
ఇనార్బిట్ మాల్‌పై కేసు నమోదు
ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్ మాల్‌పై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. పార్కింగ్ వసూళ్లపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ కళింగరావు తెలిపారు.
గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్ మాల్‌పై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. పార్కింగ్ వసూళ్లపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ కళింగరావు తెలిపారు. ఇనార్బిట్ మాల్‌లో కారు ఐదు నిమిషాలు పార్కింగ్ చేసినందుకు రూ.30 వసూలు చేశారని అవినీతి నిరోధక సంస్థ కార్యకర్త విజ య్ గోపాల్ ఆగస్టు 25న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసు కున్న పోలీసులు మాల్ మేనేజ్‌మెంట్, పార్కి ంగ్ నిర్వాహకులను విచారిస్తామన్నారు.