లక్ష్మీపురం/సాక్షి–అమరావతి: మూడు రైలు సర్వీసుల పొడిగింపు ఏపీ ప్రజలకు మేలు చేస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం మూడు రైలు సర్వీసులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం–గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు గుంటూరు డివిజన్ వాసులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇకపై ఈ రైలు గుంటూరు నుంచి ప్రయాణిస్తుందని తెలిపారు. అలాగే నర్సాపూర్–హుబ్లీ–నర్సాపూర్ అమరావతి ఎక్స్‌ప్రెస్, నంద్యాల–రేణిగుంట నంద్యాల ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను కూడా ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
నర్సాపూర్–హుబ్లీ ఎక్స్‌ప్రెస్ కోస్తాంధ్రా నుంచి కర్ణాటక ప్రాంతానికి అదనపు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. నంద్యాల–రేణిగుంట ప్రత్యేక రైలు ద్వారా తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లేందుకు యాత్రికులకు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం రామకృష్ణ, నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు, డివిజన్ ఏడీఆర్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
పదేళ్లలో నంబర్‌వన్‌గా భారత్ రైల్వే
రైల్వే నెట్‌వర్క్‌లో ప్రపంచంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడారు. ఏపీకి రైల్వే బడ్జెట్ కేటాయింపులను రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచామని పేర్కొన్నారు.
41 వందేభారత్ రైళ్లలో ఐదు రైళ్లు ఏపీకి కేటాయించామని చెప్పారు. ఏపీలో 371 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు నిర్మించినట్టు తెలిపారు. రూ.38,600కోట్లతో దేశంలో రైల్వేలైన్ల విద్యుద్దీకరణను పెంచామన్నారు. 2018– 23 మధ్య కాలంలో రైల్వేశాఖ దేశంలో మూడు లక్షలమందికి ఉపాధి అవకాశాలు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment