సాక్షి, విశాఖపట్నం: తమ సమస్యను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్థం చేసుకుని ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించడం ద్వారా జర్నలిస్టుల కుటుంబాల్లో దీపావళికి ముందే వెలుగులు నింపారని విశాఖపట్నం జిల్లా జర్నలిస్టులు హర్షం వ్యక్తంచేశారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో ఆదివారం ఉదయం స్థానిక బీచ్ రోడ్డులో ‘సీఎం వైఎస్ జగన్‌కు విశాఖ జర్నలిస్టుల వందనం’ పేరుతో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. సీ హారియర్ మ్యూజియం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు కొనసాగిన ర్యాలీలో జర్నలిస్టులు థాంక్యూ సీఎం సార్.. అంటూ నినాదాలు చేశారు. బీచ్ రోడ్డులో ఉన్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు కేజీ రాఘవేంద్రారెడ్డి, జి.జనార్థన్, అధ్యక్షుడు బి.రవికాంత్, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆర్.రామచంద్రరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు నారాయణ, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు అశోక్, చందూయాదవ్, పీఎన్ మూర్తి, సాంబశివరావు, దుక్కా మురళీకృష్ణరెడ్డి, కోయిలాడ పరుశురాం, బందరు శివప్రసాద్, ఉప్పల భాస్కరరావు, ప్రసాద్, ఈశ్వర్, రవిచంద్రతోపాటు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment