తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ: విశాఖలో గురువారం బయల్దేరాల్సిన విశాఖ–సికింద్రాబాద్ (20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు రైలుని రద్దు చేసి మరో రైలులో ప్రయాణికులను సికింద్రాబాద్‌కు పంపారు. డీఆర్‌ఎం సౌరభ్‌ప్రసాద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విశాఖ నుంచి ఈ స్పెషల్ రైలు ఏర్పాటు చేశారు.
ఈ రైలు విశాఖలో ఉదయం 7 గంటలకు బయల్దేరింది. వందేభారత్ మార్గంలో అదే హాల్ట్స్‌తో ఈ రైలు సికింద్రాబాద్ చేరుకుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్పెషల్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో అదే హాల్ట్స్‌తో విశాఖ చేరుకోనుంది. కాగా, వందే భారత్ రద్దు చేయడంపై అన్ని రైల్వే స్టేషన్‌ల్లో ప్రకటనలు, మెసేజ్‌ల ద్వారా ప్రయాణికులకు సమాచారమిచ్చి,
ప్రతి రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. ప్రయాణం రద్దు చేసుకున్న వారికి పూర్తిగా నగదు రిఫండ్ చేశారు. ప్రత్యేక రైలులో ప్రయాణం చేసిన ప్రయాణికులకు వ్యత్యాసం నగదు రిఫండ్ చేశారు. ఈ రైలులో వందే భారత్ రైలు సేవలతో సమానంగా క్యాటరింగ్ ఏర్పాట్లు కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment