సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తమకు కష్టం వచ్చిందని సీఎం జగన్‌ను కలిసిన బాధితులకు తానున్నానంటూ భరోసా కల్పించారు. మంగళవారం విశాఖ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఇనార్బిట్‌మాల్‌కు చేరుకున్న క్రమంలో అక్కడ ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్న గవిడి ఢిల్లీశ్వరరావు(19) తన తల్లి సంతోషితో కలిసి వేచి ఉన్నాడు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి రావడంతో అతన్ని పరామర్శించారు.
తన కుమారుడు పుట్టుకతో ఆర్దోపెడిక్ సమస్య తో బాధపడుతున్నాడని సీఎం జగన్‌కు బాధితుని తల్లి సంతోషి తెలిపారు. వారి సమస్యను విన్న సీఎం జగన్ గవిడి ఢిల్లీశ్వరరావుకి వైద్య సేవలు నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జనను ఆదేశించగా తక్షణమే వైద్య సేవలు నిమిత్తం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మరో బాధితుడు మోహన్(17)ను కూడా ఇన్‌ఆర్బిట్ మాల్ వద్దే సీఎం జగన్ పరామర్శించారు. ఆ యువకుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెందుర్తి మండలం వేపగుంటకు చేందిన వీరవల్లి మోహన్ తాను 4వ అంతస్తూ నుండి పడిపోయానని, వెన్నపూస దెబ్బ తిన్నదని ఆరోగ్య శ్రీ లో వైద్యం పొందినట్లు తెలిపారు. ఇంకా కోలుకోలేదని, వైద్య సేవల నిమిత్తం సహాయం కోరగా ముఖ్యమంత్రి స్పందిచి ఫిజియో థెరపీ వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున వీరవల్లి మోహన్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment