రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఏపీలోని పలు గమ్యస్థానాలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 రైళ్ల సర్వీసుల గమ్యస్థానాలను రైల్వేశాఖ పొడిగించింది. వీటిలో గుంటూరు– విశాఖ (22701/22702) రైలు విశాఖ, విజయవాడ,గుంటూరు మీదుగా ప్రయాణిస్తోంది. మిగిలిన 2 రైళ్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. వాటిలో నర్సాపూర్–హుబ్లీ (17225/17226) రైలు గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు.
నంద్యాల–రేణిగుంట (07285/07284) రైలు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, కంభాలపల్లె స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. ఈ రైళ్ల సర్వీసులను శుక్రవారం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రజాప్రతినిధుల సమక్షంలో గుంటూరు రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు శుక్రవారం నుంచే ప్రయాణికుల సేవల్లోకి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment