technical fault
-
సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం
కొమరంభీం జిల్లా: కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌కు సాంకేతిక లోపం తెలెత్తింది. సిర్పూర్లో హెలికాఫ్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్ చాపర్‌ను నిలిపివేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం ఆసిఫాబాద్ బయలుదేరారు. సోమవారం కూడా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సీఎం కేసీఆర్‌కు ప్రమాదం తృటిలో తప్పిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాఫ్టర్ బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైకి లేచిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. కాగా, సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. సిర్పూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. -
‘వందేభారత్’లో సాంకేతిక లోపం
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ: విశాఖలో గురువారం బయల్దేరాల్సిన విశాఖ–సికింద్రాబాద్ (20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు రైలుని రద్దు చేసి మరో రైలులో ప్రయాణికులను సికింద్రాబాద్‌కు పంపారు. డీఆర్ఎం సౌరభ్‌ప్రసాద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విశాఖ నుంచి ఈ స్పెషల్ రైలు ఏర్పాటు చేశారు. ఈ రైలు విశాఖలో ఉదయం 7 గంటలకు బయల్దేరింది. వందేభారత్ మార్గంలో అదే హాల్ట్స్‌తో ఈ రైలు సికింద్రాబాద్ చేరుకుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్పెషల్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో అదే హాల్ట్స్‌తో విశాఖ చేరుకోనుంది. కాగా, వందే భారత్ రద్దు చేయడంపై అన్ని రైల్వే స్టేషన్ల్లో ప్రకటనలు, మెసేజ్‌ల ద్వారా ప్రయాణికులకు సమాచారమిచ్చి, ప్రతి రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణం రద్దు చేసుకున్న వారికి పూర్తిగా నగదు రిఫండ్ చేశారు. ప్రత్యేక రైలులో ప్రయాణం చేసిన ప్రయాణికులకు వ్యత్యాసం నగదు రిఫండ్ చేశారు. ఈ రైలులో వందే భారత్ రైలు సేవలతో సమానంగా క్యాటరింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. -
విమానంలో భయానక అనుభవం ..
వాషింగ్టన్: సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పీడన సమస్యను అధిగమించేందుకు విమానాన్ని మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల మేర దించాల్సి వచ్చినట్లు పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఫాక్స్ న్యూస్‌కు తెలిపింది. నార్త్ కరొలినాలోని చార్లొట్టె నుంచి ఫ్లోరిడాలోని గైన్స్విల్లెకు వెళ్తున్న పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి గమ్యస్థానానికి చేరుకుని సురక్షితంగా ల్యాండయింది. ‘టేకాఫ్ తీసుకున్న 43 నిమిషాల తర్వాత 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో సమస్య మొదలైంది. క్యాబిన్లో పీడనం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే మొత్తం 18,600 అడుగులు కిందికి దిగింది’అని ఫ్లైట్అవేర్ డేటా విడుదల చేసింది. ఘటనపై హారిసన్ హోవ్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘కాలుతున్న వాసన, పెద్ద శబ్దం, చెవుల్లో హోరు’తో గగుర్పాటు కలిగించిందని పేర్కొన్నారు. కేబిన్‌లో కాలుతున్న వాసన, పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు ఆక్సిజన్ మాసు్కలతో గాలి పీల్చుకుంటున్న ఫొటోను హారిసన్ షేర్ చేశారు. -
హైదరాబాద్ మెట్రో రైల్ లో సాంకేతిక లోపం
-
సింహాద్రిలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
పరవాడ/పెదగంట్యాడ/సీలేరు: అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల 4 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 2వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింహాద్రి ఎన్టీపీసీలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను కలపాక, గాజువాక 400 కేవీ సబ్స్టేషన్లకు సరఫరా చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం వల్ల సబ్స్టేషన్ల లైన్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సింహాద్రి ఎన్టీపీసీలోని 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన సాంకేతిక నిపుణులు.. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి కల్లా నాలుగో యూనిట్ నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరుగుతుందని, బుధవారం ఉదయానికి మిగిలిన 3 యూనిట్ల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. హిందూజా, సీలేరులోనూ అంతరాయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల సాంకేతిక లోపం తలెత్తడంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోనూ 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. పెందుర్తి 400 కేవీ సబ్‌స్టేషన్ నుంచి గ్రిడ్‌కు వెళ్లాల్సిన లైన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో యూనిట్లు ట్రిప్ అవ్వడంతో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖ, అనకాపల్లి, పాడేరు జిల్లాల్లోని పలు చోట్ల తెల్లవారుజామున 3.15 నుంచి 5 గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యను పరిష్కరించి విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో కలపాక వద్ద గల సబ్‌స్టేషన్‌లో హై ఇన్సులేషన్ ఫీడర్ ఆగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేశారు. ఈ విమానం ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవటంతో సుమారు 170మంది ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.