతో వాటిని రద్దు చేసి వెయ్యికోట్ల మేర పనుల్ని ఈపీసీ విధానంలో పిలిచారు. ప్రస్తుతం ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. ♦ ఎస్సార్డీపీ పనులకు అవసరమైనన్ని నిధులు జీహెచ్ఎంసీ వద్ద లేకపోవడంతో బాండ్ల ద్వారా వెయ్యి కోట్లు సేకరించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా తొలివిడత రూ. 200 కోట్లు సేకరించారు. అవి దాదాపుగా ఖర్చయ్యాయి. మలివిడతగా మరో రూ.200 కోట్లు బాండ్ల ద్వారా సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు కూడా నిధుల్ని సేకరించాల్సి రావడంతో జీహెచ్ఎంసీపై భారం పెరగనుంది. నిధులు సేకరించినా తిరిగి ఎలా చెల్లిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులోని ముఖ్యమైన పనులు ఇవే.. ♦ దుర్గం చెరువు కేబుల్ స్టే బ్రిడ్జి కింద జంక్షన్‌ను అభివృద్ధి చేస్తారు. అక్కడి నుంచి టన్నెల్ వైపు రహదారిపై ఆయా ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ నిర్మాణం ♦ టన్నెల్ వైపు నుంచి కేబుల్ స్టే బ్రిడ్జి వైపు కూడా ఇదే తరహాలో నిర్మాణం ♦ కేబుల్ స్టే బ్రిడ్జి, ఇనార్బిట్ మాల్ వైపు నుంచి టన్నెల్ వైపు ఫ్లై ఓవర్ ♦ టన్నెల్ వైపు నుంచి ఇనార్బిట్ మాల్ రోడ్ వైపు ఫ్లై ఓవర్ ♦ హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్ నుంచి టన్నెల్ వైపు వచ్చేవారి కోసం రోడ్డు వెంబడి ఎడమవైపు లూప్ ♦ టన్నెల్ నుంచి నానక్‌రామ్‌గూడ, ఓఆర్ఆర్ వైపు వెళ్లేవారికి అనువుగా చిత్రపురి కాలనీవైపు రెండో వరుసలో ఫ్లై ఓవర్ (ఇది రెండు వైపులా ఉంటుంది) ♦ బయో డైవర్సీటీ/గచ్చిబౌలి/ లింగంపల్లి వైపు నుంచి టన్నెల్ వైపు ఆప్ ర్యాంప్ ♦ టన్నెల్ వైపు నుంచి మూడు లేన్ల డౌన్ ర్యాంప్ రెండు లేన్లుగా విడిపోయి మెహదీపట్నం వైపు.. రెండు లేన్ల కుడివైపు లూప్ రెండో వరుస ఫ్లై ఓవర్‌ను మొదటి వరుస ఫ్లై ఓవర్ వద్ద (ఖాజాగూడ జంక్షన్) దాటి లింగంపల్లి/బయోడైవర్సిటీ వైపు వెళ్తుంది ♦ ఖాజాగూడ జంక్షన్ వద్ద అండర్‌పాస్ ♦ కేబుల్ స్టే బ్రిడ్జి కింద, ఖాజాగూడ వద్ద రోటరీలు గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశంలోని ముఖ్య నిర్ణయాలు.. ♦ ఇనార్బిట్ మాల్ నుంచి చిత్రపురి కాలనీ వరకు రూ.875 కోట్లతో రోడ్నెట్వర్క్ పనులు ♦ జీహెచ్ఎంసీ అధికారులకు ఈఈఎస్ఎల్ ద్వారా అద్దెకు 20 ఎలక్ట్రిక్ వాహనాలు ♦ 26 చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు పనులకు రూ.7.55 కోట్లు ♦ హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ వద్ద రూ.59.09 కోట్లతో ఆర్యూబీ, కల్వర్టుల నిర్మాణం ♦ జీహెచ్ఎంసీలో మూడేళ్ల వరకు పద్దుల నిర్వహణ, ఈఆర్పీల నిర్వహణకు బ్లూమ్ సొల్యూషన్స్‌కు రూ.12.93 కోట్లు ♦ మూడేళ్ల వరకు ఆటోమేటిక్ వెహికల్ ట్రాకింగ్, జీపీఎస్/జీపీఆర్ఎస్తో డస్ట్బిన్ల నిర్వహణకు రూ.5.67 కోట్లు ♦ ఇబ్రహీం నాలాపై రూ.14.70 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం ♦ డిప్యూటీ మేయర్ కార్యాలయం ఇంప్రెస్ట్ వ్యయం రూ.35 వేలకు పెంపు ♦ రూ.40 కోట్లతో చిక్కడపల్లి మోడల్ మార్కెట్ నిర్మాణం -
ఇనార్బిట్ మాల్‌పై కేసు నమోదు
గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్ మాల్‌పై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. పార్కింగ్ వసూళ్లపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ కళింగరావు తెలిపారు. ఇనార్బిట్ మాల్లో కారు ఐదు నిమిషాలు పార్కింగ్ చేసినందుకు రూ.30 వసూలు చేశారని అవినీతి నిరోధక సంస్థ కార్యకర్త విజ య్ గోపాల్ ఆగస్టు 25న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసు కున్న పోలీసులు మాల్ మేనేజ్మెంట్, పార్కి ంగ్ నిర్వాహకులను విచారిస్తామన్నారు. -
ఇన్అఆర్బిట్ మాల్లో హిరో నిఖిల్ సందడి
-
హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్ : త్రిష
-
బతుకమ్మ పాటలతో ఆకట్టుకున్న చిన్నారులు
-
ఇనార్భిట్ మాల్లో సురభి సందడి
మాదాపూర్ : జెంటిల్మెన్ సినిమా ఫేమ్ సురభి మాదాపూర్‌లోని ఇనార్భిట్ మాల్లో సందడి చేసింది. ఒప్పో మొబైల్ ఎఫ్–1 సెల్ఫీ ప్రొమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. వివిధ పోటీల ద్వారా గెలుపొందిన విజేతలకు మొబైల్స్‌ను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓఫో మొబైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ట్రూ కాలర్ యాప్, ఫేస్ బుక్ లు పట్టించేశాయి..
హైదరాబాద్ : మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో జరిగిన రూ.1.21 లక్షల విలువైన రాడో వాచ్ చోరీ కేసును పోలీసులు ఫేస్బుక్, ట్రూ కాలర్ యాప్, సీసీ కెమెరాల సాయంతోనే చేధించారు. సాధారణ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సింపుల్ ఇన్వెస్టిగేషన్ చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శశాంక్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి గురువారం నిందితుల్ని అరెస్టు చేయగలిగారు. సరదాగా వచ్చి చోరీ చేసి... కూకట్‌పల్లికి చెందిన బీటెక్ విద్యార్థులు ఆర్.సుహాస్ చౌదరి, జి.తేజ గత నెల 9న మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌కు వెళ్లారు. అటూ ఇటు తిరిగిన ఈ ద్వయం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాల్లో ఉన్న ఇతోస్ వాచ్ స్టోర్‌లోకి ప్రవేశించారు. కొద్దిసేపు వాచీలను ఖరీదు చేసే నెపంతో పరిశీలించారు. షాపు యజమాని మరో వినియోగదారుడితో మాట్లాడుతుండగా.. అదను చూసి రూ.1.21 లక్షల విలువైన రాడో కంపెనీ వాచ్‌ను తస్కరించారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ నుంచి జారుకున్న ద్వయం తమ బైక్‌పై మాదాపూర్ వైపు వెళ్లిపోయారు. తన దుకాణంలో వాచ్ చోరీకి గురైందని గుర్తించిన యజమాని అదే రోజు మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలిచ్చిన సీసీ కెమెరాలు... ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన ఇన్స్పెక్టర్ శశాంక్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రాథమికమైన ఆధారాలపై దృష్టి పెట్టింది. తొలుత మాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుల ఫుటేజ్ సేకరించింది. ఎంట్రీ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఇద్దరూ ఓ క్యారీబ్యాగ్ తీసుకుని లోపలకు వచ్చినట్లు రికార్డయ్యింది. మాల్‌కు సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులూ పల్సర్ వాహనంపై వచ్చి వెళ్లినట్లు వెల్లడైంది. యాప్స్, సోషల్ మీడియా ద్వారా క్లూస్... సీసీ టీవీ ఫీడ్‌లో ఉన్న వాహనం నంబర్‌ను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఆర్టీఏ అధికారుల సాయంతో రిజిస్టర్ అయి ఉన్న చిరునామా, రికార్డుల్లో పొందుపరిచిన సెల్‌ఫోన్ నంబర్ సేకరించారు. అయితే వాహనాన్ని ప్రస్తుతం రిజిస్టర్ చేసుకున్న యజమాని (నిందితుడు) వినియోగిస్తున్నాడా? చేతులు మారిందా? అనే అంశాలను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారి యాప్స్, సోషల్ మీడియాలను ఆశ్రయించారు. ఆ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా మొబైల్ యాప్ ట్రూ కాలర్‌లో, ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న పేరును సోషల్ మీడియా ఫేస్‌బుక్స్‌లో సెర్చ్ చేశారు. వాటిలో ఉన్న ఫొటో, సీసీ కెమెరా ఫీడ్స్‌లో నమోదైన ఫీడ్‌లోని దాంతో సరిపోలడంతో అతడే నిందితుడిగా గుర్తించారు. గురువారం నిందితులు ఉంటున్న ఇంటిపై దాడి చేసి ఇద్దరినీ అరెస్టు చేయడంతో పాటు వాచ్ రికవరీ చేశారు. -
కళ్లు లేకుంతే ఎలా ఉంటుంది
-
ఇనార్భిట్మాల్పై దాడులు